STOCKS

News


మార్కెట్‌కు ‘ట్రంప్‌ ట్వీట్‌’ జోష్‌

Friday 2nd November 2018
Markets_main1541137423.png-21651

- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌
- వాణిజ్య అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ట్వీట్‌
- 2 శాతం మేర లాభపడిన ఆసియా మార్కెట్లు

- ఒకటిన్నర శాతం లాభాల్లో దేశీ సూచీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ట్వీట్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను రంకెలు వేయించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడానని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్న అనంతరం మార్కెట్లలో ఒక్కసారిగా బుల్‌ పట్టు పెరిగిపోయింది. వాణిజ్య యుద్ధ భయాలతో గత కొంతకాలంగా ఒడిదుడుకుల మధ్య కొనసాగిన ఆసియా సూచీలు.. శుక్రవారం ప్రారంభంలో 2 శాతం మేర లాభాలను నమోదుచేశాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం ఒక శాతానికి మించి లాభాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 1.06 శాతం లాభపడగా.. నాస్‌డాక్‌ 1.75 శాతం, ఎస్‌ అండ్‌ పీ 1.06 శాతం లాభాల్లో ముగిశాయి. ట్వీట్‌ జోష్‌తో ఆసియా మార్కెట్లు 2 శాతానికి మించి లాభాల్లో కొనసాగాయి. శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి జపాన్‌ సూచీ నికాయ్‌ 2.26 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. చైనా స్టాక్‌ సూచీ షాంఘైకాంపోజిట్‌ ఇండెక్స్‌ 2.05 శాతం లాభాల్లో ఉంది. ఇక హాంగ్‌కాంగ్‌ సూచీ హాంగ్‌సెంగ్‌ 3.63 శాతం లాభాల్లో ముగిసింది. ఇదే సమయానికి దేశీ మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 542 పాయింట్లు లాభపడి.. 34,974 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 10,554 వద్ద కొనసాగుతోంది.

సానుకూల వాతావరణానికి అవకాశం..!
ట్రంప్‌ ట్వీట్‌ చూస్తుంటే అగ్రదేశానికి చైనాకి మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం త్వరలోనే ముగియనుందనే అంచనాలు వెలువడుతున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జిన్ పింగ్‌తో ఒక మంచి, సుదీర్ఘ సంభాషణ జరిగిందని స్వయంగా ట్రంప్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. చాలా అంశాలపై మాట్లాడుకున్నట్లు వెల్లడించిన ఆయన.. వాణిజ్య అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు. ఉత్తర కొరియా అంశంపై కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలోనే అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సమావేశానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ట్రంప్‌ వెల్లడించిన నేపథ్యంలో మార్కెట్లలో సానుకూల వాతావరణం అలుముకుంది. 

 



You may be interested

పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ

Friday 2nd November 2018

లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం పసిడి ధర నష్టాల్లో బాట పట్టింది. అమెరికా మార్కెట్లో గురువారం రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 16నెలల గరిష్టస్థాయి నుంచి దిగిరావడంతో అక్కడ ఔన్స్‌ పసిడి 23డాలర్లు లాభపడి 1238.60డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో నవంబర్‌ 06న జరిగే మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత పాలక పక్షమైన రిపబ్లిక్‌ పార్టీపై ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్‌ విజయం సాధిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టీసీఎస్‌:- లండన్‌కు చెందిన వీ12 స్టూడియో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. కోల్‌ ఇండియా:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో వాటా విక్రయ ప్రక్రియ గురువారం పూర్తి చేసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5300 కోట్లను సమీకరించింది. ఐనాక్స్‌ లైస్యూర్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.241.71 చొప్పున మొత్తం 64లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లకు

Most from this category