STOCKS

News


ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో స్వల్ప అంతరాయం

Wednesday 11th July 2018
Markets_main1531328013.png-18221

న్యూఢిల్లీ: ప్రముఖ కమోడిటీ ఎక్స్చేంజ్‌, ఎమ్‌సీఎక్స్‌లో ఉదయం  ట్రేడింగ్‌ దాదాపు గంట పాటు నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల ట్రేడింగ్‌ నిలిచిపోయిందని, దీనికి గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నామని ఎంసీఎక్స్‌ తెలిపింది. ఉదయం గం.11.46 ని. సమయానికి ట్రేడింగ్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య ఎదురైందని ఎమ్‌సీఎక్స్‌ తెలిపింది. దీంతో ట్రేడింగ్‌ సిస్టమ్‌ను మళ్లీ ప్రారంభించామని, సభ్యులు కూడా రీ-లాగిన్‌ అయ్యారని వివరించింది. 12.40 నుంచి 12.55 వరకూ ​‍ఒక ప్రత్యేక సెషన్‌లో  పెండింగ్‌ ఆర్డర్లను రద్దు చేసుకునే అవకాశం సభ్యులకు కల్పించామని పేర్కొంది. గం.12.56 తర్వాత ​మళ్లీ ట్రేడింగ్‌ ప్రారంభమైందని ఎమ్‌సీఎక్స్‌ వివరించింది. 



You may be interested

డెక్కన్‌ క్రానికల్‌ ఆస్తుల అమ్మకం?

Wednesday 11th July 2018

ఈ నెల 17న తేలనున్న భవితవ్యం అప్పులు రూ.10 వేల కోట్లపైమాటే హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ ఆస్తుల వేలం తప్పదా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే జరిగేట్టుంది. కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా శ్రేయి ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌కు చెందిన విజన్‌ ఇండియా ఫండ్‌ ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు (రిసొల్యూషన్‌ ప్లాన్‌) రుణదాతల నుంచి ఆమోద ముద్ర పడలేదు. శ్రేయి ప్రతిపాదనపై జరిగిన ఈ-ఓటింగ్‌లో

ఐడీబీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

Wednesday 11th July 2018

ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ అయిదు

Most from this category