STOCKS

News


కీలక మద్దతుల వద్ద కొనుగోళ్లకు ఛాన్స్‌

Monday 22nd April 2019
Markets_main1555912987.png-25257

సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం సూచీలు నష్టాల్లో ఆరంభమ్యాయి. నిఫ్టీ కీలక 11700 పాయింట్లకు దిగువన ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పతనం, ఎన్నికల అస్థిరత తదితర అంశాలు సూచీలను కుంగదీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్దకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా లాంగ్‌ పొజిషన్లకు 11550 పాయింట్లను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. షార్ట్‌ పొజిషన్లకు 11860 పాయింట్లను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. నిఫ్టీకి 11650, 11600, 11500, 11550 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుంది. పైకి ఎగిస్తే 11700- 11760 పాయింట్ల మధ్య నిరోధం ఉండొచ్చు. దీనిపైన 11800 పాయింట్ల వద్ద నిరోధం ఉంటుంది. దీన్ని కూడా దాటితే క్రమంగా 12వేల పాయింట్ల వరకు ఎగబాకవచ్చు. దిగువన 11550- 11500 పాయింట్ల జోన్‌ను కోల్పోతే క్రమంగా 11400, 11300 వరకు దిగజారుతుంది. ఈవారం డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ సందర్భంగా తీవ్ర కదలికలకు ఆస్కారం ఉంటుంది. నిఫ్టీ కొన్నాళ్ల పాటు 11550- 11750 రేంజ్‌లోనే కదలాడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకునిఫ్టీలో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పడినందున అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. 



You may be interested

క్యూ4 ఫలితాలతో దిశా నిర్దేశం

Monday 22nd April 2019

- ఏప్రిల్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే.. - కొనసాగుతున్న పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఏసీసీ ఫలితాల వెల్లడి ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్‌ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 22nd April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎల్‌ అండ్‌ టీ:- ఎలక్ట్రానిక్స్‌, అటోమెషన్‌ రంగంలో సేవలు అందించే సచీంద్ర అండ్‌ మాక్రితి విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. స్పైస్‌ జెట్‌:- విమానయాన రంగంలో కీలకమైన సాంకేతిక కోడ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఎమిరేట్స్‌ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  బోరోసిల్‌ గ్లాస్‌వర్క్స్‌:- అనుబంధ సంస్థ క్లాస్‌ప్యాక్‌లో అదనంగా రూ.5 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.  మెజెస్కో:- క్లౌడ్‌ రంగంలో తన సేవలను విస్తరించుకునేందుకు రెడీ-టు-యూజ్‌ యాప్‌ను

Most from this category