STOCKS

News


వాణిజ్య ఘర్షణలున్నా మార్కెట్లు ముందుకే: ప్రభుదాస్‌

Thursday 12th July 2018
Markets_main1531335734.png-18234

అమెరికా, చైనాలు సుంకాల పోరు మొదలు పెట్టినప్పటికీ, దేశీయ మార్కెట్లు ముందుకే వెళతాయంటోంది ప్రభుదాస్‌ లీలాధర్‌ సంస్థ. మనదేశ ఆర్థిక వృద్ధిపై వీటి ప్రభావం ఉండదని, ఇక్కడి మార్కెట్లు వచ్చే ఆరు నెలల్లో కొత్త స్థాయిలకు చేరతాయని ప్రభుదాస్‌ లీలాధర్‌ సంయుక్త ఎండీ దిలీప్‌ భట్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

ప్రశ్న: ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి పనితీరు చూపిస్తున్నాయి. ఇవి ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందా?
ర్యాలీకి అవకాశం ఉంది. టీసీఎస్‌ ఫలితాల్లో స్థిరమైన కరెన్సీ వృద్ధి, అన్ని విభాగాల్లోనూ చక్కని వృద్ధి కనిపించింది. ఇది చాలా ప్రోత్సాహకరంగానూ ఉంది. ఇతర ప్రధాన ఐటీ కంపెనీలకు ఇదే విధమైన ఫలితాలను ఆపాదిస్తే మంచి సానుకూలతలే. కనుక ఇక్కడి నుంచి కూడా ఐటీ స్టాక్స్‌ పెరిగేందుకు అవకాశం ఉంది. ఎంత వరకు అంటే, 10-15 శాతం వరకు ప్రముఖ ఐటీ కంపెనీల స్టాక్స్‌ పెరిగేందుకు అవకాశం ఉంది. డాలర్‌తో రూపాయి క్షీణత చూస్తున్నాం. ఇది కొన్నింటికి మద్దతుగా నిలుస్తుంది.

ప్రశ్న: అమెరికా, చైనా ఘర్షణల నేపథ్యంలో ఏం జరగబోతోంది?
వాణిజ్య ఘర్షణలన్నవి మార్కెట్లో అస్థిరతకు కారణమవుతున్నాయి. కానీ, ఇది మొత్తం మీద భారత వృద్ధి విధానానికి విఘాతం కలిగిస్తుందని అనుకోవడం లేదు. భారత మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. వచ్చే ఆరు నెలల్లో మార్కెట్లు చెప్పుకోతగ్గ గరిష్టాలకు చేరతాయి. ఆటో రంగం మొత్తం మంచి పనితీరు ప్రదర్శిస్తోంది. ఇది దేశ ఆర్థిక రంగంపై పలు రకాలుగా బలమైన ప్రభావం చూపించగలదు. ఈ ప్రభావం చాలా రంగాల్లో కనిపిస్తుంది. అది వినియోగం, బ్యాంకింగ్‌, స్టీల్‌ ఏదైనా కావచ్చు. అన్నింటిపైనా సానుకూల ప్రభావం ఉంటుంది. ఆటో రంగం మంచి పనితీరు చూపిస్తే ఆ ప్రభావం సూచీల్లోనూ ప్రతిఫలిస్తుంది. మనం మంచి సానుకూల స్థితిలోకి ప్రవేశించాం. ఆర్థిక రంగానికి, మార్కెట్లకు ఇది మంచిది.

ప్రశ్న: యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకులకు కొత్త సారధుల వల్ల ఎన్‌పీఏ సైకిల్‌ మారిపోతుందా?
ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులను గమనిస్తే వాటిలో ఒక రకమైన డీఎన్‌ఏ, సంస్కృతి నెలకొని ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో మాదిరిగా అంతర్గత వ్యక్తి అయితే తప్పిస్తే కష్టమే. కానీ, చైర్మన్‌ మాత్రం బయటి వ్యక్తి. ఏం జరుగుతోందన్నది ఆందోళన కలిగించే అంశమే. యాక్సిస్‌ బ్యాంకు పరిశీలనలో ఉన్న పేర్లలో మంచి, బలమైన వారున్నారు. కానీ, ఆ వ్యక్తి వచ్చి మొత్తం డీఎన్‌ఏ, బ్యాంకు సంస్కృతిని నడిపించాల్సి ఉంటుంది. కనుక, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులకు మార్పుకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. ఎన్‌పీఏ సైకిల్‌ తగ్గుముఖం పట్టినా, గతంలో ఉన్న వృద్ధి తిరిగి నెలకొంటుందా? అన్నదే ప్రశ్న. నేను అయితే ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ముందు ఏం జరుగుతుందో కొంత కాలం పాటు వేచి చూస్తాను.You may be interested

సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

Thursday 12th July 2018

11,000 పాయింట్ల పైన ప్రారంభమైన నిఫ్టీ ముంబై:- మార్కెట్‌ గురువారం రికార్డ్‌ ర్యాలీతో మొదలైంది. ఆసియా మార్కెట్లు నుంచి అందిన సానుకూల సంకేతాలకు తోడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో సూచీలు సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచి 158 పాయింట్లు లాభంతో 36424 వద్ద, నిప్టీ 59 పాయింట్లు లాభంతో 11000 పాయింట్లపైన 11,007 వద్ద ట్రేడింగ్‌ను షూరూ చేశాయి.

ఫండ్స్‌లో రాబడులు ఆశించిన విధంగా లేవా?

Thursday 12th July 2018

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ప్రతీ నెలా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వస్తున్న నిధులు రూ.7,300 కోట్లను చేరాయి. ఫండ్స్‌లో రాబడులు ఆశాజనకంగా ఉండడం, సులభంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు యాప్స్‌, ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి రావడం, ఫండ్స్‌ పట్ల అవగాహన తదితర అంశాలు ఈ స్థాయి పెట్టుబడులకు కారణం. అయితే, ఇలా ఇన్వెస్ట్‌ చేస్తున్న అందరూ లాభాలనే ఆర్జిస్తున్నారా...? అంటే అవునని చెప్పలేం. దీని వెనుక పలు కారణాలు

Most from this category