STOCKS

News


మార్కెట్‌ క్యాప్‌లో టాప్‌-10 కంపెనీలివే..

Tuesday 2nd October 2018
Markets_main1538463464.png-20792

జూలై, ఆగస్ట్‌ నెలల్లో ర్యాలీ చేసిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గత నెలలో కరెక‌్షన్‌కు గరయ్యింది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ అటు ఇటు మారిపోయి ఉంటుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో అధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగిన టాప్‌-10 కంపెనీలను గమనిస్తే..

 

 

ర్యాంక్‌        కంపెనీ            మార్కెట్‌ క్యాప్‌ (రూ.లక్ష కోట్లు)
1            టీసీఎస్‌            8.63
2            రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌    7.80
3            హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    5.53
4            ఐటీసీ            3.63
5            హెచ్‌యూఎల్‌        3.55
6            ఇన్ఫోసిస్‌        3.25
7            హెచ్‌డీఎఫ్‌సీ        3.05
8            ఎస్‌బీఐ            2.43
9            ఓఎన్‌జీసీ        2.29
10        మారుతీ సుజుకీ    2.25

గత వారంలో టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ పెరిగింది. వీటి విలువ మొత్తంగా రూ.76,959 కోట్లు ఎగసింది. అదే సమయంలో ఐటీసీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకీ మార్కెట్‌ క్యాప్‌ విలువ తగ్గింది. వీటి విలువ మొత్తంగా రూ.53,768 కోట్లు క్షీణించింది. గత వారం టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ ఎక్కువగా పెరిగింది. అలాగే మారుతీ సుజుకీ మార్కెట్‌ క్యాప్‌ ఎక్కువగా తగ్గింది.                 



You may be interested

85 డాలర్లస్థాయిని దాటిన బ్రెంట్‌ క్రూడ్‌

Tuesday 2nd October 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు చల్లారడం లేదు. ఇరాక్‌ చమురు ఎగుమతులపై అమెరికా వచ్చే నెల నుంచి ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బ్రెంట్‌ క్రూడాయిల్‌ నాలుగేళ్ల గరిష్ట ధర 85.45 డాలర్ల స్థాయికి ఎగసింది. మంగళవారం ఆసియా మార్కెట్లో ఉదయం 12 గంటల సమయానికి బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 85.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా విధించిన రెండో

టెంప్ట్‌ అయి ‘యస్‌’ అనవద్దు!

Tuesday 2nd October 2018

యస్‌బ్యాంకు షేరుకు దూరం నిపుణుల సూచన రాణాకపూర్‌ నిష్క్రమించాల్సిందేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పినప్పటి నుంచి మార్కెట్లో యస్‌ బ్యాంక్‌ షేరు కుప్పకూలుతూ వస్తోంది. షేరు పతనాన్ని అడ్డుకునేందుకు మేనేజ్‌మెంట్‌ ఎన్ని యత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా కపూర్‌ వారసుడి ఎంపికకు సెర్చ్‌ కమిటీని నియమిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. దీంతో పాటు విశ్వాసం చూరగొనే దిశగా ఉన్నట్లుండి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు డిపాజిట్లలో 41 శాతం వృద్ధి నమోదు చేశామని, అడ్వాన్సుల్లో 65

Most from this category