STOCKS

News


ఈ నాలుగు షేర్లలో రిస్క్‌ పరిమితం

Saturday 23rd February 2019
Markets_main1550918036.png-24300

లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే రెండు, మూడు నెలల్లో మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనవుతుందని, ఈ సమయంలో నాలుగు షేర్లలో మాత్రం రిస్క్‌ పరిమితంగా వుంటుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీస్‌ హెడ్‌ రాజేష్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. అవి...హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్, టైటాన్‌ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు. ఈ నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్‌ చేయమని తమ క్టయింట్లకు సిఫార్సుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒడుదుడుకుల మార్కెట్లో కాస్త అధిక రిస్క్‌ తీసుకోదల్చినవారు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి కార్పొరేట్‌ బ్యాంకుల్ని కూడా పరిశీలించవచ్చన్నారు. కార్పొరేట్‌ రుణాల్ని అధికంగా ఇచ్చిన బ్యాంకుల్లో ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు, మొండి బకాయిల రికవరీ కొనసాగుతున్నట్లు డిసెంబర్‌ క్వార్టర్లీ ఫలితాల్లో కన్పించిందని ఆయన వివరించారు. ఈ ఫిబ్రవరి మిగిలిన రోజుల్లో నిఫ్టీ చాలావరకూ పరిమితశ్రేణిలోనే కదలవచ్చని, గరిష్ట టార్గెట్‌ 10,900 పాయింట్లని, రానున్న వారాల్లో మార్కెట్‌  క్షీణిస్తే 10,580–10,550 శ్రేణి వద్ద మద్దతు వుంటుందని ఆయన అంచనావేశారు. ఈ మద్దతు కోల్పోతే మాత్రం 10,300–10,000 శ్రేణి వద్దకు పతనం కావొచ్చని ఆయన హెచ్చరించారు. ఈ టెక్నికల్‌ సెటప్‌ కారణంగా క్వాలిటీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయాలని, స్మాల్‌క్యాప్‌ షేర్లలో నష్టాల్ని స్వీకరించి విక్రయించాలని ఆయన సూచించారు. 
 



You may be interested

బ్లూచిప్‌ కంపెనీల్లో ఆకర్షణీయ బెట్స్‌!

Sunday 24th February 2019

సాధారణ ఎన్నికలు ముగిసే వరకు మార్కెట్లు అస్థితంగానే ఉంటాయని, ఈ లోపు అంతర్జాతీయ అంశాలు మార్కెట్లను ప్రధానంగా నిర్దేశిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ బ్రోకింగ్‌ హెడ్‌ రాజీవ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇన్వెస్టర్లు ‍స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలను బుక్‌ చేసుకుని నాణ్యమైన లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘2018 డిసెంబర్‌ త్రైమాసికం కార్పొరేట్‌ కంపెనీలు ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో తలెత్తిన

మోతీలాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌లకు సెబీ షాక్‌

Saturday 23rd February 2019

సెక్యూరిటీ అండ్‌ ఎక్చ్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలైన మోతీలాల్‌ ఓస్వాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌(ఐఐఎఫ్‌ఎల్‌)లకు షాక్‌నిచ్చింది. ఈ రెండు సంస్థలకు చెందిన కమోడిటీ విభాగాలకు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసే అర్హత లేదని వెల్లడించింది. రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసు దర్యాప్తులో భాగంగా సెబీ ఈ విషయాన్ని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన మోసపూరిత కాంట్రాక్టుల విక్రయాలకు ఆ రెండు సంస్థలు ఉద్దేశపూర్వకంగా సహకరించాయి. ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ విధానంలో నమ్మకం

Most from this category