STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్ గ్రూప్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 8,650 కోట్లు

Thursday 31st January 2019
Markets_main1548928864.png-23929

  • తీవ్ర ఆందోళనలో మ్యూచువల్‌ ఫండ్స్‌

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాది చివర్లో ఐల్‌ఎల్‌అండ్‌ఎఫ్‌సీ సంక్షోభంలో దెబ్బతిన్న ఫండ్స్‌...ఈ ఏడాది ప్రారంభం‍లోనే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ మీద రూ.31వేల కోట్ల నిధుల అక్రమ మళ్లింపు ఆరోపణలు రావడంతో ఈ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోంటున్నాయి.  డిసెంబర్‌ త్రైమాసికం నాటికి పలు 22  మ్యూచువల్‌ ఫండ్లు డీఎల్‌హెచ్‌ఎఫ్‌తో పాటు దాని అనుబంధ కంపెనీలు ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్సెన్షియల్‌ హాస్పిటాలిటీ, ఆవాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో వర్థమాన్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌కు చెందిన బాండ్లు, వాణిజ్య పత్రాలు, షేర్లలో రూ. రూ.8650 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో నెలకొన్న అస్థిరతతో ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా డిసెంబర్‌ క్వార్టర్‌లో డీఎల్‌హెచ్‌ఎఫ్‌ కంపెనీలో తన మొత్తం వాటా 2.50శాతం నుంచి దాదాపు 1శాతం(23 లక్షల ఈక్విటీ షేర్లను)వాటాను వెనక్కితీసుకున్నారు. ఇటీవల కంపెనీ ప్రకటించిన క్యూ3 గణాంకాలను పరిశీలించినట్లైతే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో సెప్టెంబర్‌ నుంచి లిక్విడిటీ కొరత ఉందనే అంశం అవగతమవుతోంది. క్యూ3లో అధిక మొత్తంలో బాం‍డ్లపై వడ్డీలను చెల్లించిన కారణంగా కంపెనీ క్వార్టర్‌ టు క్వార్టర్‌ నికరలాభం 95శాతం క్షీణించింది.
డిసెంబర్‌ త్రైమాసికం నాటికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, దాని అనుబంధ కంపెనీల్లో అత్యధికంగా యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌  రూ. 2,144 కోట్ల పెట్టుబడులు చేసింది. రిలయన్స్‌ ఏఎంసీ రూ.1,488 కోట్లను, యాక్సిస్‌ రూ.771 కోట్లను, ఫ్రాక్లింగ్‌ టెంపుల్టన్‌ రూ.571 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాయి.



You may be interested

సెన్సెక్స్‌ 665 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు జంప్‌

Thursday 31st January 2019

-బ్యాంక్‌, ,ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నేతృత్వం -బడ్జెట్‌పై పెరిగిన అంచనాలు -ప్రపంచ మార్కెట్లకు ఫెడ్‌ ఊపు   పలు సానుకూల అంశాలు, బడ్జెట్‌పై మెరుగుపడిన అంచనాల ప్రభావంతో గురువారం భారత్‌ మార్కెట్‌ భారీ ర్యాలీ జరిపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 665 పాయింట్లు పెరిగి 36,256 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 179 పాయింట్లు లాభపడి 10,831 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగు రోజుల గరిష్టస్థాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్‌కు రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన

బడ్జెట్‌ కన్నా ఎన్నికలే కీలకం

Thursday 31st January 2019

జేఎం ఫైనాన్షియల్‌ శుక్రవారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌ కన్నా రాబోయే సాధారణ ఎన్నికలే మార్కెట్‌కు కీలకమని జేఎం ఫైనాన్షియల్స్‌ ప్రతినిధి సుహాస్‌ హరినారాయణ్‌ అభిప్రాయపడ్డారు. మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వానికి పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఎంఎస్‌పీ ఫార్ములాను ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేయలేకపోయిందని, ఈ ప్రభావం గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. అందువల్ల ఈ బడ్జెట్లో ఎక్కువమందిని ఆకర్షించే చర్యలకే ప్రభుత్వం

Most from this category