పతనం నేర్పే పాఠాలు...
By D Sayee Pramodh

దేశీయ సూచీలు వారాంతంలో అనూహ్య షాక్లిచ్చాయి. ఒక్కమారుగా నష్టాల అగాధాల్లోకి మునక వేశాయి. చివర్లో కాస్త కోలుకున్నట్లు కనిపించినా పూర్తిగా బేర్స్ పట్టులోకి మార్కెట్ జారుకుంది. మార్కెట్లో వచ్చిన ఈ పతనం మదుపరులకు కొన్ని పాఠాలు నేర్పిందంటున్నారు నిపుణులు. అవేంటంటే..
- ఫేక్ వార్తలనుకునేవి నిజమైన ప్రభావం చూపుతాయి.
- అయితే ఇలాంటి పునాదుల్లేని పుకార్లను చూసి మన ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను మార్చుకోకూడదు.
- చౌకగా వచ్చే ప్రతిదీ నాణ్యమైనది కావాలని రూల్ లేదు.
- రూమర్ల ఆధారంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయవద్దు.
- కేవలం బాలెన్స్ షీట్ల ఆధారంగా కంపెనీలపై నిర్ణయం తీసుకోవాలి.
- ఎఫ్ అండ్ ఓలో ట్రేడ్ చేసేటప్పుడు ఎంత సైజ్‌లో ట్రేడ్ చేస్తున్నాము, ఎంత మార్జిన్ అవసరం లాంటివి చాలా జాగ్రత్తగా గమనించండి.
- కొత్త ట్రేడర్లు భారీగా ఎఫ్అండ్ఓలో చేతులు పెట్టకూడదు.
- ఓపికే అన్నింటికన్నా మిన్న. ఓపికతో ఉంటేనే సరైన ప్రతిఫలం దక్కుతుంది.
మార్కెట్లు ఇంత ఆటుపోట్లు చూపుతున్నా..
భారత ఎకానమీ వృద్ధి బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల, క్యు1లో క్రమంగా గాడిన పడ్డ కంపెనీల ఆదాయాలు.. చూసి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. నాణ్యమైన స్టాకులను దీర్ఘకాలానికి పరిశీలించాలని సూచిస్తున్నారు.
You may be interested
బిగుస్తున్న ట్రేడ్ ముడి
Saturday 22nd September 2018మాటల్లేవంటున్న చైనా యూఎస్‌తో జరపాల్సిన వాణిజ్య చర్చలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. వచ్చే వారం తమ వైస్ ప్రీమియర్ లీహును చర్చల కోసం వాషింగ్టన్ పంపమని తేల్చిచెప్పింది. లీ పర్యటనకు ముందు పంపాల్సిన అధికారుల బృందాన్ని సైతం చైన రద్దు చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కధనంలో వెల్లడించింది. అయితే వచ్చే నెల జరగాల్సిన తాజా చర్చలకు మాత్రం అభిముఖంగానే ఉన్నట్లు తెలిపింది. చైనా తీరు మారలేదంటూ తాజాగా ట్రంప్
షార్టింగ్కు ఇది సరైన సమయమా?
Saturday 22nd September 2018వేచిచూడాలంటున్న నిపుణులు శుక్రవారం దేశీయ సూచీలు ఇన్వెస్టర్లను పీడకల మిగిల్చాయి. ఒక్కసారిగా కుప్పకూలిన సూచీలు పలువురు మదుపరులను దెబ్బతీశాయి. తర్వాత కాస్త కోలుకున్నా, సూచీలు మాత్రం పూర్తి బేర్ పట్టులోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం కొత్తగా షార్టు పొజిషన్లు తీసుకోవచ్చా?లేదా? అని పలువురు సంశయంలో ఉన్నారు.. అయితే మార్కెట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు కొత్త పొజిషన్ల జోలికి పోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు మరి