News


కొత్త ఏడాదికి క్రెడిట్‌సూసీ సిఫార్సులు

Tuesday 18th December 2018
Markets_main1545128391.png-23050

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినందించే సత్తా ఉన్న నాలుగు స్టాకులను క్రెడిట్‌సూసీ రికమండ్‌ చేసింది.
1. ఎల్‌అండ్‌టీ: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 1700. దేశీయంగా రికవరీ మెరుగుపడడం, బలమైన నిధుల ప్రవాహం, ఆకర్షణీయమైన వాల్యూషన్లు, ఒకే ప్రాంతంపై ఎక్కువగా ఆధారపడే అవసరం తగ్గడం.. కంపెనీ షేరుపై ఆసక్తి పెంచుతున్నాయి. మార్జిన్లు అనూహ్యంగా పెరిగి అనుకోని అప్‌సైడ్‌ కదలికలను తీసుకురావచ్చు. హైదరాబాద్‌మెట్లో నష్టాలు తగ్గడం, ప్రైవేట్‌ పెట్టుబడుల సైకిల్‌ ఆరంభం కావడంతో కంపెనీ వచ్చే ఏడాది మరింత ముందుకు దూసుకుపోతుంది.
2. భెల్‌: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 100. ఏటా పది గిగావాట్స్‌ ఉత్పత్తి చేసే అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈపీఎస్‌ వేగంగా మెరుగుపడి రీరేటింగ్‌ జరగవచ్చు. ఎబిటా బాగుంది. ఆర్డర్లు మందగించకుండా ఉంటే మంచిది. మూలధన వ్యయాలు చాలా ఎక్కువగా ఉండడం కొంతవరకు రిస్కు కారకం.
3. ఎస్‌బీఐ: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 350. గత కొన్ని త్రైమాసికాలుగా రుణవృద్దిలో మెరుగుదల కనిపిస్తోంది. మొండిపద్దుల ఒత్తిళ్లు, స్లిపేజ్‌ ఇక్కట్లు క్రమంగా తగ్గుతున్నాయి. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో బలమైన రికవరీ నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉంది. 
4. ఐసీఐసీఐ బ్యాంకు: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 375. లోన్‌గ్రోత్‌, కార్యనిర్వాహక పనితీరులో మంచి మెరుగుదల నమోదు చేస్తోంది. స్లిపేజ్‌లు క్రమంగా తగ్గుతున్నాయి. రాబోయే త్రైమాసికాల్లో ఎన్‌పీఏలు మరింత కుంచిచుకుపోతాయని అంచనా. వచ్చే ఏడాది ఆర్‌ఓఈ 14 శాతం మేర మెరుగుపడవచ్చు. మూలధనపరంగా బలంగా ఉంది. You may be interested

రూపాయి ర్యాలీతో ఆరో రోజూ లాభాలే

Tuesday 18th December 2018

10900 పైన నిఫ్టీ కలిసొచ్చిన చివరి గంట కొనుగోళ్లు రూపాయి ర్యాలీతో మార్కెట్‌ ఆరోరోజూ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం నిఫ్టీ సూచీ 10,900పైన ముగియగా  సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభాల్ని ఆర్జించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో పాటు ఐదురోజులుగా సూచీల ర్యాలీ కారణంగా నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మార్కెట్లో మిడ్‌సెషన్‌ వరకు నష్టాల్లో కొనసాగింది. అయితే అనూహ్యంగా రూపాయి

10941 వరకు నిఫ్టీ ర్యాలీ!

Tuesday 18th December 2018

సాంక్టమ్‌ వెల్త్‌ అంచనా దేశీయ మార్కెట్లు గత వారం లాభాల పరుగును కొనసాగిస్తున్నాయి. మంగళవారం ఆరంభంలో నష్టాలున్నా చివరకు సూచీలు లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ 10900 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 10840 పాయింట్లపైన ఉన్నంత వరకు పాజిటివ్‌గా ఉన్నట్లే భావించాలి. ఈ ఊపులో నిఫ్టీ క్రమంగా 10941 పాయింట్లను తాకేందుకు ఛాన్సులున్నాయి. ఇటీవల ర్యాలీ ఈ స్థాయిలవరకు కొనసాగింది. ఇక్కడ నిఫ్టీకి టాప్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని దాటితే నిఫ్టీ

Most from this category