STOCKS

News


ఐటీ రంగంలో ఈ షేర్లు భేష్‌..!

Wednesday 31st October 2018
Markets_main1540981305.png-21617

  • టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, ఎన్‌ఐఐటీ షేర్లను కొనొచ్చు..
  • ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచన

ముంబై: మిడ్‌క్యాప్‌ ఐటీ రంగ షేర్లలో ఎన్‌ఐఐటీ మినహాయించి మిగిలిన అన్ని షేర్లు ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వీటి జోలికి వెళ్లడం కంటే ఎంపిక చేసిన టాప్‌ ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచించారు. ఈ జాబితాలో టెక్‌ మహీంద్ర చాలా ఆకర్షణీయంగా ఉందన్నారు. ఎబిటా పరంగా ఆశాజనకంగా కనిపిస్తోంది. 550 మిలియన్‌ డాలర్ల (దాదాపుగా రూ.4వేల కోట్లు) డీల్‌ను అందుకుంది. ఈషేరు పడిపోయినప్పుడల్లా పోర్ట్‌ఫోలియోలో జతచేసుకోవడం బెటరని సూచించారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ కంపెనీలు సైతం బలమైన ఆర్డర్లను అందుకున్నాయి. ఈ రెండు కంపెనీల డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. భవిష్యత్తులో మంచి లాభాలను అందించే దిశగా ఉన్నందున వీటిలో టీసీఎస్‌ టాప్‌ పిక్‌గా భావిస్తున్నాను అని వెల్లడించారు. ‘మిడ్‌క్యాప్‌ ఐటీ రంగ షేర్లు నష్టాలను మిగులుస్తుండగా.. వీటిలో ఎన్‌ఐఐటీ మాత్రం ఏటికి ఎదురీదుతోంది. 160 మిలియన్‌ డాలర్ల (దాదాపుగా రూ.1,183 కోట్లు) డీల్‌ను సొంతంచేసుకుంది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ డాలర్‌ ఆదాయంలో 7.6 శాతం వృద్ధిరేటు నమోదుచేసిన ఈ షేరును కొనుగోలు చేయవచ్చు.’ అని సూచించారు. ఇక ఐటీ రంగంలో డిజిటల్‌ బలపడి వచ్చే ఒకటి రెండేళ్లలో పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 



You may be interested

సెన్సెక్స్‌ 550 పాయింట్లు జంప్‌

Wednesday 31st October 2018

మిడ్‌సెషన్‌ నుంచి జోరందుకున్న కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 551 పాయింట్ల పెరిగి 34,442 వద్ద, నిఫ్టీ 188 లాభంతో 10,386 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 345.50 పాయింట్లు పెరిగి 25వేల పైన 25,153 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ సంక్షోభ సెగలతో మార్కెట్‌లో మిడ్‌సెషన్‌

టాటా మోటార్స్‌ నష్టం రూ. 1,049 కోట్లు

Wednesday 31st October 2018

 టాటా గ్రూప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,049 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో ప్రకటించిన రూ. 1,800 కోట్ల నష్టంకంటే ఇది తక్కువ. కాగా గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో కంపెనీ రూ. 2,483 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీకి చెందిన యూరప్‌ సబ్సిడరీ జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ (జెఎల్‌ఆర్‌) కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నష్టాల్లోకి

Most from this category