STOCKS

News


ఏ మ్యూచువల్‌ ఫండ్‌ ఏ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసింది...?

Tuesday 11th June 2019
Markets_main1560275836.png-26233

దేశీయంగా అగ్రస్థాయి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) మే నెలలో కొనుగోళ్ల, అమ్మకాలను పరిశీలిస్తే కాంట్రా బెట్స్‌ పట్ల ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో రాజకీయ స్థిరత్వం ఏర్పడడం ఏఎంసీల ఆలోచన మారిందనేందుకు నిదర్శనం. బాగా పడిపోయిన టెలికం, విద్యుత్‌, ఫార్మా, మెటల్స్‌ షేర్లు ర్యాలీ చేస్తాయని ఏఎంసీలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ఆటో యాన్సిలరీ, బ్యాంకు స్టాక్స్‌ సైతం ఏఎంసీలను ఆకర్షించాయి. మే నెల నాటికి మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.25.43 లక్షల కోట్లకు పెరిగింది. 

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
రూ.1.51 లక్షల కోట్ల ఈక్విటీ ఆస్తులు కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎక్కువగా ఫైనాన్షియల్స్‌, యుటిలిటీలు, ఇండస్ట్రీస్‌లకు కేటాయింపులు చేసింది. మే నెలలో 3 కోట్ల బీహెచ్‌ఈఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. కోటి ఫెడరల్‌ బ్యాంకు షేర్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా 94 లక్షల షేర్లు, డీసీబీ బ్యాంకు 86 లక్షల షేర్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో 70 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, బీపీసీఎల్‌, అరబిందో ఫార్మా, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, కరూర్‌ వైశ్యా బ్యాంకు, హిందాల్కో, లుపిన్‌, అదానీ పవర్‌ షేర్లను కూడా కొనుగోలు చేసింది. ఇక ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌లో కోటి చొప్పున షేర్లను అమ్మేసింది. ఓరియంట్‌ సిమెంట్‌, హెచ్‌ఎస్‌ఐఎల్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, అంబుజా సిమెంట్‌, ఎన్‌బీసీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లను కూడా విక్రయించింది. హావెల్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, వోడాఫోన్‌ ఇండియా కౌంటర్ల నుంచి పూర్తిగా తప్పుకుంది. 

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ
మే నెల నాటికి ఈ సంస్థ నిర్వహణలో రూ.1.32 లక్షల కోట్ల ఈక్విటీ ఆస్తులు ఉన్నాయి. వొడాఫోన్‌ ఐడియాలో 6.12 లక్షల షేర్లు, భారతీ ఎయిర్‌టెల్‌లో 3.90 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. టెలికం కంపెనీలు కనీస నెలవారీ రీచార్జ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో వీటి ఆదాయాలు మెరుగవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీలో 1.52 కోట్ల షేర్లు, మదర్సన్‌ సుమీలో 1.36 కోట్ల షేర్లు, హిందాల్కోలో 87 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 68 లక్షల షేర్లు, యూనియన్‌ బ్యాంకులో 61 లక్షల షేర్లు, నైవైలీ లిగ్నైట్‌లో 46 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 44 లక్షల షేర్ల చొప్పున కొనుగోలు చేసింది. ఇక కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీలో 75 లక్షల చొప్పున షేర్లను విక్రయించింది. 

 

ఎస్‌బీఐ ఏఎంసీ
భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలో కోటి షేర్ల చొప్పున, మదర్సన్‌ సుమీలో 88.77 లక్షల షేర్లు, ఎస్‌బీఐలో 78 లక్షల షేర్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడాలో 78 లక్షల షేర్లు, ఐసీఐసీఐ బ్యాంకులో 47.99 లక్షల షేర్లు, టాటా పవర్‌ 43 లక్షల షేర్ల చొప్పున కొన్నది. ఇక ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌లో 25 లక్షల షేర్లు, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హావెల్స్‌ ఇండియా, ఐటీడీ సిమెంటేషన్‌, వోల్టాస్‌, రెడింగ్టన్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లోనూ 25 లక్షల షేర్ల చొప్పున విక్రయించింది.  

 

ఆదిత్యబిర్లా ఏఎంసీ
376 స్టాక్స్‌లో ఆదిత్య బిర్లా ఏఎంసీ 87,300 కోట్ల మేర మే నాటికి ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇక మే నెలలో స్పైస్‌జెట్‌లో మొదటిసారి 22 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, సియట్‌, కెనరా బ్యాంకు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంకు, టాటా ఎలెక్సీ షేర్లలో పెట్టుబడులు పెట్టింది. ఇక డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, మైండ్‌ట్రీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సొనాటా సాఫ్ట్‌వేర్‌, సిండికేట్‌ బ్యాంకుల నుంచి పూర్తిగా పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, సన్‌ ఫార్మా, బ్యాంకు ఆఫ్‌ బరోడా, డిష్‌టీవీ, భారతీ ఎయిర్‌టెల్‌ల్లోనూ కొనుగోళ్లు చేసింది. ఎస్‌బీఐ లైఫ్‌, పీఎన్‌బీ, హిందాల్కో, టాటా మోటార్స్‌, ఎంఆర్‌పీఎల్‌, వొడాఫోన్‌లో షేర్లను విక్రయించింది. 

 

రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ
గుజరాత్‌ ఆల్కలీస్‌, సోమాని సిరామిక్స్‌, టాటా ఎలెక్సీ, టైమ్‌ టెక్నోప్లాస్ట్‌ షేర్లను రిలయన్స్‌ నిప్పన్‌ తొలిసారిగా మే నెలలో కొనుగోలు చేసింది. అశోక్‌ లేలాండ్‌లో కోటి షేర్లు, ఐసీఐసీఐ బ్యాంకులో 97 లక్షల షేర్లు, భారతీ ఎయిర్‌టెల్‌, సెయిల్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో 50-72 లక్షల మధ్య షేర్లను కొనుగోలు చేసింది. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సీపీసీఎల్‌, ఐఎఫ్‌సీఐ, జైన్‌ ఇరిగేషన్‌, నిట్‌ టెక్నాలజీస్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్ల నుంచి పూర్తిగా తప్పుకుంది. అలాగే, కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీలో వాటాలను విక్రయించింది. You may be interested

11950 దిగువన నిఫ్టీ ప్రారంభం

Wednesday 12th June 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 39850 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల తగ్గుదలతో 11935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో  లాభాల స్వీకరణతో నిన్న రాత్రి నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా 5.5 లక్షల ఫోలియోలు

Tuesday 11th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మే నెలలోనూ నూతన పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) పెరుగుదలను నమోదు చేశాయి. మే నెలలో ఏఎంసీలు 5.54 లక్షల నూతన ఫోలియోలను ప్రారంభించాయి. దీంతో అన్ని ఏఎంసీల పరిధిలో ఫోలియోల సంఖ్య 8.32 లక్షలకు పెరిగినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.   క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఖాతాలు తగ్గడం గమనించాల్సిన అంశం. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు (జీ గ్రూపు, అడాగ్‌ గ్రూపు, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌

Most from this category