STOCKS

News


పీఎస్‌యూ కంపెనీలపై మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘లవ్‌’

Friday 15th February 2019
Markets_main1550169216.png-24203

దేశంలో టాప్‌ -3 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) జనవరిలో పలు పీఎస్‌యూ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాయి. ఈ మూడు సంస్థల నిర్వహణలో ఉన్న ఈక్విటీ, డెట్‌ ఆస్తులు విలువ రూ.9 లక్షల కోట్లు. మరి ఉన్నట్టుండి ప్రభుత్వరంగ కంపెనీల్లో షాపింగ్‌ ఎందుకు చేసినట్టు? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. పీఎస్‌యూ షేర్ల వ్యాల్యూషన్లు చాలా తక్కువ స్థాయికి అందుబాటులోకి రావడాన్ని ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: యూనియన్‌ బ్యాంకు, ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆర్‌ఈసీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. యూనియన్‌ బ్యాంకు లో 76.49 లక్షల షేర్లు కొన్నది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తన వివిధ పథకాల పరిధిలో మొత్తం రూ.398 కోట్ల మేర పెట్టుబడులను యూనియన్‌ బ్యాంకులో కలిగి ఉండడం గమనార్హం. గత డిసెంబర్‌ నాటికి ఈ విలువ రూ.348 కోట్లు. అంటే రూ.50 కోట్ల మేర పెరిగినట్టు తెలుస్తోంది. ఎన్‌టీపీసీలో 50.49 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఒక్క ఈ కంపెనీలోనే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ పెట్టుబడుల విలువ రూ.3,783 కోట్లకు పెరిగింది. ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇండియన్‌ బ్యాంకులోనూ అదనంగా పెట్టుబడులు పెట్టింది.  
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ: పవర్‌గ్రిడ్‌, ఎన్‌హెచ్‌పీసీ, గెయిల్‌, ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్‌ షేర్లలో తాజా పెట్టుబడులు పెట్టింది. ఎన్‌టీపీసీలో 2.14 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఓఎన్‌జీసీలో 2 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను 7.78 శాతానికి పెంచుకుంది. విలువ పరంగా ఎన్‌టీపీసీలో రూ.6,000 కోట్ల మేర, ఓఎన్‌జీసీలో రూ.3,900 కోట్ల మేర పెట్టుబడులు కలిగి ఉంది. బీహెచ్‌ఈఎల్‌లోనూ తన వాటాను 50 శాతం మేర పెంచుకుంది.
ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌: ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లను కొన్నది. 

 

ఈ ఏడాది బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ నష్టాలనే ప్రారంభమైంది. జనవరిలో 4.58 శాతం నష్టపోగా, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 3.26 శాతం తగ్గింది. మరి ఇదే సమయంలో సెన్సెక్స్‌ అర శాతం చొప్పున పెరిగింది. తక్కువ వ్యాల్యూషన్లలో ఉండడంతో కొన్ని పీఎస్‌యూ షేర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పీఎస్‌యూల్లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా పట్ల సీఎల్‌ఎస్‌ఏ సైతం సానుకూలంగా ఉంది. వర్ధమాన దేశాల్లో ఒక్క భారత్‌ మార్కెట్‌ మాత్రమే చారిత్రక సగటు కంటే అధిక వ్యా‍ల్యూషన్లలో ట్రేడ్‌ అవుతుంటే, పీఎస్‌యూ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక కనిష్ట స్థాయిలో 8.8 ఫార్వార్డ్‌ పీఈలో ట్రేడ్‌ అవుతున్నాయని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, జీఎండీసీ, కోల్‌ ఇండియా షేర్లు ఊహించనంత తక్కువ విలువల్లో ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 ద్వితీయార్థంలో పీఎస్‌యూ స్టాక్స్‌ సంపద సృష్టిస్తాయని ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ బాసిన్‌ పేర్కొన్నారు.  You may be interested

షేర్లు ఇంతలా పడిపోవడానికి కారణం అదేనా...?

Friday 15th February 2019

ప్రధాన సూచీలు ఓ పరిమిత శ్రేణిలోనే ప్రయాణం సాగిస్తుంటే... మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ప్రతీ రోజూ నేల చూపులు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు నూతన కనిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. ఈ పతనం ఎంతవరకు...? అన్న భయం రిటైల్‌ ఇన్వెస్టర్లలో నెలకొంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ చాలా ఆకర్షణీయ ధరలకు వచ్చేశాయని, వీటిల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చంటూ పలువురు విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నాయి. మరి ఎందుకని ఈ

కరూర్‌ షేరు క్రాష్‌

Thursday 14th February 2019

గురువారం ఇంట్రాడేలో కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ షేరు దాదాపు 18శాతం వరకు  పతనమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో రూ. 63.20 కనిష్ఠస్థాయిని చూసింది. అనంతరం కోలుకొని 15 శాతం నష్టంతో 67. 15 రూపాయల వద్ద ముగిసింది. ఈ రోజు కనిష్ఠం 52 వారాల కనిష్ఠ ధర కావడం గమనార్హం. క్యు3 ఫలితాల సందర్భంగా మేనేజ్‌మెంట్‌ చేసిన గైడెన్స్‌ ప్రకటన షేరుపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదు త్రైమాసికాల్లో రూ.1000 కోట్ల

Most from this category