News


నెలలో 12 శాతం రాబడి అందించే స్టాక్స్‌..

Monday 6th August 2018
Markets_main1533537929.png-18976

మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు కొంగొత్త స్థాయిలను తాకాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. ఒక నెలలో 6-12 శాతం రాబడి అందించే 9 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.. 

అనలిస్ట్‌: ఏంజెల్‌ బ్రోకింగ్‌ (డేరివేటివ్స్‌, టెక్నికల్స్‌) చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చావన్‌
స్టాక్‌: అరవింద్‌
ప్రస్తుత ధర: 432
టార్గెట్‌ ప్రైస్‌: రూ.469
స్టాప్‌ లాస్‌: రూ. 401
రిటర్న్‌ అంచనా: 12 శాతం
గత వారంలో ఈ స్టాక్‌ ధర ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ అవుట్‌ అయ్యింది. రోజువారీ వ్యాల్యూమ్స్‌ సగటు కన్నా ఎక్కువ వ్యాల్యూమ్స్‌ వద్ద ఈ బ్రేక్‌ అవుట్‌ జరిగింది. అయితే కొనుగోళ్లు లేకపోవడంతో స్టాక్‌ ధర రూ.412 ట్రెండ్‌లైన్‌ సపోర్ట్ వద్ద కదలాడింది. అంచనా వేసినట్లుగానే తక్కువ స్థాయిలో బలమైన కొనుగోళ్లు జరుగుతున్నాయి. అంటే స్టాక్‌ ధర కొత్త ర్యాలీకి సిద్ధమౌతోంది. అందువల్ల రూ.401.7 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.469 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. 

బాంబే బర్మా ట్రేడింగ్‌
ప్రస్తుత ధర: రూ.1,591
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 1,810
స్టాప్‌ లాస్‌: రూ.1,509
రిటర్న్‌ అంచనా: 12 శాతం
ఈ స్టాక్‌లో గత మూడు నెలల్లో కొంత కరెక‌్షన్‌ జరిగింది. ఇటీవల కాలంలో రెండు సార్లు బ్రేక్‌ అవుట్‌ అవ్వడానికి ప్రయత్నించింది. అయితే కుదరలేదు. అయినా కూడా బుల్స్‌ ప్రయత్నాన్ని విరమించడం లేదు. శుక్రవారం స్టాక్‌ ధరలో పెరుగుదల కనపించింది. బ్రేక్‌ అవుట్‌కు అవకాశముంది. వీక్లి చార్ట్స్‌ చూస్తే సానుకూలముగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది మంది పనితీరు కనబరుస్తుంది. అందువల్ల రూ.1,509 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.1,810 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

 అనలిస్ట్‌: చార్ట్‌వ్యూఇండియా (టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ) చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజ్‌హర్‌ మహ్మద్‌
 
స్టాక్‌: బాటా ఇండియా
ప్రస్తుత ధర: రూ.932
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,020
స్టాప్‌ లాస్‌: రూ.900
రిటర్న్‌ అంచనా: 8.7 శాతం
జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఈ స్టాక్‌ మళ్లీ కొత్త బ్రేక్‌ అవుట్‌కు సన్నద్ధమౌతోంది. ఇదే జరిగితే స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,020. ట్రేడర్లు ప్రస్తుతం ఈ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని, తగ్గితే రూ.920 స్థాయిల్లో మరిన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.900 వద్ద స్టాప్‌ లాస్‌తో రూ.1,020 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సూచించారు. 

స్టాక్‌: హావెల్స్‌ ఇండియా
ప్రస్తుత ధర రూ.654
టార్గెట్‌ ప్రైస్‌: రూ.697
స్టాప్‌ లాస్‌: రూ.620
రిటర్న్‌ అంచనా: 8.7 శాతం
ఈ స్టాక్‌ రూ.590-480 శ్రేణిలో ఎక్కువ రోజులు కదలాడింది. ఇటీవలనే బ్రేక్‌ అవుట్‌ అయ్యింది. రూ.620 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.730 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

యస్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ.372
టార్గెట్‌ ప్రైస్‌: రూ.390
స్టాప్‌ లాస్‌: రూ.360
రిటర్న్‌ అంచనా: 4.8 శాతం
రూ.394 జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన తర్వాత ఈ స్టాక్‌లో కరెక‌్షన్‌ కనిపించింది. రూ.356 స్థాయి తాకిన తర్వాత పైకి కదులుతోంది. దీర్ఘకాల ట్రెండ్‌ చూస్తే తన జీవిత కాల గరిష్ట స్థాయిని మళ్లీ తాకే అవకాశముంది. అందువల్ల రూ.360 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.390 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ కొనొచ్చు.

అనలిస్ట్‌: 5నాన్స్‌.కామ్‌ ఫౌడర్‌, సీఈవో దినేశ్‌ హోహిర

స్టాక్‌: జేకే పేపర్‌
ప్రస్తుత ధర రూ.159
టార్గెట్‌ ప్రైస్‌:167
స్టాప్‌ లాస్‌: 135
రిటర్న్‌ అంచనా: 10 శాతం

జేకే పేపర్‌ స్టాక్‌ గత ఆరు నెలలుగా కన్సాలిడేషన్‌ దశలోనే ఉంది. రూ.149-128 శ్రేణిలో కదలాడుతోంది. రూ.99 వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి ఇటీవల కాలంలోనే బలమైన వృద్ధి కనిపించింది. 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ రూ.131 నుంచి బ్రేక్‌ అవుట్‌ అయ్యింది. వ్యాల్యూమ్‌ పెరుగుదల బాగుంది. వారం ప్రకారం 25 శాతం లాభపడింది. వీక్లి ప్రైస్‌ చార్ట్‌ ప్రకారం బుల్లిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. ఇది అప్‌ట్రెండ్‌కు సానుకూలముగా ఉంది. ఎంఏసీడీ కూడా అప్‌ట్రెండ్‌ సూచిస్తోంది. అలాగే వీక్లి ఆర్‌ఎస్‌ఐ ప్రస్తుత స్థాయిల్లో కొనుగోలు చేయవచ్చని పేర్కొంటోంది. ప్రస్తుతం స్టాక్‌కు రూ.169 వద్ద నిరోధం, రూ.126 వద్ద మద్దతు లభిస్తోంది. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: సికాల్‌ లాజిస్టిక్స్‌
ప్రస్తుత ధర రూ.186
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 203
స్టాప్‌ లాస్‌: రూ. 174
రిటర్న్‌ అంచనా: 8 శాతం
సికాల్‌ లాజిస్టిక్స్‌ అప్‌ట్రెండ్‌కు రెడీ అవుతోంది. గత ఆరు నెలల్లో రూ.232 నుంచి రూ.163 వరకు పడుతూ వచ్చింది. మళ్లీ కొంత పెరిగింది. 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ రూ.182గా ఉంది. వ్యాల్యూమ్‌ పెరుగుదల కలిసొచ్చే అంశం. వీక్లి ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఏంఎసీడీ కూడా బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌కు రూ.164 వద్ద బలమైన మద్దతు ఉంది. అలాగే రూ.216 వద్ద నిరోధముంది. అందువల్ల ఈ స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సూచించారు. 

 అనలిస్ట్‌: బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ అనలిస్ట్‌ రూపక్‌

స్టాక్‌: ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
ప్రస్తుత ధర రూ.1,773
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,900
స్టాప్‌ లాస్‌: రూ.1,597
రిటర్న్‌ అంచనా: 12 శాతం
ఈ స్టాక్‌ గత కొన్ని రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. ఇటీవల గరిష్ట స్థాయికి కన్నా పైన ముగిసింది. అంటే స్టాక్‌లో పెరుగుదలకు కనిపిస్తోంది. స్టాక్‌ ధర గత మే నెల నుంచి చూస్తే తొలిసారి 21 ఈఎంఏకు పైన ముగిసింది. డైలీ ఆర్‌ఎస్‌ఐలోని పాజిటివ్‌ డైవర్జెన్స్‌ స్టాక్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. అందువల్ల స్టాక్‌ కొనొచ్చు.

స్టాక్‌: జీ లిమిడెట్‌
ప్రస్తుత ధర రూ.521
టార్గెట్‌ ప్రైస్‌: రూ.573
స్టాప్‌ లాస్‌: రూ.498
రిటర్న్‌ అంచనా: 10 శాతం
ఈ స్టాక్‌ కరెక‌్షన్‌ తర్వాత డైలీ చార్ట్స్‌లో ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌ వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. వీక్లి చార్ట్స్‌లో బుల్లిస్‌ హరామి క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. ఇది స్టాక్‌లో ర్యాలీని సూచిస్తోంది. స్టాక్‌ దీర్ఘకాల అప్‌ట్రెండ్‌లో ఉంది. ప్రస్తుతం స్టాక్‌ ధర లోయర్‌ బాండ్‌లో ఉంది. స్వల్ప కాలంలో స్టాక్‌లో డిమాండ్‌ ఏర్పడవచ్చని అంచనాలున్నాయి. అందువల్ల స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

గమనిక: స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు ఈ స్టాక్‌ సిఫార్సులు చేశారు.  ఇన్వెస్టర్లు స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహా తీసుకోవడం ఉత్తమం.   



You may be interested

ఐదు స్టాక్స్‌.. ర్యాలీకి సిద్ధం!!

Monday 6th August 2018

రానున్న కాలంలో బుల్లిష్‌ ట్రెండ్‌ కనిపిస్తోందని అంటున్నారు నిర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌) హెడ్‌ షబ్బీర్‌ కైయుమి. అందువల్ల 20 శాతం దాకా రాబడిని అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. అరబిందో ఫార్మా- కొనొచ్చు ప్రస్తుత ధర రూ.625 కొనుగోలు శ్రేణి: రూ.595-620 టార్గెట్‌ ప్రైస్‌: రూ.750 స్టాప్‌ లాస్‌: రూ.565 రిటర్న్‌ అంచనా: 20 శాతం అరబిందో ఫార్మా షేరులో ట్రెండ్‌లైన్‌ బ్రేక్‌ అవుట్‌ కనిపించింది. కనిష్ట స్థాయిని

ఫారం 26ఏఎస్‌ తప్పుల తడకైతే.. 

Monday 6th August 2018

ఆదాయ పన్ను శాఖ నిర్వహించే వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన ఆదాయ పన్నుల రికార్డును ఫారం 26ఏఎస్‌ అంటారు. మీరు చెల్లించే టీడీఎస్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ ఈ రికార్డులో నమోదవుతుంది. స్వయంగా చెల్లించే ముందస్తు పన్ను, ఆ తరువాత సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ వివరాలతో పాటు మీ పేరు, చిరునామా, పాన్‌ కార్డ్‌ నెంబర్‌ వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకులో జమచేసిన మొత్తం

Most from this category