STOCKS

News


వీటిల్లో ఎఫ్‌ఐఐలు, ఫండ్స్‌ వాటాలు పెరుగుతున్నాయ్‌

Saturday 17th November 2018
Markets_main1542393304.png-22105

స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన వేల కంపెనీల్లో రాబడులకు అవకాశం ఉన్న మంచి షేర్ల కోసం రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. కొన్ని గణాంకాల ఆధారంగా పెట్టుబడులకు అనువైన షేర్లను సులభంగానే గుర్తు పట్టొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు క్రమంగా ఓ కంపెనీలో పెట్టుబడులు పెంచుకుంటున్నారంటే... ఆ కంపెనీ వృద్ధి అవకాశాలపై వారు ఎంతో ఆశావహంగా ఉన్నట్టే. గడిచిన మూడు త్రైమాసికాల కాలంలో ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్‌ పండ్స్‌ సంస్థలు వాటాలు పెంచుకున్న కంపెనీలను గమనించినట్టయితే... 

 

ఐటీ సేవల రంగంలోని సోనాటా సాఫ్ట్‌వేర్‌లో గత డిసెంబర్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 4.27 శాతంగా ఉంటే, ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి అది 6.91 శాతానికి పెరిగింది. ఇదే కంపెనీలో ఎఫ్‌ఐఐల వాటా ఇదే కాలంలో 13.17 శాతం నుంచి 16.64 శాతానికి చేరింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 76 శాతం రాబడులు ఇచ్చింది. ఇటువంటిదే మరో స్టాక్‌ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. ఇందులో మ్యూచువల్‌ పండ్స్‌ సంస్థల వాటా 2.8 శాతం నుంచి 3.66 శాతానికి పెరిగింది. ఎఫ్‌ఐఐల వాటా 5.57 శాతం నుంచి 8.86 శాతానికి చేరింది. ప్లాస్టిబ్లెండ్స్‌ ఇండియాలోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా గతేడాది డిసెంబర్‌ నాటికి కేవలం 0.03 శాతమే ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 1 శాతానికి చేరుకుంది. ఎఫ్‌ఐఐలు కూడా సెప్టెంబర్‌ క్వార్టర్లో తమ వాటాలను అరశాతం నుంచి 1.12 శాతానికి పెంచుకున్నారు. కానీ, ఈ స్టాక్‌ గత ఏడాది కాలంలో 10 శాతం క్షీణించింది.

 

వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో ఎఫ్‌ఐఐల వాటా 9.47 శాతం నుంచి 9.75 శాతానికి చేరుకుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా కూడా 12.5 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. ఆటోమోటివ్‌ లైటింగ్‌ కంపెనీ లుమాక్స్‌ ఇండస్ట్రీస్‌లో ఎఫ్‌ఐఐలు 0.63 శాతం నుంచి 0.85 శాతానికి, ఫండ్స్‌ సంస్థలు ఒక శాతం మేర వాటాలను పెంచుకున్నాయి. రామకృష్ణ ఫోర్జింగ్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా 14.34 శాతానికి, ఎఫ్‌ఐఐల వాటా 18 శాతానికి పెరిగాయి. జేఎం ఫైనాన్షియల్‌లోనూ ఫండ్స్‌ వాటా 3 శాతం నుంచి 4.19 శాతానికి, ఎఫ్‌ఐఐల వాటా 16 శాతం నుంచి 17.64 శాతానికి పెరిగాయి. 



You may be interested

టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్ల బైబ్యాక్‌

Saturday 17th November 2018

టాటా గ్రూపులో భాగమైన టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ షేర్ల బైబ్యాక్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. 45 లక్షల షేర్ల వరకు ఒక్కో షేరును రూ.1,000 చొప్పున కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రూ.450 కోట్లతో 8.17 శాతానికి సమానమైన వాటాలను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారమే ఇది ఉంటుందని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బాండ్ల జారీ..!

Friday 16th November 2018

ముంబై: ప్రైవేటు రంగ ఫైనాన్స్‌ దిగ్గజమైన హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) త్వరలోనే బాండ్లను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటు గృహ రుణ మంజూరీ పెంచడం కోసం వచ్చే ఏడాది జనవరిలో సంస్థ డాలర్‌ బాండ్ల జారీ ద్వారా ఒక బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,185 కోట్లు)ను సమీకరించనుందని అనధికారికంగా వెల్లడైంది. ప్రస్తుతం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండగా.. ఈ సమస్యను అధిగమించడంలో

Most from this category