STOCKS

News


ఏడాది కోసం ఐదు సిఫార్సులు

Friday 19th October 2018
Markets_main1539936115.png-21290

వచ్చే 12- 15 నెలల కాలంలో మంచి రాబడినందించే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.
1. గ్రాఫైట్‌ ఇండియా: ఈ ఏడాది కంపెనీ ఎర్నింగ్స్‌ రికార్డు స్థాయికి చేరతాయని అంచనా. మూడేళ్లు వరుసగా నష్టాలు నమోదు చేసిన సంస్థ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చూపుతోంది. దీనికితోడు అత్యంత చౌక వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ వినియోగంలో అప్‌ట్రెండ్‌ ఆరంభం కావడం కంపెనీకి కలిసివచ్చే అంశం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ డిమండ్‌ గరిష్ఠానికి చేరవచ్చని అంచనా. అందువల్ల అప్పటివరకు స్టాకు అప్‌ట్రెండ్‌ కొనసాగించగలదని భావిస్తున్నట్లు డీఎస్‌పీ మెరిలించ్‌ తెలిపింది.
2. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌: జీఎస్‌పీఎల్‌ హెచ్‌పీ పైప్‌లైన్‌ టారిఫ్‌లను 28 శాతం మేర పెంచడం జరిగింది. దీంతో షేరు ఈపీఎస్‌ అంచనాలను అనలిస్టులు 6 శాతం మేర పెంచారు. సీజీడీ, పీఎన్‌జీ రంగాల్లో వృద్ది కంపెనీకి అనుకూలమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. పీఎన్‌జీఆర్‌బీ త్వరలో మరోమారు ట్రాన్స్‌మిషన్‌ టారిఫ్‌లు పెంచవచ్చని, దీంతో ఎర్నింగ్స్‌ మరింత అప్‌గ్రేడ్‌ అవుతాయని అంచనా వేసింది.
3. హిమాద్రి కెమికల్స్‌: కార్బన్‌ మెటీరియల్స్‌, కెమికల్స్‌ ఉత్పత్తిదారు. కార్బన్‌బ్లాక్‌ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. క్రమానుగతంగా రుణాలు తగ్గించుకొని ప్రస్తుతం ఆరోగ్యవంతమైన రెవెన్యూ నమోదు చేస్తోంది. కంపెనీ ఎబిటా 28.5 శాతం చక్రీయ వార్షిక వృద్దినమోదు చేయగలదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది.
4. జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: తక్కువ మూలధన వ్యయంతో సామర్ధ్యాన్ని 1.1 మిలియన్‌ టన్నులకు పెంచుకునే యత్నాల్లో ఉంది. మార్కెట్లో మంచి వాటా ఉండడం, లాభాలు మెరుగుపడుతుండడం, అధిక రిటర్న్‌ నిష్పత్తి.. కంపెనీ బలాలు. రాబోయే రోజుల్లో రూ.151 టార్గెట్‌ను చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఎమ్‌కే గ్లోబల్‌ తెలిపింది.
5. నేషనల్‌ అల్యూమినియం: అల్యూమినియం రేట్లు పెరగడం, రూపీ క్షీణతతో కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను అనలిస్టులు 5.5 శాతం పెంచారు. ఇటీవల కాలంలో బాక్సైట్‌ ఉత్పత్తిని కంపెనీ 3 శాతం మేర పెంచింది. అల్యుమినా రిఫైనరీ సామర్ధ్య విస్తరణ యత్నాలు చేస్తోంది. ప్రస్తుతం షేరు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 



You may be interested

ఐటీ, ఫార్మాలు మెరుగు...టెలికాం, ఎన్‌బీఎఫ్‌సీలతో జాగ్రత్త

Friday 19th October 2018

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్కువగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలు మంచి ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చని, వీటి ప్రాఫిట్‌ మార్జిన్లు మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలికం, మెటల్స్‌, మైనింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు చెందిన స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శరవణ కుమార్‌ హెచ్చరించారు. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ

రేటింగ్‌ కోత.. మైండ్‌ట్రీ 17 శాతం పతనం..

Friday 19th October 2018

సిటీ గ్రూప్‌, ఫిలిప్‌ క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు క్యూ2 ఎర్నింగ్స్‌ వెల్లడి తర్వాత మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించాయి. క్యూ2లో మైండ్‌ట్రీ రెవెన్యూ అంచనాలను అందుకోలేకపోవడం, వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటం, కంపెనీ స్థూల అంశాలు సంబంధిత రంగానికి భిన్నంగా ఉండటం, బ్రెగ్జిట్‌ ఆందోళనలు వంటి అంశాలు రేటింగ్‌ కోతకు కారణం. బ్రోకరేజ్‌ సంస్థల నిర్ణయంతో మైండ్‌ట్రీ షేరు శుక్రవారం 17.5

Most from this category