STOCKS

News


ఐదు దిగ్గజ షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 6th September 2018
Markets_main1536223588.png-20019

అంతర్జాతీయ ప్రముఖ బ్రోకరేజ్‌లు ఐదు దేశీయ బడా కంపెనీల షేర్లపై బుల్లిష్‌గా ఉన్నాయి. వివరాలు..
1. ఆర్‌ఐఎల్‌: సీఎల్‌ఎస్‌ఏ సంస్థ కొనొచ్చు రేటింగ్‌ను రూ. 1500 టార్గెట్‌ను ఇచ్చింది. బహుళార్ధసాధక వ్యూహం ఆర్‌ఐఎల్‌కు లాభించనుందని, దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుందని తెలిపింది. జియోతో మరింత మార్కెట్‌ విస్తృతిని చేరుతోందని తెలిపింది.
2. భారత్‌ ఫోర్జ్‌: క్రెడిట్‌ సూసీ సంస్థ అవుట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌ను రూ. 750 టార్గెట్‌ను ఇచ్చింది. రూపీ పతనంతో కంపెనీకి చాలా లాభమని తెలిపింది. కంపెనీ రెవెన్యూలో 60 శాతం ఎగుమతులే కావడం విశేషం. కొత్తగా గెలుచుకున్న ఆర్డర్లు మరింత ప్రయోజనకారులని తెలిపింది. 
3. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: డాయిష్‌ బ్యాంకు కొనొచ్చు రేటింగ్‌ను రూ. 1430 టార్గెట్‌ను ఇచ్చింది. కంపెనీ ఎర్నింగ్స్‌ వృద్ధి అద్భుతంగా ఉండనుంది. మార్జిన్లు బలంగా కొనసాగనున్నాయి. వాల్యూం వృద్ధి మరింత మెరుగుపడనుంది. వీఎస్‌ఎఫ్‌ సామర్ధ్యం విస్తరిస్తోంది.
4. టాటా మోటర్స్‌: నోమురా సంస్థ కొనొచ్చు రేటింగ్‌ను రూ 356 టార్గెట్‌ను ఇచ్చింది. ఆగస్టులో యూఎస్‌లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు అనుకున్నదానికన్నా అనూహ్యంగా అధికంగా ఉన్నాయని తెలిపింది. చైనాలో డిమాండ్‌ ఊపందుకోవడంతో ఆర్థికసంవత్సరాంతానికి జేఎల్‌ఆర్‌ వాల్యూంల్లో 4 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్టాకు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉంది.
5. ఐసీఐసీఐ బ్యాంకు: సిటి సంస్థ కొనొచ్చు రేటింగ్‌ను రూ. 390 టార్గెట్‌ను ఇచ్చింది. రిస్కీలోన్లను బ్యాంకు తగ్గించుకుంటోంది. 2020 నాటికి ఆర్‌ఓఈ 15 శాతంగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొండిపద్దుల గుర్తింపు చివరిదశలో ఉందని, అనంతరం రికవరీలపై దృష్టి మరలనుందని తెలిపింది. You may be interested

రెండు అంశాలూ మెరుగుపడితేనే బుల్లిష్‌!

Thursday 6th September 2018

మోర్గాన్‌స్టాన్లీ భారత మార్కెట్లపై స్వల్ప అప్రమత్తతతో ఉన్నామని మోర్గాన్‌స్టాన్లీ ప్రతినిధి స్వనంద్‌ కేల్కర్‌ చెప్పారు. ఎకానమీలో కీలకమైన రెండు అంశాలు మెరుగుపడితేనే తమ ధృక్పథం బుల్లిష్‌గా మారుతుందని వివరించారు. రూపీ క్షీణత, క్రూడయిల్‌ పెరుగుదలకు చెక్‌ పడడం, స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడడం.. అనే రెండు అంశాల పురోగతి ఆధారంగా బుల్లిష్‌గా మారతామని చెప్పారు. కనీసం రెండు మూడునెలలైనా క్రూడ్‌, రూపీ ప్రధానాంశాలుగా లేకుండా పోవాలన్నారు. అప్పుడే నిర్మాణాత్మకంగా ఆలోచించగలమని చెప్పారు.

రూపీ పతనంతో పార్మా షేర్ల జోరు

Thursday 6th September 2018

రూపాయి క్షీణతతో మార్కెట్‌ నిలువునా పతనవుతుంటే మరోవైపు ఫార్మా షేర్లు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72.10 స్థాయి వద్ద కొత్త కనిష్టాలకు పతనమవడంతో విదేశీ ఎగుమతులపై ఆధారపడే ఫార్మా షేర్లు లాభాలబాట పట్టాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టపోతున్నప్పటి నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ 2శాతం వరకూ ర్యాలీ చేసింది. ఈ సూచీలోని భాగమైన 10 షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌

Most from this category