STOCKS

News


అల్టోను అధిగమించిన స్విఫ్ట్‌

Tuesday 25th December 2018
Markets_main1545723150.png-23223

  • బాగా అమ్ముడైన టాప్‌-10లో ఆరు మారుతీవే
  • చివరి నాలుగు స్థానాలను సాధించిన హ్యుందాయ్‌
  • సియామ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్‌ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్‌ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌ నెలలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం టాప్‌ టెన్‌ కార్లలో మొదటి ఆరు స్థానాలను మారుతీ కాంపెనీ కార్లే సాధించగా, చివరి నాలుగు స్థానాలను హ్యుందాయ్‌ సాధించింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం...
- గత ఏడాది నవంబర్‌లో అమ్మకాల పరంగా ఆరో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్‌ ఈ నవంబర్‌లో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.
- మారుతీ కంపెనికి చెందిన డిజైర్‌ కారు గత నవంబర్‌లోనూ, ఈ నవంబర్‌లోనూ రెండో స్థానంలోనే నిలిచింది. కాకుంటే అప్పటితో పోలిస్తే ఈ నవంబర్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.
- అప్పుడు - ఇప్పుడు కూడా మూడో స్థానాన్ని మారుతీ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో సాధించింది.
- గతంలో నాలుగో స్థానంలో నిలిచిన విటారా బ్రెజా ఈ సారి ఐదో స్థానానికి పడిపోయింది.
- గత ఏడాది 9వ స్థానంలో ఉన్న హ్యుందాయ్‌​క్రెటా ఈ ఏడాది నవంబర్‌లో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.
- ఇక గతంలో ఏడో స్థానంలో ఉన్న హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 ఈ సారి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది.
- హ్యుందాయ్‌ కంపెనీ మళ్లీ ప్రవేశపెట్టిన శాంత్రో కారు పదవ స్థానంలో నిలిచింది. 2014, డిసెంబర్‌లో మార్కెట్‌ నుంచి ఉపసంహరించిన ఈ కారును ఈ ఏడాది అక్టోబర్‌లో హ్యుందాయ్‌ మళ్లీ ప్రవేశపెట్టింది.



You may be interested

ఏడాదిన్నర కనిష్టానికి క్రూడాయిల్‌

Tuesday 25th December 2018

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్‌ ఉత్పత్తి పెరుగుదలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. క్రూడ్ ఉత్పత్తిదారులు తన ఉత్పత్తులను భారీగా పెంచడంతో క్రూడాయిల్‌ ధర వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత

గవర్నర్‌ తన ధర్మాన్ని పాటించాలి

Tuesday 25th December 2018

ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలి: సి.రంగరాజన్‌ ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడే విషయంలో నూతన గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తన ధర్మాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సూచించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వ అధికారి శక్తికాంతదాస్‌ కాదని చెప్పారాయన. ‘‘చాలా మంది ఢిల్లీ అధికారులు ఆర్‌బీఐలోకి వచ్చారు. ఇదే తొలిసారి కాదు. ఒక్కసారి వారు బాధ్యతలు చేపట్టాక ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే కృషి చేశారు’’ అని రంగరాజన్‌ వ్యాఖ్యానించారు. ఇది ధర్మం

Most from this category