STOCKS

News


యస్‌ బ్యాంక్‌...ఈ ధరలో యస్సేనా?

Friday 28th September 2018
Markets_main1538128272.png-20680

ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తాజాగా కరెక‌్షన్‌ తర్వాత యస్‌ బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఏవిధంగా చూడాలి? మెటల్స్‌లో టాప్‌-4 స్టాక్స్‌ ఏంటి? అనే పలు అంశాలను తెలియజేశారు. అవేంటో ఆయన మాటాల్లోనే.. 
♦ బ్యాంక్‌ను ఎవరు ముందుండి నడుపుతారనే అంశంపై స్పష్టత వచ్చే వరకు యస్‌ బ్యాంక్‌లో అస్థిరత కొనసాగుతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరపు ప్రైస్‌-టు-బుక్‌ (పుస్తక విలువ) అంచనాలకు 1.2 రెట్లు, 1.3-1.4 రెట్లు వద్ద స్టాక్‌కు మంచి వ్యాల్యు లభిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌ ధర ఈ స్థాయిలకు సమీపంలో ఉంది. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్‌కు సంబంధించి ఏ చిన్న విషయం వెల్లడైనా కూడా అది స్టాక్‌పై ప్రభావం చూపుతుంది. మరికొన్ని రోజులు స్టాక్‌ ధర దిగువ స్థాయిల్లోనే ఉంటుంది. 
♦ మెటల్స్‌లో టాటా స్టీల్‌ టాప్‌ పిక్‌. భూషణ్‌ స్టీల్‌, ఉషా మార్టిన్‌ వంటి కంపెనీలకు కొనుగోలు చేసింది. వీటివల్ల కంపెనీ లెవరేజ్‌ పెరగొచ్చు. అయితే ఔట్‌లుక్‌ మాత్రం బలంగా ఉంది. రెండు కొనుగోళ్ల ద్వారా కంపెనీ లాభదాయకత గణనీయంగా పెరిగే అవకాశముంది. యూరప్‌ సమస్యలు పరిష్కారమౌతున్నాయి. టాటా స్టీల్‌ ఎంటర్‌ప్రైజ్‌ వ్యాల్యు 2019-2020 ఆర్థిక సంవత్సపు ఈబీటా అంచనాలకు 5.2 రెట్లు వద్ద ఉంది. ఇది కొనుగోలుకు మంచి సమయం. నాన్‌-ఫెర్రస్‌ వైపు చూస్తే.. హిందాల్కో, టాటా మెటాలిక్స్‌, టాటా స్పాంజ్‌ వంటి వాటిపై పాజిటివ్‌గా ఉన్నాం. ఇవ్వన్నీ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. 
♦ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్స్‌ బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయి. వీటి వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నా‍యి. ప్రస్తుత స్థాయిల్లో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. 3-6 నెలల తర్వాత పరిస్థితులు చక్కబడినప్పుడు ఈ స్టాక్స్‌ మళ్లీ పుంజుకోవచ్చు. హౌసింగ్‌ ఫైనాన్స్‌కు సంబంధించి ఎన్‌పీఏల మాదిరిగా పెద్ద సమస్య ఏదీ కనిపించడం లేదు. స్వల్పకాలంలో లిక్విడిటీ సంబంధిత సమస్యలు ఉండొచ్చు. దివాన్‌ 40 ఏళ్ల నాటి కంపెనీ. ఇక ఇండియాబుల్స్‌ 150 ఏళ్ల కన్నా పాత కంపెనీ. మార్కెట్లు భయపడాల్సిన అవసరం లేదు. You may be interested

తీవ్ర హెచ్చుతగ్గులు: నష్టాలతో ముగింపు

Friday 28th September 2018

ముంబై:- శుక్రవారం ట్రేడింగ్‌ అద్యంతం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ చివరికి నష్టంతో ముగిసింది. బలహీనమైన మార్కెట్‌ పరిస్థితులు సూచీల నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. అటో, మెటల్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 35,227 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 10,696 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35177 - 35438 పాయింట్ల శ్రేణిలో కదలాడగా,

కరిగిన మెటల్‌, రియల్టి షేర్లు

Friday 28th September 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా శుక్రవారం ట్రేడింగ్‌లో మెటల్‌, రియల్టీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అత్యధికంగా 5శాతం నష్టపోగా, రియల్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 5శాతం నష్టపోయింది. నిఫ్టీ మెటల్‌ మెటల్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 3,669.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత కొంతకాలంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతున్న మెటల్‌ షేర్లలో నేడు ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.

Most from this category