STOCKS

News


స్వల్పకాలానికి 3 టెక్నికల్‌ సిఫార్సులు

Thursday 22nd November 2018
Markets_main1542872625.png-22306

బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌ సమీప కాలంలో లాభాలందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. 

ఫెడరల్‌ బ్యాంక్‌
కొన్ని రోజుల కన్సాలిడేషన్‌ తర్వాత స్టాక్‌ గరిష్ట స్థాయిలో క్లోజయ్యింది. లైన్‌ చార్ట్‌లో స్టాక్‌ ప్రైస్‌.. తన మునపటి కీలక స్థాయి పైకి కదలింది. అలాగే వీక్లి ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ క్రాసోవర్‌లో ఉంది. అలాగే పెరుగుతోంది. ట్రేడర్లు రూ.92 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.79 స్టాప్‌ లాస్‌తో 82-83.5 శ్రేణి వద్ద ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
ఈ స్టాక్‌ వీక్లి చార్ట్‌లో ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌ బ్రేక్‌ఔట్‌ను సూచిస్తోంది. అంటే సమీప కాలంలో స్టాక్‌ ధర పెరగొచ్చు. డైలీ చార్ట్‌లో ఇటీవలి కన్సాలిడేషన్‌ ప్యాట్రన్‌ పైకి కదిలింది. ఇది పెరుగుదలను సూచిస్తోంది. స్టాక్‌ ధర ఇటీవల రూ.7,200 నుంచి రూ.4,950కి పడిపోయిన తర్వాత మళ్లీ 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి పైకి వచ్చింది. ట్రేడర్లు ఈ స్టాక్‌ను రూ.5,830- రూ.5,860 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.6,342. స్టాప్‌ లాస్‌ రూ.5,629. 

డిష్‌ టీవీ
వీక్లి చార్ట్‌లో డిష్‌ టీవీ స్టాక్‌ బుల్లిష్‌ హరామి ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఇది కరెక‌్షన్‌ తర్వాత రివర్సల్‌ ట్రెండ్‌ను సూచిస్తుంది. ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌ నుంచి బ్రేక్‌ఔట్‌ అయ్యింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా కనిపిస్తోంది. టెక్నికల్‌ ఇండికేటర్లను గమనిస్తే స్టాక్‌ ధరలో రికవరీ ఉండొచ్చని తెలుస్తోంది. ట్రేడర్లు ఈ స్టాక్‌ను రూ.38-రూ.39 శ్రేణి వద్ద కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.45. 
స్టాప్‌ లాస్‌ రూ.36.4.



You may be interested

రీకవరీ బాటలో ఐటీ షేర్లు

Thursday 22nd November 2018

గత ట్రేడింగ్‌లో సూచీల పతనానికి కారణమైన ఐటీ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా ర్యాలీ ఐటీ షేర్ల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించింది. బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో ఇంట్రాడేలో టెక్‌మహీంద్రా షేరు​3శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(13,879.15)తో పోలిస్తే 1.20శాతం లాభంతో 14070ల వద్ద ట్రేడ్‌

టెక్‌ మహీంద్రాకు రేటింగ్‌ బూస్ట్‌

Thursday 22nd November 2018

గ్లోబల్‌ బ్రేకరేజ్‌ హౌసింగ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో టెక్‌ మహీంద్రా షేరు గురువారం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో టెక్‌మహీంద్రా షేరు రూ.696.00ల వద్ద ప్రారంభమైంది. టెక్‌ మహీంద్రా కంపెనీ ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదికను సమర్పించాలని విశ్లేషకులను కోరింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన జెఫ్పారీస్‌, క్రిడెట్‌ స్యూస్‌, మోర్గాన్‌ స్టాన్లీ షేరు రేటింగ్‌ను సవరించడంతో టార్గెట్‌ ధరను పెంచాయి. బ్రేకరేజ్‌ హౌసింగ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో ఇన్వెస్టర్లు ఈ

Most from this category