STOCKS

News


మీకోసం.. టాప్‌-12 గ్రోత్‌ స్టాక్స్‌..

Monday 12th November 2018
Markets_main1542009586.png-21901

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌ తుఖ్రాల్‌ తాజాగా సమర్ధవంతమైన మేనేజ్‌మెంట్‌ను కలిగిన, వచ్చే ఏడాది కాలం లక్ష్యంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన టాప్‌-12 గ్రోత్‌-ఓరియెంటెడ్‌ స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. 

► అశోక్‌ లేలాండ్‌: రెండో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ కంపెనీ. వాణిజ్య వాహన విక్రయాలు పుంజుకోవడటం సానుకూల అంశం. కంపెనీ అన్ని విభాగాల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది. 

► బజాజ్‌ ఫైనాన్స్‌: మంచి డైవర్సిఫైడ్‌ ఎన్‌బీఎఫ్‌సీలలో ఇది ఒకటి. స్థిరమైన ఎర్నింగ్స్‌ పరితీరు సానుకూల అంశం. పాజిటివ్‌ ఏఎల్‌ఎం, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ లిక్విడిటీ కారణంగా అసెట్‌ క్వాలిటీ నిలకడగా ఉంది.

► సిప్లా: అమెరికా విక్రయాలు మెరుగుపడతాయనే అంచనాలున్నాయి. తక్కువ పోటీ ఉన్న ప్రొడక్టుల ఆవిష్కరణపై దృష్టి కేంద్రీకరించింది. దేశీ వ్యాపారం మెరుగ్గా ఉంది. 

► హిందుస్తాన్‌ యూనిలివర్‌: స్థిర డిమాండ్‌ ఔట్‌లుక్‌ పాజిటివ్‌ అంశం. గ్రామీణ మార్కెట్‌ పెరుగుదల వల్ల కంపెనీ ఎర్నింగ్స్‌ పెరగొచ్చు.

► ఐసీఐసీఐ బ్యాంక్‌: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఇది ఒకటి. నాయకత్వ మార్పు, రిటైల్‌ విభాగానికి అధిక ప్రాధ్యాన్యమివ్వడం వంటివి సానుకూల అంశాలు.

► ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌: పెద్ద పెద్ద డీల్స్‌ను దక్కించుకుంటోంది. రూపాయి క్షీణత వల్ల మార్జిన్లు పెరగొచ్చు.

► మిందా ఇండస్ట్రీస్‌: డిమాండ్‌ పెరుగుదల సానుకూల అంశం. టూవీలర్‌, ప్యాసింజర్‌ వాహన విభాగాల్లోని కొత్త నిబంధనల వల్ల కంపెనీకి ప్రయోజనం కలుగుతుంది.  

► మోల్డ్‌-టెక్‌ ప్యాకేజింగ్‌: పెయింట్స్‌ విభాగం నుంచి వ్యాల్యూమ్స్‌ పెరగొచ్చనే అంచనాలున్నాయి. కంపెనీ మార్జిన్లు పెరగొచ్చు.

► రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిటైల్‌ వ్యాపారం, జియో.. ఇవి రెండూ వృద్ధికి దోహదపడే విభాగాలు. గిగాఫైబర్‌ ఆవిష్కరణ, హాత్‌వే సహా డెన్‌ కొనుగోలు వంటివి సానుకూల అంశాలు. పెట్రోకెమికల్‌ వ్యాపారంలో పెరుగుదల కొనసాగుతుంది.  

► స్టీల్‌ స్ట్రిప్‌ వీల్స్‌: వాణిజ్య వాహన డిమాండ్‌ పెరుగుదల సానుకూల అంశం. 

► టైటాన్‌: మార్కెట్‌ వాటా పెరుగుదల కారణంగా వృద్ధి కొనసాగవచ్చు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వల్ల పోర్ట్‌ఫోలియోలోని గ్యాప్‌లను భర్తీ చేయాలని భావిస్తోంది. 

► ట్రైడెంట్‌: సామర్థ్య వినియోగం మెరుగుపడింది. ఇది కంపెనీకి పాజటివ్‌ అంశం. మంచి నిర్వహణ పనితీరు కారణంగా మార్జిన్లు మెరుగుపడొచ్చు. You may be interested

నష్టాల బాటలో టాటామోటర్స్‌ షేర్లు

Monday 12th November 2018

టాటా మోటార్స్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టింది. అక్టోబర్‌లో తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. నేడు షేరు బీఎస్‌ఈలో రూ.195.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 5శాతం నష్టపోయి రూ.186.15ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు

భారీగా నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Monday 12th November 2018

సూచీల పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్ల భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అ‍త్యధికంగా 2శాతం నష్టపోయింది.  ముఖ్యంగా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల పతనానికి కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు (2,928.45)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 2,886.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన

Most from this category