News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 20th November 2018
Markets_main1542683273.png-22194

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 7:46 సమయంలో 39 పాయింట్ల నష్టంతో 10,743 పాయింట్ల వద్ద ఉంది. 

♦ రిజర్వు బ్యాంక్‌ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. 

♦ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో దాదాపు కీలక అంశాలన్నిటి మధ్య సయోధ్య కుదిరింది. ‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో సభ్యులు, నిబంధనలను ప్రభుత్వం, ఆర్‌బీఐ ఉమ్మడిగా నిర్ణయిస్తాయి. ఇక రూ.25 కోట్ల వరకు ఎంఎస్‌ఎంఈల మొండి బకాయిలను పునరుద్ధరించే పథకాన్ని పరిశీలించాలని కూడా నిర్ణయించడం జరిగింది’ అని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే పీసీఏ పరిధిలోకి వచ్చిన బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లు పేర్కొంది. 

♦ క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగా ఉన్నాయి. అమెరికా నుంచి ఉత్పత్తి పెరగడం, డిమాండ్‌ వృద్ధి మందంగించడం వంటి అంశాల నేపథ్యంలో ఒపెక్‌ గ్రూప్‌ త్వరలో ఓవర్‌ సప్లైను నియంత్రించేందుకు క్రూడ్‌ సరఫరాను తగ్గిస్తుందనే అంచనాలు ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 66.75 డాలర్ల వద్ద ఉంది. 

♦ రూపాయి సోమవారం 26 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.67 వద్ద ముగిసింది. రూపాయికి ఇది 10 వారాల గరిష్ట స్థాయి. 

♦ టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ 2019 అజెండాపై చర్చించేందుకు వచ్చే నెలలో టెల్కోలతో, పరిశ్రమ సంబంధిత ఇతర సంస్థలతో సమావేశం కానుంది. 

♦ ఇన్వెస్టర్లు ఆఫ్‌షోర్‌ ఇండియా ఫండ్స్‌, ఈటీఎఫ్‌ల నుంచి సెప్టెంబర్‌ క్వార్టర్‌లో నికరంగా 1.8 బిలియన్‌ డాలర్ల నిధులను వెనక్కు తీసుకున్నారు. ఇక ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలోని (జనవరి-సెప్టెంబర్‌) ఉపసంహరణలు 3.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

♦ బిట్‌ కాయిన్‌ ధర 5,000 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి. క్రిప్టోకరెన్సీలపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. 

♦ అమెరికా మార్కెట్లు సోమవారం బాగా పడిపోయాయి. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు దాదాపు 2 శాతం మేర క్షీణిస్తే.. నాస్‌డాక్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.56 శాతం లేదా 396 పాయిం‍ట్ల నష్టంతో 25,017 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.66 శాతం లేదా 46 పాయింట్ల నష్టంతో 2,690 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.03 శాతం లేదా 219 పాయింట్ల నష్టంతో 7,028 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌ పడిపోవడం ఇండెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. యాపిల్‌ 4 శాతం, అమెజాన్‌ 5 శాతం, ఫేస్‌బుక్‌ 5.7 శాతం క్షీణించాయి. ఇటీవల కాలంలో ఇండెక్స్‌లను కొత్త గరిష్ట స్థాయిలకు తీసుకెళ్లిన ఫ్యాంగ్‌ స్టాక్స్‌ కొన్ని రోజులుగా బాగా కరెక‌్షన్‌కు గురవుతున్నాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ స్టాక్స్‌ను ఫ్యాంగ్‌గా పేర్కొంటారు. ఇవి ఈ ఏడాది గరిష్ట స్థాయిల నుంచి చూస్తే దాదాపు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. 

♦ అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 23 పాయింట్ల నష్టంతో 3,042 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 34 పాయింట్ల నష్టంతో 9,795 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 2,685 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 16 పాయింట్ల నష్టంతో 2,084 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 370 పాయింట్ల నష్టంతో 26,002 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 166 పాయింట్ల నష్టంతో 21,655 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.You may be interested

నిస్సాన్ చీఫ్ ఘోన్‌ అరెస్ట్‌

Tuesday 20th November 2018

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్ ఘోన్‌ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారని జపాన్‌ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. "ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్ చైర్మన్ ఘోన్‌ను టోక్యో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అరెస్టు చేసింది" అని

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 20th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 7:46 సమయంలో 39 పాయింట్ల నష్టంతో 10,743 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,768 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category