STOCKS

News


రాబడికి 10 సిఫార్సులు..!

Wednesday 14th November 2018
Markets_main1542189282.png-22001

  • 12,000 పాయింట్లకు నిఫ్టీ..!

సాధారణ ఎన్నికలు సమీస్తున్నందున రానున్నకాలం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలంగా ఉందని విశ్లేషించిన రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌.. మార్కెట్‌ పడిపోయినప్పుడల్లా అత్యంత నాణ్యమైన షేర్లను కొనుగోలుచేయడం ద్వారా వచ్చే ఏడాదికాలంలో మంచి రాబడిని పొందవచ్చని సూచించారు. నిఫ్టీ 11,760 పాయింట్ల జీవితకాల గరిష్టస్థాయిని తాకిన తరువాత ఇప్పటి వరకు 10 శాతం పడిపోగా.. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,000 పాయింట్ల వద్ద ఉన్నట్లు విశ్లేషించారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 9,850 పాయింట్ల వద్దకు పడిపోయే అవకాశం ఉందని వివరించారు. ఎన్నికల వరకు నిఫ్టీ 9,700-11,000 శ్రేణిలోనే ఉండేందుకు అవకాశం ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రాజేష్ పాల్వియా అన్నారు. 11,000 పాయింట్లను అధిగమించగలిగితే వచ్చే దీపావళినాటికి 11,400-11,700 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 10,700 ఎగువన నిఫ్టీ నిలవగలిగితే 12,000-12,250 శ్రేణికి చేరుకునే అవకాశం ఉందని బొనాంజా పోర్టిఫోలియో విశ్లేషకులు రుపాక్ డి అన్నారు.

టెక్నికల్స్‌ ఆధారంగా ఏడాదిలో 60 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన షేర్లు

  • అరబిందో ఫార్మా | ప్రస్తుత ధర: రూ.798 | కొనుగోలు శ్రేణి: రూ.760-780 | స్టాప్ లాస్‌: రూ.720 | టార్గెట్ ధర: రూ.900 | రాబడి అంచనా 12 శాతం
  • పీవీఆర్‌ | ప్రస్తుత ధర: రూ.1,389 | టార్గెట్ ధర: రూ.1,580 | స్టాప్ లాస్‌: రూ.1,310 | రాబడి అంచనా 13 శాతం
  • డాబర్ ఇండియా | ప్రస్తుత ధర: రూ. 375 | స్టాప్ లాస్‌: రూ.355 | టార్గెట్ ధర: రూ.400 | రాబడి అంచనా 6 శాతం
  • హిందాల్కో ఇండస్ట్రీస్ | ప్రస్తుత ధర: రూ.229 | స్టాప్ లాస్‌: రూ.230 | టార్గెట్ ధర: రూ.258 | రాబడి అంచనా 13 శాతం
  • టాటా గ్లోబల్ బ్రూవరేజ్ | ప్రస్తుత ధర: రూ.214 | కొనుగోలు శ్రేణి: 210-215 | టార్గెట్ ధర: రూ.240 | స్టాప్ లాస్‌: రూ.200 | రాబడి అంచనా 12 శాతం
  • టాటా మోటర్స్ డీవీఆర్‌ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.100 | టార్గెట్ ధర: రూ.164 | స్టాప్ లాస్‌ రూ.77 | రాబడి అంచనా 64 శాతం
  • ఆర్‌బీఎల్‌ బ్యాంక్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.546 | టార్గెట్ రూ.630 | స్టాప్ లాస్ రూ.489 | రాబడి అంచనా 15 శాతం
  • బాటా ఇండియా | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.1018 | టార్గెట్ రూ.1,162 | స్టాప్ లాస్‌ 929 | రాబడి అంచనా 14 శాతం
  • మారికో | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.338 | టార్గెట్ ధర: రూ.400 | స్టాప్ లాస్‌ రూ.304 | రాబడి అంచనా 18 శాతం
  • హవేల్స్ ఇండియా | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.652 | టార్గెట్ రూ.745 | స్టాప్ లాస్ రూ.594 | రాబడి అంచనా 14 శాతం

ఇవి కేవలం టెక్నికల్‌ అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

ఎంఎస్‌సీఐ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో మరో 13 భారత కంపెనీలు

Wednesday 14th November 2018

ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో తాజాగా 13 దేశీ కంపెనీలకు స్థానం దక్కింది. ఫైనాన్షియల్‌ విభాగంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, భార‌త్ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్,  పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు చోటుదక్కింది. వీటితో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, ఫ్యూచర్ కన్స్యూమర్, లెమన్ ట్రీ హోటల్స్, మెర్క్, స్కెఫ్లర్‌ ఇండియా, సస్‌టెక్‌ రియాల్టీ, టాటా కెమికల్స్, వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్‌ ఉన్నాయి.  తొలగించిన జాబితా మొత్తం

మహీంద్రా లాభం రూ.1,778 కోట్లు

Wednesday 14th November 2018

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. కంపెనీ నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.1,778 కోట్లకు పెరిగింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,410 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.12,790 కోట్లకు పెరిగింది. గత

Most from this category