News


సత్తా చాటిన, చూపనున్న 10 షేర్లు ఇవి..!

Friday 29th December 2017
Markets_main1514542366.png-12640

ముంబై: ప్రస్తుత సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్‌ 28 శాతం రాబడిని అందించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మంచి రాబడిని ఇచ్చింది. నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీలు ఎర్నింగ్స్‌ కంటే 25, 46 రెట్లు అధికస్థాయిలో ట్రేడవుతున్నాయి. గడిచిన ఐదేళ్ల సగటు ఆధారంగా చూస్తే 26 శాతం, 116 శాతం ప్రీమియం వద్ద ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ఇంతటి ర్యాలీని ప్రదర్శించిన మన మార్కెట్‌ ఇకపై కూడా ఇదే జోరుతో కొనసాగే అవకాశం ఉందని అంటున్న వీరు 2018లో 10 షేర్లను సిఫార్సు చేస్తున్నారు. 2017లో 77 శాతం వరకు రాబడిని ఇచ్చిన ఈ 10 షేర్లు ఇకపై మరో 27 శాతం రాబడిని అందించగలవని సూచిస్తున్నారు. ఈ షేర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

లార్సెన్ అండ్‌ టుబ్రో
టార్గెట్‌ ధర రూ.1,450
ప్రస్తుత ధర రూ.1,253 (29, డిసెంబర్‌ 2017)

ఈ షేరు ఏడాది సగటు పీఈ 26.05 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.55.68 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.1,450 వద్దకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్
టార్గెట్‌ ధర రూ.667
ప్రస్తుత ధర రూ.582 (29, డిసెంబర్‌ 2017)

జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు ఏడాది సగటు పీఈ 38 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.17.54 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.667 వద్దకు వెళ్లే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

టెక్ మహీంద్ర
టార్గెట్‌ ధర రూ.569
ప్రస్తుత ధర రూ.504 (29, డిసెంబర్‌ 2017)

గడిచిన రెండేళ్ల సగటు పీఈ 15.12 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.37.66 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.569 వద్దకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

భారత్ ఎలక్ట్రానిక్స్
టార్గెట్‌ ధర రూ.213
ప్రస్తుత ధర రూ.182 (29, డిసెంబర్‌ 2017)

ఈ షేరు ఏడాది సగటు పీఈ 26.46 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.8.05 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.213 వద్దకు వెళ్లే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌
టార్గెట్‌ ధర రూ.38
ప్రస్తుత ధర రూ.32 (29, డిసెంబర్‌ 2017)

షేరు  2019 అంచనా ఈపీఎస్‌ రూ.2.88 ఆధారంగా టార్గెట్‌ ధరను రూ.38 వద్ద నిర్ణయించినట్లు తెలియజేశారు. వచ్చే 8-10 నెలలకాలంలో షేరు టార్గెట్‌ ధరను చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇండియన్ బ్యాంక్
టార్గెట్‌ ధర రూ.488
ప్రస్తుత ధర రూ.376 (29, డిసెంబర్‌ 2017)

ప్రైస్‌ టూ బుక్‌ వాల్యూ 1.35 రెట్లు, 2019 బీవీపీఎస్‌ రూ.331.97 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.488 వద్దకు వెళ్లే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 15 శాతం వృద్ధి అంచనగా వెల్లడించారు.

ఇంజినీర్స్ ఇండియా
టార్గెట్‌ ధర రూ.239
ప్రస్తుత ధర రూ.200 (29, డిసెంబర్‌ 2017)

ఇంజినీర్స్ ఇండియా షేరు గడిచిన రెండేళ్ల సగటు పీఈ 32 రెట్లు, 2019 అంచనా ఎర్నింగ్స్‌ రూ.7.48 ఆధారంగా పరిశీలిస్తే.. వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.239 వద్దకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

స్వరాజ్ ఇంజిన్స్
టార్గెట్‌ ధర రూ.2,384
ప్రస్తుత ధర రూ.2,057 (29, డిసెంబర్‌ 2017)

గడిచిన రెండేళ్ల సగటు పీఈ 29.49 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.80.83 ఆధారంగా పరిశీలిస్తే.. వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.2,384 వద్దకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.

అహ్లువాలియా కాంట్రాక్ట్స్
టార్గెట్‌ ధర రూ.473
ప్రస్తుత ధర రూ.387 (29, డిసెంబర్‌ 2017)

మూడేళ్ల సగటు పీఈ 21.41 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.22.1 ఆధారంగా పరిశీలిస్తే.. వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.473 వద్దకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గతి
టార్గెట్‌ ధర రూ.158
ప్రస్తుత ధర రూ.135 (29, డిసెంబర్‌ 2017)

గతి షేరు పీఈ 25 రెట్లు, 2019 అంచనా ఈపీఎస్‌ రూ.6.31 ఆధారంగా చూస్తే వచ్చే 8-10 నెలలకాలంలో షేరు ధర రూ.158 వద్దకు వెళ్లే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కేవలం విశ్లేషకుల అంచనాలు మాత్రమే. ఈ షేర్లను కొనుగోలు చేయదలుచుకున్న వారు సొంత అధ్యయనం తరువాత మాత్రమే కొనుగోలుచేయడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన. You may be interested

డబుల్‌ సెంచరీతో 2017కు వీడ్కోలు..!

Friday 29th December 2017

సెన్సెక్స్‌ 34000 పాయింట్ల ఎగువకు.. 10530 పాయింట్లు పైకి నిఫ్టీ... ముంబై:- సూచీలు ఈ ఏడాది లాభాలతో వీడ్కోలు పలికాయి. ఈ ఏడాది మార్కెట్‌ చివరిరోజైన శుక్రవారం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 208.80 పాయింట్లు లాభపడి 34,056.83 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52.80 పాయింట్లు లాభపడి 10,530.70 వద్ద ముగిశాయి. టెలికాం, ఐటీ, పవర్‌, అటోరంగ షేర్లలో కొనుగోళ్ల ఊపందుకోవడంతో  సూచీలు ప్రారంభం నుంచే లాభపడ్డాయి. దీంతో నేడు ప్రారంభంభమైన జనవరి సీరిస్‌ ఫ్యూచర్స్‌

భారీ పతనం నుంచి కోలుకున్న ఇన్ఫీబీమ్‌

Friday 29th December 2017

శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ పతనాన్ని చవిచూసిన ఈ-కామర్స్‌రంగ సంస్థ ఇన్ఫీబీమ్‌ ఇన్‌కార్పోరేషన్‌ లిమిటెడ్‌ షేరు...అటుతర్వాత కనిష్టస్థాయి నుంచి 47 శాతం వరకూ కోలుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన 30 నిమిషాల్లోనే 40శాతం పతమై 98.80 స్థాయిని తాకిన ఇన్ఫీబీమ్‌ చివరకు 13 శాతం నష్టంతో రూ. 141 వద్ద ముగిసింది.  ఈ కౌంటర్లో 10.50 కోట్లకుపైగా షేర్లు చేతులు మారాయి. షేరు తీవ్ర హెచ్చుతగ్గులకు కారణం తెలియరాలేదు. అయితే షేరు

Most from this category