STOCKS

News


షార్ట్‌టర్మ్‌ కోసం పది స్టాకులు

Monday 24th September 2018
Markets_main1537775768.png-20521

నెల రోజుల్లో సుమారు 15 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 
ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు-
1. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 394. స్టాప్‌లాస్‌ రూ. 351. ఏడాది ఆరంభం నుంచి ఓఎంసీ స్టాకులు కిందామీదాపడుతున్నాయి. రికార్డు గరిష్ఠాల నుంచి దాదాపు 25- 30 శాతం పతనమై ఇప్పుడిప్పుడే రికవరీ చూపుతున్నాయి. వీటిలో బీపీసీఎల్‌లో రికవరీ బాగుండే సూచనలున్నాయి. చార్టుల్లో బుల్లిష్‌ ఐలాండ్‌ రివర్సల్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. డ్రాగన్‌ఫ్లై డౌజీ క్యాండిల్‌ పాటర్న్‌ సైతం చూపుతోంది. ఇవన్నీ మరింత అప్‌మూవ్‌కు సంకేతాలు.
2. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 217. మార్కెట్‌లో భారీ పతనం వస్తున్నా మెటల్‌ షేర్లు అంతగా పడిపోవడంలేదు. వేదాంత రెండు నెలలుగా కన్సాలిడేషన్‌ జరుపుతోంది. శుక్రవారం వేగంగా రికవరీ చూపింది. రూ. 234 స్థాయికి పైన క్లోజయితే అప్‌ట్రెండ్‌ ఊపందుకుంటుంది. 
ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు-
1. గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 425. స్టాప్‌లాస్‌ రూ. 370. గత ఆగస్టులో ఏడాది గరిష్ఠాన్ని తాకింది. అనంతరం కన్సాలిడేషన్‌కు గురైంది. తాజాగా మరోమారు ఏడాదిహైస్థాయిని తాకేందుకు తయారైంది. రూ. 391 పైన క్లోజయితే మరో కొత్త గరిష్ఠాన్ని చేరవచ్చు. చార్టుల్లో కప్‌ అండ్‌ హ్యాండిల్‌ పాటర్న్‌ ఏర్పరిచి అప్‌ట్రెండ్‌ సంకేతాలు ఇస్తోంది. 
2. ఓఎన్‌జీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 200. స్టాప్‌లాస్‌ రూ. 165. జనవరి ర్యాలీ అనంతరం జూన్‌ సమయానికి ఏడాది కనిష్ఠానికి దిగివచ్చింది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏ స్థాయి వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ లక్షణాలున్నా కంటిన్యూషన్‌ ట్రయాంగిల్‌ ఏర్పరిచింది. స్వల్పకాలంలో రూ. 195- 200 స్థాయిని చేరవచ్చు. 
ఛాయిస్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు-
1. ఓఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 235. స్టాప్‌లాస్‌ రూ. 209. డైలీ చార్టుల్లో పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. వాల్యూంలుకూడా ఇందుకు మద్దతుగా ఉన్నాయి. కీలక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి.
2. భారతి ఇన్‌ఫ్రాటెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 320. స్టాప్‌లాస్‌ రూ. 263. రౌండింగ్‌ బాటమ్‌ పాటర్న్‌నుంచి బయటపడింది. ప్రస్తుతం ఎంఏసీడీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. షేరు ధర 20 రోజుల డీఎంఏ స్థాయికి పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది.
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు-
1. హెచ్‌పీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 280. స్టాప్‌లాస్‌ రూ. 240. కొన్ని రోజులుగా రూ. 230- 260 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. రూ. 247కి పైన బలంగా క్లోజయితే అప్‌మూవ్‌ ఆరంభం అవుతుంది. 
2. హీరోమోటోకార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3296. స్టాప్‌లాస్‌ రూ. 3090. గత ర్యాలీకి 80 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి రూ. 3100 వద్ద బాటమ్‌ ఏర్పరుచుకుంది. శుక్రవారం పతనంలో కూడా ఈ స్థాయిని కాపాడుకుంది. ఈ స్థాయికి పైన కొనసాగినంత వరకు మరికొంత అప్‌ట్రెండ్‌కు ఛాన్సులున్నాయి. 
ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సులు- 
1. జేకే పేపర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 193.స్టాప్‌లాస్‌ రూ. 161. ఐదు వారాలుగా స్థిరీకరణ దశలో ఉంది. తాజాగా ఈ దశ ముగిసినట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు ఊర్ధ్వముఖ గమనానికి సానుకూలంగా ఉన్నాయి. 
2. జేఎస్‌పీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 268. స్టాప్‌లాస్‌ రూ. 221. గత నెల 200 రోజుల డీఎంఏ స్థాయి వద్ద మద్దతు పొందింది. ఇండికేటర్లలో ఎంఏసీడీ కొనొచ్చు సంకేతాలు ఇచ్చింది. You may be interested

కోలుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ..!

Monday 24th September 2018

ముంబై:- గతవారం చివరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం భారీగా నష్టపోయి దివాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు సోమవారం ట్రేడింగ్‌లో రికవరీ బాట పట్టింది. లిక్విడిటీ సంక్షోభం, రుణ చెల్లింపుల్లో విఫలమవ్వడం, నిధుల కొరత ఎదుర్కోంటుందనే వార్తలతో శుక్రవారం ఈ షేరు 42శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంపెనీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌ మాట్లాడుతూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని, కంపెనీ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని

మార్కెట్‌కు ‘డిఫాల్ట్‌’ గండం

Monday 24th September 2018

ఆసియా ప్రాంతంలోనే ఉత్తమమైన పనితీరు కనబరుస్తూ వస్తున్న ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ను కంపెనీల డిఫాల్ట్‌ భయాలు వెంటాడుతున్నాయి. గత నాలుగు సెషన్లలోనూ పడిపోతూ వస్తున్న ఇండెక్స్‌లు ఐదో రోజూ సోమవారం కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం వల్ల శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారిపోయిన విషయం తెలిసిందే. ఇండియన్‌ స్టాక్స్‌

Most from this category