News


నెల రోజుల కోసం పది రికమండేషన్లు

Monday 22nd October 2018
Markets_main1540204560.png-21367

వచ్చే నెల రోజుల్లో దాదాపు 17 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
5నాన్స్‌ డాట్‌కామ్‌ దినేశ్‌రోహిరా సిఫార్సులు-
1. ఐటీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 306. స్టాప్‌లాస్‌ రూ. 275. గత నెల రోజుల్లో దాదాపు 17 శాతం పతనమైంది. దిగువన రూ. 270 స్థాయిల్లో బలమైన మద్దతు పొంది పైకి ఎగిసింది. మార్కెట్లు నెగిటివ్‌గా ఉన్నా కొద్దికాలంగా స్టాకు అప్‌మూవ్‌లోనే ఉంది. తాజాగా 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన క్లోజయింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు మరింత్‌ అప్‌ట్రెండ్‌ను చూపుతున్నాయి.
2. ఎన్‌ఐఐటీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1288. స్టాప్‌లాస్‌ రూ. 1220. నెల రోజుల రేంజ్‌బౌండ్‌ కదలికల అనంతరం అప్‌మూవ్‌ ఆరంభించింది. తాజాగా వంద రోజుల డీఎంఏ స్థాయి రూ.1170కి పైన క్లోజయి బలంగా కనిపిస్తోంది. వాల్యూంలు సైతం మరింత అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి.
3. అవెన్యూ సూపర్‌ మార్ట్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ 1201. స్టాప్‌లాస్‌ రూ. 1268. నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇటీవలే కీలక మద్దతు స్థాయి 200 రోజుల డీఎంఏ దిగువన క్లోజయింది. రెండు రోజుల పుల్‌బ్యాక్‌ చూపినా, ర్యాలీని కొనసాగించలేకపోయింది. రూ. 1175 మద్దతు కోల్పోతే మరింత డౌన్‌ట్రెండ్‌ ఉంటుంది. 
ఏంజల్‌ బ్రోకింగ్‌ సమిత్‌ చవాన్‌ సిఫార్సులు-
1. రేమండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 612. మిడ్‌క్యాప్స్‌లో కరెక‌్షన్‌ కాస్త ఆగినట్టు కనిపిస్తోంది. మిడ్‌క్యాప్స్‌లో రేమండ్స్‌ చార్టుల్లో బలంగా కనిపిస్తోంది. చార్టుల్లో బుల్లిష్‌ హామర్‌ క్యాండిల్‌ను ఏర్పరిచింది.
2. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 116. స్టాప్‌లాస్‌ రూ. 95. మార్కెట్లు పతనమవుతున్నా పీఎస్‌యూ బ్యాంకులు స్థిరంగా ఉంటున్నాయి. డైలీ చార్టుల్లో స్వల్పకాలిక మద్దతు స్థాయికి పైన క్లోజయింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి.
ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు-
1. టాటా కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 720. స్టాప్‌లాస్‌ రూ. 630. ఈ నెలలో ఏడాది కనిష్ఠాన్ని తాకింది. రూ. 620 వద్ద మద్దతు పొంది క్రమంగా పుల్‌బ్యాక్‌ చూపుతోంది. ఇందులో భాగంగా వందరోజుల డీఎంఏ స్థాయికి పైన ముగిసింది. ఇకమీదట 200 రోజుల డీఎంఏ స్థాయి వరకు ర్యాలీ కొనసాగించవచ్చు. 
2. విప్రో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 350. స్టాప్‌లాస్‌ రూ. 300. వీక్లీ చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌లో ఏర్పరుస్తూ బలంగా కనిపిస్తోంది. చార్టుల్లో బుల్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ ఏర్పరిచి ఇటీవలే దాన్నించి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. 
చార్ట్‌వ్యూ ఇండియా మజార్‌ మహ్మద్‌ సిఫార్సులు-
1. కమ్మిన్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 747. స్టాప్‌లాస్‌ రూ. 670. మూడేళ్ల క్రితం రూ. 1247 స్థాయిని అందుకొని అక్కడనుంచి సుదీర్ఘ కరెక‌్షన్‌కు గురైంది. చివరగా మూడేళ్ల ఊర్ధ్వముఖ రేఖ వద్ద మద్దతు తీసుకుంది. చార్టుల్లో కరెక‌్షన్‌ ముగిసిన చిహ్నాలు చూపుతోంది. రూ. 674కు పైన అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చు.
2. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 227. స్టాప్‌లాస్‌ రూ. 195. పలు మార్లు రూ. 200 వద్ద మంచి మద్దతు పొందింది. ఈ దఫా కూడా ఈ స్థాయి వద్ద నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. ఇక్కడ స్థిరీకరణ పొందితే మరోదఫా అప్‌మూవ్‌ ఉంటుంది.
3. సన్‌ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 647. స్టాప్‌లాస్‌ రూ. 589. ఇటీవల కరెక‌్షన్‌లో రూ. 585 వద్ద బాటమ్‌ అవుట్‌ అయిన సంకేతాలున్నాయి. చార్టుల్లో బుల్లిష్‌ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పరిచి ర్యాలీకి రెడీగా ఉంది. You may be interested

ఓ షేరును కొని అట్టే పెట్టుకోవడం సరైనదేనా?

Monday 22nd October 2018

ఓ షేరు కొని, అలాగే ఉంచేసుకోవడం (బై అండ్‌ హోల్డ్‌) అన్నది ఉత్తమ విధానం అని తరచూ వింటుంటాం. కానీ, సంపద సృష్టికి ఇది మెరుగైన విధానం కాదంటున్నారు నిపుణులు. అభిషేక్‌ ఎంతో ఓపిక ఉన్న ఇన్వెస్టర్‌. వారెన్‌ బఫెట్‌ అనుసరించే బై అండ్‌ హోల్డ్‌ విధానాన్ని అనుసరిస్తుంటాడు. డబ్బులు అవసరం పడినప్పుడే షేర్లను విక్రయిస్తాడు తప్పించి వాటి గురించి పట్టించుకోడు. నాణ్యమైన లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను తగిన పరిశోధన

ఆరంభం అదిరింది కానీ.. ముగింపులో నష్టాలే..

Monday 22nd October 2018

సెన్సెక్స్‌ 181 పాయింట్లు డౌన్‌ 34,134 పాయింట్ల వద్ద ముగింపు 58 పాయింట్ల నష్టంతో 10,245కు నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, ఆటో

Most from this category