STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 15th October 2018
Markets_main1539575476.png-21143


సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం మొత్తంగా చూస్తే ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 4.1 శాతం, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 4.2 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.7 శాతం నష్టపోయాయి. అలాగే ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.72 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 3.32 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6.63 శాతం లాభపడ్డాయి. అమెరికాలో శుక్రవారం నాడు అక్కడి దిగ్గజ బ్యాంకులు అదిరిపోయే ఎర్నింగ్స్‌ ప్రకటించడంతో ఫైనాన్షియల్‌ రంగ షేర్లు బాగా పెరిగాయి. అలాటే టెక్నాలజీ, కన్సూమర్‌ డిస్క్రీషనరీ స్టాక్స్‌ కూడా జోరుచూపాయి.  

  • అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల భయాలు, అమెరికా అధిక రుణ వ్యయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 315 పాయింట్ల నష్టంతో 22,379 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 25,582 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,062 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 145 పాయిం‍ట్ల నష్టంతో 9,900 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 12 పాయింట్ల నష్టంతో 2,594 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,154 పాయింట్ల వద్ద ఉన్నాయి.  
  • ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
  • ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ  (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.28 శాతం. ఈ ఏడాది ఆగస్టులో ఈ రేటు  పది నెలల కనిష్ట స్థాయిలో 3.69 శాతంగా నమోదయ్యింది.
  • అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడి 73.57 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి.
  • క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. సౌదీ విలేకరి అదృశ్యం నేపథ్యంలో నెలకొన్న భూగోళ రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపైన ఆందోళనలు పెంచింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 81.41 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 72.15 డాలర్ల వద్ద ఉంది.
  • ఇమామి సిమెంట్‌ రూ.1,000 కోట్ల ఐపీవోకు సెబీకి దరఖాస్తు చేసుకుంది.
  • దేశీ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 5వ తేదీతో ముగిసిన వారంలో 915.8 మిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 399.6 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి.
  • విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుత నెల తొలి రెండు వారాల కాలంలో ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి రూ.26,600 కోట్ల నిధులను వెనక్కు తీసుకెళ్లారు. గత నెల నిధుల ఉపసంహరణ కన్నా ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం. సెప్టెంబర్‌ నెల మొత్తంగా ఇన్వెస్టర్లు రూ.21,000 కోట్ల నిధులను మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్‌-ఆగస్ట్‌ కాలంలో క్విప్‌ విధానంలో నిధుల సమీకరణ 78 శాతం క్షీణతతో రూ.7,000 కోట్లకు తగ్గింది.



You may be interested

గ్యాప్‌అప్‌తో ఆరంభం..

Monday 15th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,733 పాయింట్లతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 34,971 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,472 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,524 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు రెండూ వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:31 సమయంలో సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 15th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 6 పాయింట్ల నష్టతో 10,473 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 13 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

Most from this category