STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 28th November 2018
Markets_main1543376189.png-22424

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది. 

♦ క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. వచ్చే వారంలో ఒపెక్‌ దేశాల సమావేశం జరగనుంది. ఇందులో ఆయిల్‌ సరఫరా తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 52 డాలర్ల వద్ద ఉంది. 

♦ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.

♦ ట్రేడింగ్‌ ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ.. క్లియరింగ్‌ కార్పొరేషన్లకు కోసం ఇంటర్‌-ఆపరబులిటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.  ఇవి వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

♦ రూపాయి నవంబర్‌ 27న 8 పైసలు బలపడి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.79 వద్ద ముగిసింది. 

♦ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందనే సంకేతాల నేపథ్యంలో అమెరికా డాలర్‌ పరుగు పెట్టడం వల్ల బంగారం ధర వారం కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒకానొక సమయంలో ఔన్స్‌ ధర 1,211 డాలర్లకు తగ్గింది. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఫ్లాట్‌గా 3,090 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయింట్ల లాభం 9,810 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 14 పాయింట్ల లాభంతో 2,589 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,102 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 226 పాయింట్ల లాభంతో 26,558 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 196 పాయింట్ల లాభంతో 22,148 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు మంగళవారం చివరకు లాభాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.44 శాతం లేదా 108 పాయిం‍ట్ల లాభంతో 24,748 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.33 శాతం లేదా 9 పాయింట్ల లాభంతో 2,682 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1 పాయింటు లాభంతో 7,082 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య శనివారం జరగనున్న సమావేశంలో వాణిజ్య ఉద్రిక్తతలక ఒక పరిష్కారం లభించవచ్చని అమెరికా ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నష్టాల్లో ట్రేడవుతున్న అమెరికా మార్కెట్ల ప్రధాన సూచీలు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. 



You may be interested

10,700పైన నిఫ్టీ

Wednesday 28th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,685 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 10,708 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,513 పాయింట్లతో పోలిస్తే 122 పాయింట్ల లాభంతో 35,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు బుధవారం పెరగడం, వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి

నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌??

Wednesday 28th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,684 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

Most from this category