STOCKS

News


732 = 237.. ఎలా?

Friday 12th October 2018
Markets_main1539339473.png-21094

732 = 237  .. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా?  ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు రెండూ భారీ లాభాల్లోనే ముగిశాయి. అయితే ఇక్కడే ఆ గమత్తు దాగుంది. సెన్సెక్స్‌ లాభాన్ని తిరగేసి రాస్తే నిఫ్టీ లాభం వస్తుంది. అందేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూడండి..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 732 పాయింట్ల (2.15 శాతం) లాభంతో 34,733 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 237 పాయింట్ల (2.32 శాతం) లాభంతో 10,472 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌ లాభం 732 పాయింట్లు. దీన్ని తిరగేసి రాస్తే 237 అవుతుంది. ఈ 237 అనేది నిఫ్టీ లాభానికి సమానం. అంటే సెన్సెక్స్‌ లాభాన్ని తిరగేసి రాస్తే నిఫ్టీ లాభం వస్తోంది. అందుకే 732 = 237 అని రాశాం. 



You may be interested

భారీ లాభంతో ముగింపు

Friday 12th October 2018

10,450 పాయింట్ల పైకి నిఫ్టీ 732 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ ముంబై:- రూపాయి రికవరీతో పాటు ముడిచమురు ధరలు చల్లారడంతో శుక్రవారం మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. గత రెండు రోజులుగా ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాలు తగ్గడంతో దేశీయ సూచీలు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడష్‌సెషన్‌ సమయానికి సూచీలు క్రితం ట్రేడింగ్‌లో కోల్పోయిన లాభాలను పూడ్చుకోగలిగాయి. అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు

బ్యాంకింగ్‌ షేర్లే బెటర్‌!

Friday 12th October 2018

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకు స్టాకులను నమ్ముకోవడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటకు రావడంతో విత్త రంగ షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చని అందువల్ల వీటి కన్నా బ్యాకింగ్‌ షేర్లను ఆశ్రయించడం బెటరని డైమెన్షన్స్‌ కన్సల్టింగ్‌ ఎండీ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పటికే బ్యాంకు షేర్లున్న వాళ్లు స్వల్ప మొత్తాలతో పుట్స్‌

Most from this category