STOCKS

News


రెండో రోజూ టైటాన్‌ ర్యాలీ

Tuesday 5th February 2019
Markets_main1549363774.png-24029

బ్రాండెడ్‌ బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్‌ కంపెనీ షేర్ల ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. గత ట్రేడింగ్‌లో 3.50శాతం ర్యాలీ చేసిన షేరు మంగళవారం మరో 4శాతం లాభపడింది.  క్యూ3లో కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని మించడం, ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ పెంచడటం తదితర కారణాలతో షేరు క్రితం ట్రేడింగ్‌ 3.50శాతం లాభంతో రూ.1,025.75ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిన్న లాభాల్ని కొనసాగిస్తూ  నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,026.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఇంట్రాడేలో దాదాపు 5శాతం పెరిగి రూ.1074.00ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 4శాతం లాభపడి రూ.1,068.50 వద్ద ముగిసింది. నేటి నిఫ్టీ - 50 సూచీలో టాప్‌ -5 గెయినర్లలో రెండవస్థానాన్ని దక్కించుకుంది.You may be interested

ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కౌంటర్లు...

Tuesday 5th February 2019

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు స్టాక్‌ ధరల్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయనడంతో సందేహం లేదు. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో ఎఫ్‌ఐఐలు సుమారు 387 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో సుమారు 568 కంపెనీల్లో వాటాలు కొంత మేర విక్రయించారు. 384 కంపెనీల్లో వీరి వాటాల్లో ఎటువంటి మార్పుల్లేవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌ నెలలో నికరంగా రూ.17,000 కోట్ల అమ్మకాలు చేయగా, జనవరిలోనూ రూ.5,000 కోట్లకుపైగా

ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌

Tuesday 5th February 2019

ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం తాజాగా 50కిపైగా షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది.  మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవర్జన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా కొన్ని షేర్లు ర్యాలీ చేయడానికి సిద్ధంగా వున్నాయని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. వీటిలో పీఎస్‌యూలైన ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎంఓఐఎల్‌లు, బ్లూచిప్‌ షేర్లయిన హీరో మోటో కార్‌‍్ప, అంబూజా సిమెంట్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు వున్నాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సన్‌నెట్‌వర్క్‌, జస్డ్‌ డయిల్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, కన్సాయి నెరోలాక్‌, బజాజ్‌ ఎలక్రి‍్టకల్స్‌, టాటా

Most from this category