STOCKS

News


జీవితకాల గరిష్టానికి టైటాన్‌

Monday 4th February 2019
Markets_main1549269051.png-24007

బ్రాండెడ్‌ బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్‌ కంపెనీ షేర్‌ ధర సోమవారం జీవితాల గరిష్టాన్ని చేరింది. తృతీయ త్రైమాసికం(క్యూ 3)లో కంపెనీ ఆర్జించిన ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో నమోదు కావడం, షేరుకు ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ పెంచడటం తదితర అంశాలు షేరు ర్యాలీ చేయడానికి దోహదపడ్డాయి. నేడు టైటాన్‌ షేరు బీఎస్‌ఈలో రూ.1024.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో షేరు 6శాతం ర్యాలీ చేసి రూ.991.3ల వద్దకు చేరుకుని కొత్త జీవితకాల గరిష్టాన్ని చేరుకుంది. మధ్యాహ్నం గం.1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.991.3)తో పోలిస్తే షేరు 5శాతం లాభంతో రూ.1037.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 731.70 రూ.1049.00లుగా నమోదయ్యాయి.
టైటాన్‌ క్యూ3 ఫలితాలు:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీలో రూ.416 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది కంపెనీ ఇదే క్యూ3లో ఆర్జించి రూ.308 కోట్లతో పోలిస్తే ఇది 35శాతం అధికం. గతేడాది ఇదే క్యూ3లో రూ. 4,174 కోట్ల అ‍మ్మకాలు జరగ్గా, ఈ క్యూ3లో రూ.5,632 కోట్ల విక్రయాలు జరిగాయి. ఆభరణాల వ్యాపారం కంపెనీ రూ.4890 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే విభాగంలో ఆర్జించిన రూ.3576 కోట్లతో పోలిస్తే ఇది 36.8శాతం అధికం. కళ్లజోడు వ్యాపార విభాగంలో సైతం 40శాతం పెరిగి రూ.129కోట్లను సాధించింది. ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో అధికంగా పండుగలు రావడంతో అమ్మకాలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఆభరణాల విభాగం విక్రయాలు బాగా జరిగాయి. కొత్త ఉత్పత్తులను మంచి స్పందన లభించిందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ భట్‌ తెలిపారు.

ఈ ఫలితాల ఆధారంగానే పలు బ్రోకింగ్‌ సంస్థలు అవుట్‌పెర్ఫార్మర్‌ రేటింగ్‌ ఇవ్వడం కూడా షేరు ర్యాలీకి కలిసివచ్చింది.

బ్రోకింగ్‌ సంస్థల రేటింగ్స్‌
1.షేర్‌ఖాన్‌
అవుట్‌పెర్ఫార్మర్‌ రేటింగ్‌
టార్గెట్‌ ధర రూ.1200

2.మోతీలాల్‌ ఓస్వాల్‌
బై రేటింగ్‌
టార్గెట్‌ ధర రూ.1,180



You may be interested

మెటల్‌ షేర్ల పతనం

Monday 4th February 2019

మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లిన మార్కెట్లో మెటల్‌ ఇంకా నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్‌ షేర్ల ప్రధాన షేర్లైఏన హిందాల్కో ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, టాటా స్టీల్, సెయిల్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం దాదాపు 2శాతం నష్టపోయింది. స్వల్ప లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలకు మెటల్‌ షేర్ల పతనంతో మరింత నష్టాలను కలిగించింది. మధ్యాహ్నం గం.3:00లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం

పెట్టుబడుల్లో బ్యాలెన్స్‌...

Monday 4th February 2019

పెట్టుబడుల్లో బ్యాలన్స్‌... ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్‌డీలు,  పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధిక​రాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్‌బీఐ హైబ్రిడ్‌ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్‌బీఐ మ్యాగ్నం ఫండ్‌ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కానీ,

Most from this category