STOCKS

News


మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియో ఇలా రెడీ చేసుకుంటే...?

Wednesday 6th March 2019
Markets_main1551812291.png-24443

మూడు సంవత్సరాల ర్యాలీ తర్వాత మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ గతేడాది నుంచి దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో ప్రతికూల రాబడులను ఇచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్‌ సంగతి వేరే చెప్పక్కర్లేదు. మొదటి సారి గత నాలుగేళ్ల సగటు చారిత్రక పీఈ రేషియో కంటే తక్కువకు స్టాక్స్‌ లభిస్తున్నాయి. కనుక దీర్ఘకాలానికి పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునే వారికిది అనువైన సమయంగా ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌జోషి పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు అనుకూలంగా లేవన్నారు. రూపాయి అస్థిరత, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరిగిపోవడం, చమురు ధరలను ఆయన ప్రస్తావించారు. కనుక మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ విషయంలో కొంచెం జాగ్రత్తగానూ వ్యవహరించాలంటున్నారు. ‘‘స్పష్టంగా స్టాక్‌వారీగా అనుసరించే విధానం ఉండాలి. ఉదాహరణకు మిడ్‌క్యాప్‌ కంపెనీలు చమురు ధరలు, డాలర్‌ రేట్లకు, ఆర్థిక అంశాలకు లోబడి సున్నితంగా ఉంటాయి. అధిక చమురు ధరలతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువ వాటికి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొన్ని రంగాలకు చమురు ముడి సరుకుగా ఉంది. అయితే, మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియోకు పెట్టుబడులు పెంచుకోవచ్చు. కాకపోతే స్టాక్‌ ఎంపిక అనేది రిస్క్‌ లేని విధంగా ఉండాలి’’ అని జోషి సూచించారు.

 

స్టాక్స్‌ ఎంపిక ముందు...

  • ఈక్విటీతో పోలిస్తే మూడింతల రుణం (డెట్‌) ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలి. అలాగే, ఇంటరెస్ట్‌ కవరేజీ రేషియో ఆ రంగం సగటు కంటే తక్కువగా ఉన్నా రిస్కే. ఈ తరహా మిడ్‌క్యాప్‌ కంపెనీల వ్యాపారం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంటుంది. 
  • డాలర్‌తో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న (దిగుమతులు లేదా డాలర్‌/ఎఫ్‌సీఎన్‌ఆర్‌ రుణాలున్నవి) మిడ్‌క్యాప్‌ కంపెనీలకు కూడా దూరంగా ఉండాలి. అమెరికా వృద్ధితో డాలర్‌ స్థిరంగా బలపడుతుంది. 
  • కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలున్న కంపెనీలకు సైతం దూరంగా ఉండాలి. ఈ తరహా స్టాక్స్‌ గతేడాది కాలంలో బాగా పడిపోయాయి. 
  • ప్రమోటర్లు తమ వాటాల్లో గణనీయమైన భాగాన్ని తనఖా ఉంచిన కంపెనీలకు దూరంగా ఉండాలి. 
  • మీ ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా పరిమితి దాటకుండా మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియో విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 
  • మిడ్‌క్యాప్స్‌ ఈ స్థాయిల్లో మంచి ఆలోచనే. అయితే, కంపెనీ ఆస్తుల నాణ్యత, ఆదాయాలు, గవర్నెన్స్‌ వంటి అంశాలను పెట్టుబడికి ముందు పరిశీలించాలి. ఇక ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేయకుండా క్రమానుగతంగా పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. 
     You may be interested

పాజిటివ్‌ ప్రారంభానికి సంకేతాలు

Wednesday 6th March 2019

క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం సైతం పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22  పాయింట్ల మేర పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  గంటలకు 11,055 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,033 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా సూచీలు  స్వల్పనష్టాలతో ముగిసిన నేపథ్యంలో నష్టపోయాయి.  తాజాగా 

సంపద సృష్టికి బంగారం వంటి సూత్రాలు!

Wednesday 6th March 2019

ప్రతీ ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌ చేసే ముందు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు, వృద్ధికి అనుకూలంగా ఉన్నాయా అన్న అంశాలను తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆచరణలో సాధ్యం కావాలంటే ఎవరికి వారు ఇన్వెస్టర్‌గా ముందు తమ అవసరాలను అర్థం చేసుకోవాలి. సందేహంతో ఉంటే ఇందుకు స్మార్ట్‌ మార్గాన్ని ఎడెల్వీజ్‌ పర్సన్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ సూచిస్తున్నారు.    ప్రత్యేకమైన పెట్టుబడి లక్ష్యాలు ఏం సాధించాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ లక్ష్యమే పెట్టుబడి

Most from this category