STOCKS

News


ఈ సమయంలో ఐదు మిడ్‌క్యాప్స్‌...!

Tuesday 19th March 2019
Markets_main1553018375.png-24696

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన విలువలతో ఎన్నో స్టాక్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ చోటు చేసుకుంటుందన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 91 స్టాక్స్‌ను బ్లూంబర్గ్‌ అనలిస్టులు ట్రాక్‌ చేయగా, ఇందులో ఎక్కువ రికమండేషన్లు ఉన్న ఐదు స్టాక్స్‌ వివరాలు ఇవి. 

 

సన్‌టీవీ నెట్‌వర్క్‌
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ... సన్‌ టీవీకి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో 32 టీవీ చానళ్లు, 45 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయి. ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం... తమిళ మార్కెట్లో కొత్త కంటెంట్‌, అధిక ప్రకటనల ఆదాయం, బంగ్లా మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల కంపెనీ ఆదాయం రానున్న త్రైమాసికాల్లో మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ చాలా ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడవుతోందని పేర్కొంది. రానున్న మూడు సంవత్సరాల్లో నికర లాభాల్లో కాంపౌండెడ్‌గా 26 శాతం వృద్ధి ఉంటుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.

 

ఫెడరల్‌ బ్యాంకు
కేరళ కేంద్రంగా పనిచేసే ఫెడరల్‌ బ్యాంకుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 1,251 బ్రాంచ్‌లు, 1,668 ఏటీఎంలు ఉన్నాయి. అయితే, కేరళలో వచ్చిన భారీ వరదల కారణంగా 2018-19లో ఈ బ్యాంకు సంక్షోభాన్ని చవిచూసింది. బ్యాంకు విస్తరణ ప్రణాళికలను గమనిస్తే మంచి వృద్ధి అవకాశాలున్నాయి. స్టివార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ సంస్థ ఫెడరల్‌ బ్యాంకు పట్ల బుల్లిష్‌గా ఉంది. 

 

ఎల్‌అంట్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ అయిన ఎల్‌అండ్‌ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌... గ్రామీణ, హౌసింగ్‌, హోల్‌సేల్‌ రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జేఎం ఫైనాన్షియల్‌ నివేదిక ప్రకారం... వివేకంతో కూడిన క్యాపిటల్‌ అలోకేషన్‌, రిటైల్‌ వ్యాపారం అధిక వాటాగా ఉండడం, డైవర్సిఫికేషన్‌ వల్ల మంచి ఆర్‌వోఈని ఈ కంపెనీ నమోదు చేయనుంది. ఎర్నింగ్స్‌ వార్షికంగా 40 శాతం చొప్పున 2017-18 నుంచి 2020-21 వరకు పెరుగుతాయని అంచనా వేసింది.

 

ఎన్‌బీసీసీ ఇండియా 
ప్రభుత్వరంగంలో నవరత్న హోదా కలిగిన కంపెనీ ఇది. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌, ఈపీసీ కాంట్రాక్టింగ్‌ సేవల్లో ఉంది. ఢిల్లీలో రెండు భారీ పునర్నిర్మాణ ప్రాజెక్టులతో 2019-20లో కార్యకలాపాలను గణనీయంగా పెంచుకోనుందని, ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరించినందున, ఇది బ్యాలన్స్‌ షీట్‌పై ఒత్తిడికి దారితీస్తుందని తెలిపింది. 

 

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌
లైటింగ్‌ ఉత్పత్తులు, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తుంది. కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. వ్యయ నియంత్రణ చర్యలతో మార్జిన్లు రికవరీ అవుతాయని, రానున్న మూడేళ్ల పాటు షేరువారీగా ఎర్నింగ్స్‌ 22 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది.You may be interested

రిస్క్‌ను తగ్గించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 19th March 2019

పన్ను ఆదా పథకాలకు ఏటా మార్చి నెలలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు కోసం ఈ నెలలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అలా చూసినప్పుడు పన్ను ఆదాతో పాటు మెరుగైన రాబడులకు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అనువైనవి. భిన్న మార్కెట్‌ పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ పథకాలకు సహజంగానే ఉంటుంది.

11500 పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 19th March 2019

ముంబై:- మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడం సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 11,532 వద్ద, సెన్సెక్స్‌ 268 పాయింట్లు పెరిగి 38,363 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేశాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 29,768 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలు,

Most from this category