News


ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌.. ఇన్వెస్ట్‌ చేయొచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 30th October 2018
Markets_main1540896378.png-21590

ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో పలు విలువైన షేర్లు చౌకగా లభిస్తున్నాయని, నాణ్యమైన షేర్లను ఎంపికచేసుకుని, పెట్టుబడి చేసేందుకు ఇది తరుణమని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అభిమన్యు అంటున్నారు. ఆయన ఒక ఆంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూ అంశాలు....

మనీ మార్కెట్‌ కారణం...
ఇటీవలి భారీ పతనానికి మనీ మార్కెట్లో ఏర్పడ్డ సంక్షోభమే ప్రధాన కారణమని,ఇప్పుడా మార్కెట్లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడినందున స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం ప్రసరించిందన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాలు కూడా సెంటిమెంట్‌ను మెరుగుపర్చాయని అభిమన్యు చెప్పారు. 

కొనుగోళ్లకు ఇది మంచి సమయం

పలు విలువైన షేరు ధరలు దిగివచ్చిందున, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది తగిన తరుణమని ఆయన అన్నారు. ఉదాహరణకు ఎస్‌బీఐ షేరు తాజా పెరుగుదల తర్వాత కూడా పెట్టుబడి చేయదగిన షేరు అని అంచనా పుస్తక విలువకు 1.1 రెట్లు ధరకే ఈ షేరు ప్రస్తుతం లభిస్తున్నదన్నారు. ఎస్సార్‌ స్టీల్‌ ఎన్‌పీఏ సమస్య కొలిక్కిరానున్నందున, ఈ అంశం ఎస్‌బీఐకి పాజిటివ్‌ కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఏల రికవరీ జోరుగా జరుగుతున్నందున, కొన్ని బ్యాంకుల టర్న్‌ ఎరౌండ్‌కు అవకాశం వుంటుందని, అలాగే కాసా ఖాతాలు అధికంగా కలిగిన ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా కొనదగ్గవేనన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు ప్రస్తుత క్షీణతలో దీర్ఘకాలానికి కొనదగ్గ షేరుగా ఆయన విశ్లేషించారు. 

పెట్రో మార్కెటింగ్‌ షేర్లపై....
పెట్రోల్, డీజిల్‌ ధరలపై కొంత సబ్సిడీని పెట్రో కంపెనీలు భరించాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా గత నెలరోజులుగా ఈ కంపెనీలపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నామని అభిమన్యు తెలిపారు. అయితే ఈ షేర్లు గత 20 ఏళ్లలో ఎన్నడూలేనిరీతిలో పుస్తక విలువకు లోపునే లభిస్తున్నాయని, ఈ కారణంగా 40 శాతం వరకూ రాబడినిచ్చే ఛాన్స్‌ వుందన్నారు. బీపీఎస్‌ఎల్‌ షేరును ప్రస్తుత రూ. 280 స్థాయిలో కాకుండా రూ. 255 స్థాయి వద్ద కొనే ఉద్దేశ్యం వుందన్నారు. 

 You may be interested

నిఫ్టీలో సగానికి పైగా భారీగా నష్టపోయినవే

Wednesday 31st October 2018

గత రెండు నెలల కాలంలో మన మార్కెట్లు కరెక్షన్‌ బాటలో ప్రయాణిస్తుండగా, ఈ కాలంలో ప్రధాన సూచీలు నిఫ్టీ-50, బీఎస్‌ఈలో సగానికి పైగా స్టాక్స్‌... 20 నుంచి 60 శాతం వరకు నష్టపోయాయి. నాణ్యమైన స్టాక్స్‌ సైతం ఆకర్షణీయ విలువల వద్ద లభిస్తున్నాయి. అంటే బేర్స్‌ వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘ఇవి దిపావళి అమ్మకాలు. ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్‌ను తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకును ఈ

10,200 దిగువకు నిఫ్టీ

Tuesday 30th October 2018

34000ల దిగువకు సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్‌ ట్రేడింగ్‌ను మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అమ్మకాలు ముంచేశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితయ్యాయి. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ షేర్ల పతనంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 176 పాయింట్ల కోల్పోయి 33, 891వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల నష్టపోయి 10,198 వద్ద ముగిశాయి. అమెరికా-చైనా దేశాల

Most from this category