STOCKS

News


బ్లూచిప్‌ కంపెనీల్లో ఆకర్షణీయ బెట్స్‌!

Sunday 24th February 2019
Markets_main1551032114.png-24301

సాధారణ ఎన్నికలు ముగిసే వరకు మార్కెట్లు అస్థితంగానే ఉంటాయని, ఈ లోపు అంతర్జాతీయ అంశాలు మార్కెట్లను ప్రధానంగా నిర్దేశిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ బ్రోకింగ్‌ హెడ్‌ రాజీవ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇన్వెస్టర్లు ‍స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలను బుక్‌ చేసుకుని నాణ్యమైన లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘2018 డిసెంబర్‌ త్రైమాసికం కార్పొరేట్‌ కంపెనీలు ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో తలెత్తిన కార్పొరేట్‌ పాలన సమస్యలు కరెక్షకు దారితీశాయి. దీంతో ఆకర్షణీయమైన విలువల వద్ద భారత మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నాయి. మార్కెట్లో ఆటుపోట్లు పెరిగాయి. ఈక్విటీ పెట్టుబడులు ఒక ఆటగా మారాయి. విశ్వాసం సన్నగిల్లడంతో మెజారిటీ కేసుల్లో పోర్ట్‌ఫోలియో విలువ సగానికి తగ్గిపోయింది. అయితే, దీర్ఘకాలంలో ఈక్విటీలు అద్భుతమైన రాబడులు ఇచ్చిన విషయాన్ని మరవరాదు’’ అని రాజీవ్‌ శ్రీవాస్తవ అన్నారు. 

 

మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది మంచి తరుణమన్నారు. మంచి కంపెనీల్లో చాలా వరకు వాటి గరిష్ట స్థాయిల నుంచి సహేతుక ధరలకు దిగొచ్చాయని, ఈ సమయంలో నాణ్యమైన వాటిల్లో, వైవిధ్యమైన పెట్టుబడులు మంచి ఆలోచనగా శ్రీవాస్తవ సూచించారు. స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్లకు గతేడాది ఓ సవాలుగా నిలిచిన విషయాన్ని మరవరాదని, కరెక్షన్‌ సమయాల్లో పోర్ట్‌ఫోలియో విలువకు ఎక్కువగా నష్టం జరుగుతుందన్నారు. ‘‘నాణ్యత లేని లేదా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలు ఉన్న స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను విక్రయించాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. నష్టపోయిన విలువను రికవరీ చేసుకునేందుకు నాణ్యమైన లార్జ్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. ఫ్రంట్‌లైన్‌ కాని షేర్లు లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని... ఆటుపోట్ల సమయాల్లో వీటిల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కనుక ఇన్వెస్టర్లు ప్రముఖ కంపెనీలపై దృష్టి సారించడం ద్వారా ఆటుపోట్లను అధిగమించొచ్చని సూచించారు. ఫిబ్రవరి నెలవరకు నిఫ్టీ ఒకే శ్రేణికి పరిమితమవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎగువ వైపు 10,900ను లక్ష్యంగా పేర్కొన్నారు. 10,550, 10,580 తక్షణ మద్దతు స్థాయిలుగా పేర్కొన్నారు. వీటికి దిగువన ముగిస్తే... నిఫ్టీ50 మరింత పతనం కావొచ్చని, 10,000-10,300 వరకు వెళుతుందన్నారు. అటువంటి పతనాల్లో మంచి కొర్పొరేట్‌ గవర్నెన్స్‌ ఉన్న కంపెనీలను వ్యాల్యూ బెట్‌గా పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ స్టాక్స్‌లో పతనం పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులను సైతం సూచించారు.



You may be interested

స్టాక్స్‌ ఎంపిక ముందు చూడాల్సిన అంశాలు 

Sunday 24th February 2019

దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రితేష్‌ అషర్‌ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.   నిఫ్టీకి బోటమ్‌ పూర్తయిందా... లేక కరెక్షన్‌ ఇంకా ఉందా..? భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఇటీవలి మార్కెట్‌ బలహీనతకు కారణం. ఈ అనిశ్చితి కొన్ని నెలల పాటు కొనసాగొచ్చు. ఎన్నికల అంశం మరిన్ని ఆటుపోట్లకు కారణమవుతుంది. మార్కెట్లు ఈ

ఈ నాలుగు షేర్లలో రిస్క్‌ పరిమితం

Saturday 23rd February 2019

లోక్‌సభ ఎన్నికల కారణంగా వచ్చే రెండు, మూడు నెలల్లో మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనవుతుందని, ఈ సమయంలో నాలుగు షేర్లలో మాత్రం రిస్క్‌ పరిమితంగా వుంటుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీస్‌ హెడ్‌ రాజేష్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. అవి...హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్, టైటాన్‌ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు. ఈ నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్‌ చేయమని తమ క్టయింట్లకు సిఫార్సుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒడుదుడుకుల మార్కెట్లో కాస్త అధిక రిస్క్‌ తీసుకోదల్చినవారు

Most from this category