STOCKS

News


తగ్గినపుడు కొనండి..

Tuesday 7th August 2018
Markets_main1533631221.png-19014

  • నాణ్యమైన స్టాక్స్‌పై దేవెన్‌ చోక్సీ సిఫార్సు

రానున్న రోజుల్లో కంపెనీల ఎర్నింగ్స్‌లో బలమైన రెండంకెల వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవెన్‌ చోక్సీ. ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ వ్యాపారాల్లో మంచి పెరుగుదల నమోదవుతూ వస్తోందన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా మంచి వృద్ధి నమోదు చేస్తున్నాయని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నుంచి సాహేతుకంగా 10 శాతం రాబడులను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
కొన్ని విభాగాల్లోని కంపెనీలు మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయని తెలిపారు. తమ పోర్ట్‌ఫోలియోలో కన్సూమర్‌ ఫైనాన్స్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ఎర్నింగ్స్‌ బాగున్నాయని తెలిపారు.
ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో మంచి వృద్ధి నమోదు అవుతోందని పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ బిజినెస్‌ మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. ఈ వ్యాపారంలో ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంబంధిత ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వాహన విడిభాగాల విభాగం కూడా సాధారణంగా సానుకూల పనితీరు చూపుతుందని తెలిపారు. రిటైల్‌ క్రెడిట్‌ బ్యాంకులు ప్రత్యేకించి కార్పొరేట్‌ బ్యాంకులు సాహేతుకంగా మంచి పనితీరు కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. వాహన పరిశ్రమలోని కంపెనీలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. విక్రయాలు పెరగడం, ప్రత్యేకించి వాణిజ్య వాహన విక్రయాల డిమాండ్‌ దీనికి ప్రధాన కారణమని తెలిపారు. మొత్తంగా చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని కనబరుస్తోందని పేర్కొన్నారు. జీఎస్‌టీ, సానుకూల రుతుపవనాలు సహా వివిధ అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఎర్నింగ్స్ కోణంలో తాము చాలా విశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఎర్నింగ్స్‌లో బలమైన రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేశారు. కరెక‌్షన్ సమయంలో నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని సూచించారు. 
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ విషయంలో సాహేతుకంగా 10 శాతం రిటర్న్‌ ఆశించొచ్చని తెలిపారు. వచ్చే రెండేళ్ల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు ధర రూ.2,050- రూ.2,100 శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేశారు. You may be interested

సిమెంట్‌ షేర్ల ర్యాలీ

Tuesday 7th August 2018

ముంబై:- సిమెంట్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా కొనసాగుతున్న సిమెంట్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో పలు సిమెంట్‌ కంపెనీల లాభాలు పుంజుకోవడంతో పాటు రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచానాలతో ఇంట్రాడే లో పలు సిమెంట్‌ షేర్ల ర్యాలీ జోరుగా సాగుతోంది. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- నేడు బీఎస్‌ఈలో  రూ. 4177.05ల వద్ద

మహీంద్రా లాభం 67 శాతం జంప్‌

Tuesday 7th August 2018

యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. కంపెనీ నికర లాభం 67 శాతం వృద్ధితో రూ.1,257 కోట్లకు పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను మించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.752 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 23 శాతం వృద్ధితో

Most from this category