STOCKS

News


బంగారం కన్నా ఈక్విటీ ముద్దు..

Monday 5th November 2018
Markets_main1541406213.png-21720

దీపావళి వచ్చేసింది. మరీముఖ్యంగా ధంతేరాస్‌ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే పసడి కన్నా ఈక్విటీల్లో ఇన్వె‍స్ట్‌ చేయడం మంచిదని సూచిస్తున్నారు ఫండ్‌ మేనేజర్లు. 
కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ షా మాట్లాడుతూ.. బంగారం కొనుగోలును ప్రోత్సహించనని, భారత్‌లో ప్రజలు అవసరమైన దాని కన్నా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. గత దీపావళికి ఈక్విటీలు ఎలాంటి రిటర్న్స్‌ అందించలేదని, అవి ఇప్పుడు చౌక ధరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్విటీలు లాభాలు అందించొచ్చని అంచనా వేశారు. అందువల్ల బంగారం కన్నా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని సూచించారు. ‘ప్రస్తుతం వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, అధిక క్రూడ్‌ ధరలు వంటి ప్రతికూలతలు ఉన్నాయి. వ్యాల్యుయేషన్స్‌ చౌకగా మారాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేయను. ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తాను’ అని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నవ్‌నీత్‌ మునత్‌ తెలిపారు. ‘2009 లేదా 2013 బాటమ్‌ స్థాయిల్లో కానీ, 2008 లేదా 2010 టాప్‌ స్థాయిల్లో కానీ మనం లేము. మధ్యలో ఎక్కడో ఉన్నాం. అందువల్ల వ్యాల్యుకు అవకాశముంది’ అని రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌) మనీష్‌ గున్వానీ పేర్కొన్నారు. 



You may be interested

డబ్బు ఒక్కటే కాదు.. ధైర్యం కావాలి..!

Monday 5th November 2018

ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్య న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో సంపాదించాలి అంటే.. కేవలం పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదని, అందుకు సరిపడా గుండె ధైర్యం కూడా అవసరమని ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్యానించారు. దీపావళి పండుగ సందర్భంగా ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. మార్కెట్‌ పని చేసే విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ సంపాదించడానికి అవకాశం

అక్టోబర్‌లో సేవల రంగం జోరు

Monday 5th November 2018

52.2కి పెరిగిన ఇండెక్స్‌.. భారత్‌లో సేవల రంగం అక్టోబర్‌ నెలలో వేగంగా వృద్ధి చెందింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 52.2కి ఎగసింది. కొత్త ఆర్డర్లు పెరగడం, దీంతో ఉద్యోగ సిబ్బంది విస్తరణ వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి. ఇండెక్స్‌ ఈ స్థాయిలో వేగంగా పెరగడం గత మూడు నెలల్లో (జూలై నుంచి చూస్తే) ఇదే ప్రథమం. కాగా సెప్టెంబర్‌లో ఇండెక్స్‌ నాలుగు నెలల కనిష్ట స్థాయి

Most from this category