STOCKS

News


పడ్డవన్నీ మంచివి కావు!

Sunday 18th November 2018
Markets_main1542564058.png-22154

‘పడ్డోళ్లు ఎప్పుడూ చెడ్డోళ్లు కారు’ అన్నది జీవితానికి సరిపోతుందేమో కానీ... స్టాక్స్‌కు మాత్రం అతకదు. ఎందుకంటే పడిపోయిన స్టాక్స్‌ అన్నీ మంచివనీ చెప్పలేం. అలాగనీ చెడ్డవని అనడానికి కూడా లేదు. గత రెండేళ్ల కాలంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీ ర్యాలీ చేశాయి. కానీ, ఈ ఏడాది మాత్రం తీవ్ర నష్టాల బాటలోకి వెళ్లాయి. అధిక వ్యాల్యూషన్ల కారణంగా వాటిల్లో దిద్దుబాటు జరిగింది. ఇక చమురు ధరలు, రూపాయి పతనం ఇతరత్రా కారణాలు ఈ నష్టాలను మరింత పెంచాయి. 

 

బీఎస్‌ఈ 500 సూచీలో 15 స్టాక్స్‌ 40-77 శాతం మధ్య నష్టపోయాయి. వీటిల్లో ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ (77 శాతం నష్టం), 8కే మైల్స్‌(65 శాతం), క్వాలిటీ(65శాతం), దివాన్‌ హౌసింగ్‌(64శాతం), సెంట్రల్‌ బ్యాంకు(55శాతం), బోంబే డైయింగ్‌(52శాతం), నవ్‌కార్‌ కార్పొరేషన్‌(48శాతం), డిష్‌టీవీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, సీజీ పవర్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, యస్‌ బ్యాంకు ఉన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ విభాగంలో 32 స్టాక్స్‌ 40-80 శాతం మధ్యలో ఆగస్ట్‌ నుంచి నష్టపోయాయి. వీటిల్లో ఆశాపుర ఇంటిమేట్స్‌, రోల్టా ఇండియా, యాడ్‌ల్యాబ్స్‌, ఎలక్ట్రస్టీల్‌, స్టీల్స్‌, ఇండోసోలార్‌, గీతాంజలి జెమ్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, రుచి సోయా, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌, శాటిన్‌ క్రెడిట్‌కేర్‌, జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ ఇలా పలు కంపెనీలు ఉన్నాయి. 

 

కొనుగోలు చేసుకోవచ్చా..?
బాగా పడ్డాయని, పడిపోతున్నాయని ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేసుకునేందుకు మంచి తరుణం అనుకోవచ్చా అంటే...? అందుకు అవునని చెప్పే పరిస్థితి లేదు. స్టాక్స్‌ విలువలు సరసమైన స్థాయిలకు ఇటీవల దిగొచ్చాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే అందుకు కంపెనీ వారీగానే చూసి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘2019లో సెన్సెక్స్‌ 45,000కు వెళుతుందని అంచనా. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ రిస్క్‌-రాబడుల పరంగా చూడ్డానికి మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలోనూ కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు నాణ్యతకే కట్టుబడి ఉండాలి’’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వివేక్‌ రంజన్‌మిశ్రా తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సమీప కాలంలో మరింత ఒడిదుడుకులు ఉండే అవకాశం నేపథ్యంలో ఒకేసారి కాకుండా... క్రమంగా కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచించారు. ఒకవేళ వచ్చే 2-3 ఏళ్ల కాలం కోసం అయితే మంచి స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు ఇది సరైన సమయమేనంటున్నారు.You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 19th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

జీవన్‌శాంతి, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఏది మెరుగు?

Sunday 18th November 2018

రిటైర్మెంట్‌కు ఏ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయన్నది మన దేశంలో ఎక్కువ మందికి ఉండే సందేహం. ప్రైవేటు రంగంలోని వారికి ఎన్‌పీఎస్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమా పెన్షన్‌ పథకాలు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో ఓ ఇన్వెస్టర్‌ ప్రశ్నకు ఫిన్‌ఫిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలటిక్స్‌ వ్యవస్థాపకుడు ప్రబ్లీన్‌ బాజ్‌పాయి సమాధానం ఇచ్చారు.    వయసు 31 ఏళ్లు. రూ.15 లక్షలను 55వ ఏట వచ్చే వరకు ఇన్వెస్ట్‌ చేస్తాను.

Most from this category