STOCKS

News


మిడ్‌క్యాప్స్‌కు టైమొచ్చింది!!

Monday 3rd September 2018
Markets_main1535959847.png-19914

దేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈక్విటీల్లో వీరి వాటా మరింత పెరగడానికి అవకాశాలున్నాయి. హాంగ్‌కాంగ్‌లోని ఆసియా ఫోకస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సోలిట్యూడ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జోయెల్‌ వార్నర్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఇండియన్‌ మార్కెట్‌లో ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పటీకి ఈయన ఇక్కడి మార్కెట్లలో మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి ఉత్సాహం చూతున్నారు. మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో కొద్ది నెలలుగా అమ్మకాలు బాగా జరిగాయని పేర్కొన్నారు. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. 
సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు ఇటీవల కాలంలో బాగా ర్యాలీ చేశాయని జోయెల్‌ వార్నర్‌ తెలిపారు. అమెరికా డాలర్‌ పరంగా చూస్తే.. ఇవి ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి రూపాయి బలహీనత కారణమని తెలిపారు. అయితే ఆసియా మార్కెట్లలో ఈ ఇండెక్స్‌లే బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గడం భారత్‌కు కలిసొచ్చే అంశమని తెలిపారు. అలాగే అమెరికా.. భారత్‌తో గొడవపడటం లేదన్నారు. అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో ఇండియన్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. అయితే ఇప్పటికీ ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే భారతీయుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అందువల్ల భారత్‌లో ఈక్విటీ మార్కెట్‌కు వృద్ధికి అపార వృద్ధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా భారత్‌లో బ్యాంక్‌ డిపాజిట్లు, బంగారం, ప్రాపర్టీ మార్కెట్లలో సేవింగ్స్‌ చేస్తుంటారని తెలిపారు. అయితే డీమోనిటైజేషన్‌ వల్ల మార్పు వచ్చిందన్నారు. 
ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని జోయెల్‌ వార్నర్‌ తెలిపారు. తమ నెట్‌ అసెట్‌ వ్యాల్యూలో 40 శాతం ఇక్కడే ఇన్వెస్ట్‌ చేశామని పేర్కొన్నారు. ఆసియాలో తాము తొలిగా ఇండియా, చైనా మార్కెట్లకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఇవి రెండూ అతిపెద్ద కన్సూమర్‌ మార్కట్లని పేర్కొన్నారు. తము మూలధనంలో 40 శాతాన్ని ఇండియాలో, 40 శాతాన్ని చైనాలో, కొంత భాగాన్ని ఆగ్నేయాసియా ప్రాంతంలో ఇన్వెస్ట్‌ చేశామని తెలిపారు. 
భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుకోడానికి మొగ్గు చుపుతున్నామని జోయెల్‌ వార్నర్‌ పేర్కొన్నారు. ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయని, అయితే ఇండెక్స్‌లలోని స్టాక్స్‌లో తమకు ఇన్వెస్ట్‌మెంట్లు లేవని గుర్తుచేశారు. 500 మిలియన్‌ డాలర్ల నుంచి 5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడతామని తెలిపారు. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇండెక్స్‌లు బ్యాంకులు, ప్రాపర్టీ కంపెనీలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ కంపెనీల వెయిటేజీ ఎక్కువగా ఉందన్నారు. అయితే తాము ఈ విభాగాలకు జోలికి వెళ్లలేదని తెలిపారు. కన్సూమర్‌ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులను ప్రస్తుత రిస్క్‌ అంశంగా పేర్కొన్నారు. వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, రానున్న కాలంలో గ్లోబల్‌ జీడీపీ నెమ్మదించొచ్చని అంచనా వేశారు.  You may be interested

52వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌

Monday 3rd September 2018

దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు సోమవారం బీఎస్‌ఈలో 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు బీఎస్‌ఈలో రూ.2510.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా ఈ షేరు 5శాతం లాభపడి రూ.2620.00ల వద్ద 52-వారాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.2491.35)తో పోలిస్తే 5.14శాతం లాభపడి రూ.2614.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు

అటో షేర్లకు అమ్మకాల బూస్ట్‌..!

Monday 3rd September 2018

ముంబై:- ఆగస్ట్‌ నెలలో ఆశించిన స్థాయి వాహనాల అమ్మకాలు జరగడంతో సంబంధిత వాహన కంపెనీ షేర్లు సోమవారం ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1శాతం వరకూ పెరిగింది. ఈ ఇండెక్స్‌లోని భాగమైన మొత్తం 12షేర్లకు గానూ 8 షేర్లు లాభాల్లో ట్రేడ్‌అవుతుండగా, 4షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా అశోక్‌ లేలాండ్‌ 4శాతం ర్యాలీచేయగా, ఐషర్‌ మోటర్‌ 3.50శాతం

Most from this category