STOCKS

News


ఈ నెలాఖరు వరకు ఇంతే!

Friday 15th February 2019
Markets_main1550209963.png-24207

మార్కెట్‌పై ఎస్‌బీఐ క్యాప్‌ అంచనా
కొద్దికాలంగా స్వల్పరేంజ్‌లో కదలాడుతున్న సూచీలు ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగవచ్చని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేష్‌ సబారడ్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు పెద్దగా కదలికలు చూపకున్నా, ఈ నెల్లో ఎఫ్‌ఐఐల ప్రవాహం మాత్రం బలంగా ఉందన్నారు. కానీ సూచీలు మాత్రం ఎంత పాజిటివ్‌ వార్తలు వినిపిస్తున్నా ఏమాత్రం చలించడంలేదని, ఇదే ధోరణి ఇంకో రెండు వారాలపాటు కొనసాగవచ్చని చెప్పారు. వచ్చే నెలారంభంలో రెండు అంశాలు మార్కెట్‌ కదలికలను ప్రభావితం చేస్తాయన్నారు. యూఎస్‌, చైనా వాణిజ్య చర్చలు, ఎన్నికల వాతావరణమనే రెండు అంశాలు ఇకపై కీలకమవుతాయని అంచనా వేశారు. 
బ్యాంకులపై..
గతంలో ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు అంటూ వేర్వేరుగా అధ్యయనం చేయడం జరిగేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులన్నీ ఒకే విధంగా మారుతున్నాయని మహంతేష్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండిపద్దుల భారం తగ్గుతోందని, క్రెడిట్‌ గ్రోత్‌ పుంజుకుంటోందని వివరించారు. ఎన్‌పీఏ డౌన్‌ట్రెండ్‌ సైకిల్‌ చివరి దశ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. మరోవైపు అల్పవడ్డీరేట్ల కాలం నడుస్తోందని, ఇవన్నీ బ్యాంకింగ్‌ రంగానికి మంచి రోజులను సూచిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌, ప్రభుత్వం తేడా లేకుండా బ్యాంకులన్నీ మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయని తెలిపారు. అందువల్ల బ్యాంకుల్లో నాణ్యమైన వాటిని ఎంచుకొని పోర్టుఫోలియోలో ఉంచుకోవాలని సూచించారు. ఎన్‌పీఏ  రికవరీ సందర్భంగా మెటల్‌, ఇన్‌ఫ్రా రంగాల్లోని మంచి లార్జ్‌క్యాప్స్‌ను సైతం పరిశీలించవచ్చని చెప్పారు. 



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు బ్రోకరేజ్‌ జెఫ్పారీస్ షాక్‌

Friday 15th February 2019

డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు జెఫ్పారీస్ బ్రోకరేజ్‌ సం‍స్థ షాక్‌నిచ్చింది. హైదరాబాద్‌లో బూచుపల్లి యూనిట్‌ అబ్జర్వేషన్‌ అంశంపై రేటింగ్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30 శాతం కుప్పకూలాయి. బూచుపల్లి యూనిట్‌లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు నిర్వహించి 11 లోపాలున్నట్లు ఫామ్‌ - 483ను జారీ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫిబ్రవరి 8వ తేదీన సమాచారం ఇచ్చింది.

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 15th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జెట్ ఎయిర్‌వేస్‌:- ఆర్థిక క‌ష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కేందుకు ప్రోవిజ‌న‌ల్ రెల్యూష‌న్ ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రణాళిక‌లో భాగంగా కంపెనీ రుణాలను ఈక్విటీ షేర్ల కింద మార్చనుంది.   మిండా ఇండ‌స్ట్రీస్‌:- హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ విలీనాన్ని ఆమోదం తెలిపింది. 100 షేర్లు కలిగిన హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ షేర్‌హోల్డర్లకు విలీన ప్రక్రియతో 152 మిండా షేర్లు లభించనున్నాయి.

Most from this category