STOCKS

News


నెలరోజుల కోసం మూడు ట్రేడింగ్‌ సిఫార్సులు

Tuesday 29th January 2019
Markets_main1548758410.png-23878

బడ్జెట్‌ వెలువడేవరకూ ఒక పరిమితశ్రేణిలోనే కదలవచ్చని 10,500–10,600 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి మద్దతుగా నిలవవచ్చని రిలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ అంచనావేస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పటిష్టంగా ట్రేడ్‌కావొచ్చని, బ్యాంకింగ్, ఆటో, మెటల్‌ షేర్లు బలహీనంగా వుండవచ్చన్నది ఆయన అంచనా. నెలరోజుల్లో 6 శాతం వరకూ రాబడినిచ్చే మూడు షేర్లను ఆయన సిఫార్సుచేస్తున్నారు. అవి....

టీసీఎస్‌

సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 2070, స్టాప్‌లాస్‌ రూ. 1890

ఇటీవల ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ షేర్లు మార్కెట్‌ క్షీణతను ఎదురొడ్డి, పటిష్టంగా ట్రేడవుతున్నాయి. వీటిలో టీసీఎస్‌ డెయిలీ చార్టుల్లో 200 ఈఎంఏ వద్ద మద్దతుపొంది, వేగంగా రికవరీ అయ్యింది. వారంరోజులపాటు రూ. 1,900 సమీపంలో కదలిన టీసీఎస్‌...జనవరి 28న వేగవంతమైన ర్యాలీ జరిపింది. సమీప భవిష్యత్తులో మరింత పెరిగే సంకేతాల్ని చార్టులు ఇస్తున్నాయి. ట్రేడర్లు రూ. 1930–1950 మధ్య కొనుగోలుచేసి రూ. 1,890 స్టాప్‌లాస్‌తో అట్టిపెట్టవచ్చు.

హెచ్‌పీసీఎల్‌

సిఫార్సు: సెల్, టార్గెట్‌: రూ. 222, స్టాప్‌లాస్‌ రూ. 243

పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు మిశ్రమ సంకేతాల్ని అందిస్తున్నాయి. వీటిలో హెచ్‌పీసీఎల్‌ తాజా క్షీణతకు శ్రీకారం చుట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీక్లీ చార్టుల్లో 100 ఈఎంఏ వద్దనున్న నిరోధాన్ని అధిగమించేందుకు విఫలమవుతున్న ఈ షేరు తాజాగా షార్టింగ్‌ పివోట్‌ను ఏర్పర్చింది. రూ. 236–239 మధ్య షార్ట్‌చేసి రూ. 222 టార్గెట్‌ కోసం ట్రేడర్లు వేచిచూడవచ్చు. ఇందుకు స్టాప్‌లాస్‌ రూ. 243.

టాటా కెమికల్స్‌

సిఫార్సు: సెల్, టార్గెట్‌: రూ. 625, స్టాప్‌లాస్‌ రూ. 685

టాటా కెమికల్స్‌ గత ఏడాదికాలంగా రూ. 660–790 విస్త్రతశ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతున్నది. ఇప్పుడా శ్రేణి నుంచి బ్రేక్‌డవున్‌ అయ్యే సంకేతాల్ని వెల్లడిస్తున్నది. ట్రేడర్లు ఈ అవకాశాన్ని వదులుకోకుండా రూ. 625 టార్గెట్‌ కోసం రూ. 660–673 మధ్య ఈ షేరును షార్ట్‌ చేయవచ్చు. ఈ షార్ట్‌ పొజిషన్‌ను రూ. 685 స్టాప్‌లాస్‌తో హోల్డ్‌ చేయాల్సివుంటుంది. 
 



You may be interested

పన్ను మినహాయింపు రూ.5 లక్షలు చేస్తే జోషే!

Wednesday 30th January 2019

మధ్యంతర బడ్జెట్‌ ప్రజాకర్షణీయంగా ఉంటుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను ఆకర్షించాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో రానున్న ఐదేళ్లకు సంబంధించిన విజన్‌పై దృష్టి సారించేలా బడ్జెట్‌ ఉంటుందని తెలిపింది. జీఎస్టీ వసూళ్ల పరంగా సమస్య ఉండడంతో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం భారీగా ఉండొచ్చని అంచనా వేసింది.    సెంట్రమ్‌ వెల్త్‌ అంచనాలు మూడు రాష్ట్రాల ఎన్నికల్లో

స్వల్ప నష్టాలతో ముగింపు

Tuesday 29th January 2019

చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ నష్టాల నుంచి గట్టెక్కింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ షేర్ల  రికవరీతో సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 64 పాయింట్లను కోల్పోయి 35,592 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 10650 పాయింట్లపైన, 10,652 వద్ద ముగిసింది. ప్రైవేట్‌ రంగ షేర్లైన హెచ్‌డీఎఎఫ్‌సీ బ్యాంక్, యస్‌బ్యాంక్‌ కోటక్‌ బ్యాంక్‌ 1శాతం పతనం కారణంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ

Most from this category