STOCKS

News


నెలరోజుల కోసం 3 సిఫార్సులు

Monday 12th November 2018
Markets_main1542000247.png-21891

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. శుక్రవారం ముగింపుతో పోల్చితే నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,608 వద్ద ట్రేటింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 10,645 వద్దకు చేరుకుంది. ఇక ఈ సూచీ కీలక నిరోధస్థాయి 10,690 పాయింట్ల వద్ద ఉండగా.. మద్దతు 10,450 వద్ద ఉన్నట్లు 5నాన్స్.కామ్ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ దినేష్‌ రోహిరా అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికస్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉండవచ్చని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆయన.. ఇంకొంత కాలం ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు కొనసాగించడం మంచిదని సూచించారు. వచ్చే నెలరోజుల కోసం మూడు షేర్లను సిఫార్సు చేశారు. వీటిలో రెండు బై కాల్స్‌ ఉండగా.. మరోకటి సెల్‌ కాల్‌ ఉన్నాయి. అవేంటంటే..

గ్లెన్‌మార్క్ ఫార్మా  | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్: రూ.705 | స్టాప్ లాస్‌: రూ.655 | రాబడి అంచనా 4 శాతం
గడిచిన మూడు నెలల చార్టును ఒకసారి పరిశీలిస్తే.. రూ.712-705 స్థాయి నుంచి రూ.579-574 స్థాయికి పడిపోయిన ఈ షేరు గడిచిన నెలరోజుల నుంచి నెమ్మదిగా అమ్మకాల ఒత్తిడి నుంచి బయటపడుతోంది. రూ.570 వద్ద మద్దతు తీసుకున్న ఈ షేరు దీర్ఘకాల కదలికల సగటైన రూ.611-606 స్థాయి నుంచి గణనీయమైన వాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ సాధించింది. వీక్లీ ఆర్‌ఎస్‌ఐ 62 స్థాయి వద్ద అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.676 వద్ద ట్రేడవుతున్న ఈ షేరు నెలరోజుల వ్యవధిలో రూ.705 వద్దకు చేరవచ్చని భావిస్తున్నట్లు దినేష్‌ రోహిరా వెల్లడించారు. కచ్చితంగా రూ.655 వద్ద స్టాప్ లాస్‌ నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ | సిఫార్సు: కొనొచ్చు | టార్గెట్: రూ.579 | స్టాప్ లాస్‌: రూ.521 | రాబడి అంచనా 5 శాతం
రూ.651 వద్ద నుంచి ఒక్కసారిగా భారీ పతనాన్ని చూసిన ఈ షేరు గడిచిన రెండునెలల్లో రూ.483-438 స్థాయికి పడిపోయింది. ఆ తరువాత రూ.440 వద్ద మద్దతు తీసుకుని.. తాజాగా 200-రోజుల ఈఎంఏ స్థాయి అయిన రూ.528ను అధిగమించింది. ఆర్‌ఎస్‌ఐ 58 స్థాయితో ప్రస్తుతం మూవ్‌మెంటమ్‌ ఇండికేటర్‌ సానుకూలంగా ఉండగా.. వచ్చే సెషన్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఉండవచ్చని, సింగిల్‌ లైన్‌ ఎగువన కొనసాగనుందని వివరించారు. ప్రస్తుతం రూ.543 వద్ద కొనసాగుతున్న ఈ షేరు.. వచ్చే నెలరోజుల్లో రూ.579 వద్దకు చేరవచ్చని అంచనావేశారు. కచ్చితంగా రూ.521 వద్ద స్టాప్ లాస్‌ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారయన.

సిప్లా | సిఫార్సు: సెల్ | టార్గెట్: రూ.510 | స్టాప్ లాస్‌: రూ.540 | రాబడి అంచనా 3 శాతం
అంతకుముందు ఆరు నెలలపాటు ర్యాలీలో కొనసాగిన ఈ షేరు ట్రెండ్‌ రివర్స్‌ అయిన నేపథ్యంలో గడిచిన కొద్ది సెషన్ల నుంచి నష్టాల బాటలో ప్రయానిస్తోంది. 200-రోజుల కదలికల సగటైన రూ.565 స్థాయి నుంచి గతవారంలో బ్రేక్‌డౌన్‌ను నమోదుచేసింది. గణనీయమైన వాల్యూమ్స్‌తో వీక్లీ చార్టులో ఈ షేరు లాంగ్‌ బేరిష్‌ పాట్రన్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం రూ.480 వద్ద ఉన్నటువంటి కీలక మద్దతు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, డౌన్‌వార్డ్‌ ర్యాలీ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెలరోజుల్లో రూ.510 వద్దకు చేరుకుంటుందనే లక్ష్యంతో షేరును అమ్మివేయవచ్చని సూచించిన ఆయన.. రూ.540 వద్ద వద్ద స్టాప్ లాస్‌ నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.

ఇవి కేవలం 5నాన్స్.కామ్ సీఈఓ దినేష్‌ రోహిరా అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

అప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఆకర్షణీయం కాదు

Monday 12th November 2018

ప్ర: నేను గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 3 లేదా 4 మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలకు చెందిన ఫండ్స్‌ ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై రూ. 1 లక్ష వరకూ మినహాయింపు ఉంది కదా ! ఈ మినహాయింపు అన్నింటికీ కలిపి వర్తిస్తుందా ? ఒక్కో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్స్‌కే వర్తిస్తుందా ?  -రవీందర్‌, విజయవాడ  జ:

34,811-35,287 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు

Monday 12th November 2018

వరుసగా రెండు నెలలపాటు భారీ విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో...ఒక్కరోజు మినహా నికర కొనుగోళ్లు జరపడం సానుకూలాంశం. రూపాయి కోలుకోవడం, క్రూడ్‌ ధర భారీగా పతనంకావడం ఇందుకు కారణం కావొచ్చు. అయితే అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాల కారణంగా గత శుక్రవారం ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే మరో

Most from this category