STOCKS

News


మధ్య కాలానికి మూడు స్టాక్‌ రికమండేషన్స్‌

Monday 17th September 2018
Markets_main1537123725.png-20298

గత వారంలో మొదటి రెండు సెషన్లలో మార్కెట్లు 1,000 పాయింట్ల వరకు పడిపోయి ఆ తర్వాత వేగంగా రికవరీ అయ్యాయి. అయితే, మొత్తం మీద వారంలో మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. గత వారం మార్కెట్ల కనిష్ట స్థాయి మద్దతుగాను, గరిష్ట స్థాయి నిరోధంగాను పనిచేస్తాయని, వచ్చే పక్షం రోజుల పాటు ఈ శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చని  ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్గియాన్‌ తెలిపారు. మన మార్కెట్లు అధిక విలువకు చేరడం, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, ఎన్నికల కాలం సమీపిస్తుండడంతో మరి కొంత కాలం పాటు మార్కెట్లలో అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, మధ్య, దీర్ఘకాలానికి మన మార్కెట్లకు మంచి భవిష్యత్తు ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్గియాన్‌ మధ్య, దీర్ఘకాలానికి పెట్టుబడుల కోసం మూడు స్టాక్స్‌ను సూచించారు. 

 

దివిస్‌ ల్యాబ్స్‌
వివిధ విభాగాలకు చెందిన 122 ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో కలిగిన దివిస్‌ దేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. వార్షికంగా చూస్తే ఆదాయం 21.2 శాతం, ఎబిట్డా 43.7 శాతం చొప్పున పెరిగాయి. పన్ను అనంతరం లాభం 50.8 శాతం వృద్ధి చెంది రూ.266.16 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్లు జూన్‌ క్వార్టర్లో 35.4 శాతంగా ఉంటే, మార్చి క్వార్టర్లో 35.5 శాతం, గతేడాది జూన్‌ క్వార్టర్లో 29.8 శాతంగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరానికి 500 శాతం డివిడెండ్‌ చెల్లించింది. ప్రస్తుత మార్కె్‌ట్‌ ధర ప్రకారం పీఈ 36.5. సాంకేతికంగా చూస్తే డెయిలీ చార్ట్‌లో ఫ్లాగ్‌ ప్యాటర్న్‌ బ్రేకవుట్‌ చేసింది. ఇది బుల్లిష్‌కు సంకేతం. మధ్య కాలానికి కొనుగోలు చేయవచ్చన్నది మా సిఫారసు.

 

సోనాటా సాఫ్ట్‌వేర్‌
సొనాటా సాఫ్ట్‌వేర్‌ జూన్‌ త్రైమాసికంలో మంచి పనితీరు ప్రదర్శించింది. లాభం 34 శాతం వృద్ధితో 57.6 కోట్లకు చేరింది. ఎబిట్డా సైతం 29 శాతం వృద్ధితో 83.1 కోట్లుగా నమోదైంది. ఆదాయం 8 శాతం పెరిగి రూ.688 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా మార్జిన్‌ 7.51 శాతం నుంచి 10.66 శాతానికి మెరుగుపడింది. ఈ స్టాక్‌ 19.8 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతోంది. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో కంపెనీ పనితీరును గమనిస్తే ఆదాయ వృద్ధి వార్షికంగా 15 శాతం చొప్పున, పన్ను అనంతరం లాభం 25 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ ఈ రెండూ 25 శాతానికిపైనే ఉన్నాయి. డెయిలీ, వీక్లీ చార్ట్‌ల్లో కంపెనీ చక్కగా ఉంది. కనుక మధ్య కాలానికి కొనుగోలు చేయవచ్చన్నది సిఫారసు.

 

మేఘమణి ఆర్గానిక్స్‌
పీహెచ్‌థాలోసియానిన్‌ ఆధారిత పిగ్మెంట్లలో ప్రపంచంలోనే టాప్‌-3లో ఒకటి. 14 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ వాటా ఈ కంపెనీకి ఉంది. పన్ను అనంతరం లాభం గత ఐదు సంవత్సరాల్లో వార్షికంగా 61 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. ఇదే కాలంలో ఎబిట్డా మార్జిన్‌ 16.6 శాతం నుంచి 23.9 శాతానికి పెరిగింది. జూన్‌ క్వార్టర్‌కు మంచి ఫలితాలను ప్రకటించింది. విక్రయాలు 13.1 శాతం, ఎబిట్డా 36 శాతం, లాభం 78 శాతం చొప్పున వార్షికంగా అంతకుముందు ఇదే కాలంలో చూస్తే పెరిగాయి. ప్రస్తుత ధర ప్రకారం స్టాక్‌ 11.2 పీఈ వద్ద అందుబాటులో ఉంది. దీర్ఘకాలంలో ఈస్టాక్‌ అద్భుతమైన రాబడులను ఇస్తుందని నమ్ముతున్నాం. కనుక దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఈ స్టాక్‌ను సూచిస్తున్నాం.

నోట్‌: అనలిస్ట్‌ల సిఫారసులు కేవలం అవగాహన కోసమే. పెట్టుబడులకు ముందు పూర్తి స్థాయిలో విచారించుకుని, నిపుణల సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలని మనవి. You may be interested

మీ ఎస్‌బీఐ యావరేజ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు ఇలా...

Monday 17th September 2018

బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాదారులు అందరూ తమ ఖాతాల్లో నెలవారీ సగటు బ్యాలన్స్‌ (ఎంఏబీ) నిర్వహించడం తప్పనిసరి. ఎస్‌బీఐ ఖాతాదారుల విషయంలో ఈ ఎంఏబీ అన్నది వారి బ్యాంకు శాఖ నగరంలోనా లేదా పట్టణం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉందా అన్నదాన్ని బట్టి మారిపోతుంది. నెలవారీ సగటు బ్యాలన్స్‌ నిర్వహణలో విఫలం అయితే, ఖాతాదారుల నుంచి బ్యాంకులు చార్జీలు రాబట్టుకుంటాయి. ఓ నివేదిక ప్రకారం 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, 3 ప్రైవేటు

పదేళ్లలో పదివేల శాతం రాబడులను ఇచ్చిన స్టాక్స్‌

Monday 17th September 2018

స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పెట్టుబడి నాడి తెలిస్తే సామాన్యులు సైతం కుబేరులవుతారనడానికి ఎన్నో ఉదాహరణలు, నిదర్శనాలు ఉన్నాయి. ఎవరినో చూసి ఫాలో అయిపోకుండా తెలివైన ఇన్వెస్టర్లు పూర్తి అవగాహనతో, సరైన అడుగులు వేస్తే స్టాక్‌ మార్కెట్లో మంచి రాబడులనే సమకూర్చుకోవచ్చు. ఇందుకు ఈ స్టాక్సే నిదర్శనం.   2008లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు పెద్ద పతనా‍న్ని చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదలో 40 శాతం ఆవిరైపోయింది. లెహమాన్‌ బ్రదర్స్‌ 2008లోనే దివాలా తీసింది. దాంతో

Most from this category