STOCKS

News


తక్షణ మద్దతు శ్రేణి 39,040-38,975 పాయింట్లు

Monday 22nd April 2019
Markets_main1555913467.png-25259

ఎట్టకేలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం డబుల్‌టాప్‌ను అధిగమించి, భారత్‌ మార్కెట్‌ దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ ఇంకా కొనసాగుతుందని రుజువుచేసింది. అంటే..సమీప భవిష్యత్తులో వివిధ అంశాల కారణంగా మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనైనా, రానున్న నెలల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను భారత్‌ సూచీలు చేరతాయనే విశ్వాసాన్ని ఇన్వెస్టర్లకు గతవారం ట్రెండ్‌ కల్పించింది. కార్పొరేట​ దిగ్గజం రిలయన​‍్స ఇండస్ట్రీస​...శుక్రవారం మార్కెట్‌​ ముగిసిన తర్వాత వెల్లడించిన ఫలితాలపై  షేరు స్పందన సోమవారం తెలుస్తుంది. మరిన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈ వారం వెల్లడికానున్నాయి. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. అలాగే ఏప్రిల్‌​ డెరివేటివ​ కాంట్రాక్టుల ముగింపు కూడా ఈ వారమే. ఈ నేపథ్యంలో గరిష్టస్థాయి వద్ద మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనుకావొచ్చు. ఇక  సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఏప్రిల్‌ 18తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్‌వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌  39,040-38,460 శ్రేణిని ఛేదించినంతనే వేగంగా 39,487 పాయింట్ల వద్ద కొత్త రికార్డు సృష్టించింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 373 పాయింట్ల లాభంతో 39,140 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సోమవారం  మార్కెట్‌ పెరిగితే  39,280 పాయింట్ల వద్ద తొలి నిరోధాన్ని చవిచూడవచ్చు. ఈ స్థాయిని దాటితే 39,425 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ స్థాయి ఎగువన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్‌​ సాధ్యపడి సెన్సెక​‍్స 39,680 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం వుంటుంది. ఈ వారం రెండో నిరోధస్థాయిని దాటలేకపోయినా, సోమవారం బలహీనంగా ప్రారంభమైనా ఏప్రిల్‌ 17నాటి గ్యాప్‌అప్‌ శ్రేణి 39,040-38,975 పాయింట్ల శ్రేణి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణి దిగువన వేగంగా 38,780 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 38,555 పాయింట్ల స్థాయికి  పడిపోవొచ్చు. 

నిఫ్టీ తక్షణ మద్దతు శ్రేణి 11,731-11,705
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతకాలమ్‌లో సూచించిన రీతిలోనే 11,760 పాయిట్లసా​‍్థయిని అధిగమించగానే వేగంగా 11,830 పాయింట్ల రికార్డు గరిష్టానికి చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 110 పాయింట్ల లాభంతో 11,753 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్‌ 18 ప్రి-మార్కెట్‌ సెషన్‌లో నిఫ్టీ 11,856 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదుచేసినప్పటికీ, వాస్తవ ట్రేడింగ్‌లో గరిష్టస్థాయి 11,830 పాయింట్లు అయినందున, భవిష్యత్‌ కదలికల్లో ఇదే స్థాయి సాంకేతికంగా ముఖ్యమైనది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 11,790 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 11,830 పాయింట్ల స్థాయి వద్ద గట్టి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,910 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం రెండో అవరోధాన్ని ఛేదించలేకపోయినా, సోమవారం బలహీనంగా మొదలైనా 11,731-11,705 శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిని కోల్పోతే 11,645 పాయింట్ల  వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,605 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. 



You may be interested

భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నా.. నాలుగు, ఐదు ఫండ్స్‌ సరిపోతాయా

Monday 22nd April 2019

ప్ర: ఈ ఏడాదే నేను రిటైర్‌ కాబోతున్నాను. రిటై‍ర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.50 లక్షల వరకూ వస్తాయి. దీంతో రూ.15 లక్షల మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మరో రూ.9 లక్షలను పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాను. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? అశోక్‌, విజయవాడ  జ: ఈ వివరాలు ఆధారంగా మీ ఆర్థిక

క్యూ4 ఫలితాలతో దిశా నిర్దేశం

Monday 22nd April 2019

- ఏప్రిల్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే.. - కొనసాగుతున్న పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఏసీసీ ఫలితాల వెల్లడి ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్‌ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు

Most from this category