News


సెన్సెక్స్‌ తక్షణ నిరోధశ్రేణి 39,120-39,270

Tuesday 9th April 2019
Markets_main1554791950.png-25021

వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్‌ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్‌ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్‌, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేసాయి. అమెరికా కేంద్రబ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు.  కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 189 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 39,120-39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. 
నిఫ్టీ అవరోధశ్రేణి 11,730-11,760
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలుత 11,730-760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్‌టాప్‌గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల  వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. You may be interested

కాలంతోపాటే మారాలి ప్రణాళిక

Tuesday 9th April 2019

మార్చుకోకపోతే లక్ష్యాలకు దూరం! రిటైర్మెంట్‌ అవసరాల కోసం అధిక కేటాయింపులు అత్యవసరాలకూ అదనపు నిధి ఈక్విటీలకు అగ్ర ప్రాధాన్యం డెట్‌ సాధనాల్లో కొంత మేర మారుతున్న పరిస్థితులతో ఆర్థిక ప్రణాళికల్లోనూ మార్పులు రుణం తీసుకొని ఇన్వెస్ట్‌ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే

బహుమతిగా వచ్చిన సొమ్ములు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి ?

Tuesday 9th April 2019

ప్ర: మా మొదటి పాప రెండో పుట్టిన రోజు సందర్భంగా మా అత్తగారు రూ.లక్ష బహుమతిగా ఇచ్చారు. దీంట్లో సగం మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, మిగిలినమొత్తాన్ని ఏదైనా లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌లో గానీ, ఇండెక్స్‌ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నా కూతురితో పాటు ఈ సొమ్ములు కూడా పెరగాలనేది నా పెట్టుబడి వ్యూహం. ఈ వ్యూహం సరైన ఫలితాలనిస్తుందా ?  -ఆనంద్‌, నెల్లూరు  జ: పదేళ్లు, అంతకు మించి ఇన్వెస్ట్‌

Most from this category