STOCKS

News


37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్‌

Monday 25th March 2019
Markets_main1553501970.png-24785

ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్‌ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్‌ తగ్గించింది. ఇప్పటికే యూరప్‌, చైనా, జపాన్‌ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్‌ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38 565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన   38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు. 

నిఫ్టీ తక్షణ మద్దతు 11,345
గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,572  పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు  అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11, 570 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630 పాయింట్ల వరకూ పెరగవచ్చు.You may be interested

ఫండ్స్‌ లాభాలతో కారు లోన్‌ తీర్చేయవచ్చా ? (ధీరేంద్ర కాలమ్‌)

Monday 25th March 2019

ప్ర: నేను గత మూడేళ్లుగా నెలకు రూ.15,000 చొప్పున రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. మొదట్లో ఈ ఫండ్‌ మంచి రాబడులనే ఇచ్చేది.ఇప్పుడు మాత్రం నష్టాలు వస్తున్నాయి. నేను ఇప్పటిదాకా రూ.4.60,000 ఇన్వెస్ట్‌ చేయగా, ప్రస్తుతం రూ.30,000 నష్టం వచ్చింది. నేను ఈ ఫండ్‌ నుంచి వైదొలగి వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కొన్ని మంచి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌ను సూచించండి.  -హారిక, బెంగళూరు  జ:

ఒడిదుడుకుల వారం..!

Monday 25th March 2019

- గురువారం (28న) మార్చి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు - ద్రవ్య లోటు డేటా, విదేశీ రుణ గణాంకాలు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా ఈవారంలోనే.. - అమెరికా–చైనాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్‌ అంశాలపై దృష్టి - ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందన్న సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: మార్చి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సిరీస్‌ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్‌

Most from this category