STOCKS

News


ఇంత నిరాశపూరిత మార్కెట్‌ ఎప్పుడూ చూడలేదు!

Friday 15th February 2019
Markets_main1550219703.png-24213

సంజీవ్‌ భాసిన్‌
మార్కెట్లో ప్రస్తుతం ఉన్నంత నిరాశాపూరిత ధోరణి ఎప్పుడూ చూడలేదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి పరిస్థితులన్నీ ఇప్పుడే కాస్త చక్కబడుతున్నాయని, కొందరు ప్రమోటర్లు చేసిన తప్పుల ఫలితంగా మొత్తం మార్కెట్‌లో నెగిటివ్‌ భావనలు పెరిగిపోయాయని తెలిపారు. ఇప్పుడింత నిరాశ అవసరం లేదన్నారు. ఏప్రిల్‌ చివరకు తప్పకుండా నిఫ్టీ మరోమారు 11600 పాయింట్లను చేరడం తధ్యమని జోస్యం చెప్పారు. ఈ సారి ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌ కూడా పాల్గొంటాయన్నారు. అంతర్జాతీయ పరిస్థితులన్నీ క్రమంగా పాజిటివ్‌గా మారుతున్నాయని, ఈ సమయంలో నిరాశ అనవసరమని చెప్పారు. నిజమైన ఇన్వెస్టర్లు ఇలాంటి పేలవ వాతావరణాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలచుకుంటారన్నారు. రాబోయే ఆరునెలల్లో చాలా స్టాకుల్లోకి భారీగా నిధులు వస్తాయని అంచనా వేశారు. 
ఎఫ్‌ఎంసీజీ
కన్జూమర్‌గూడ్స్‌ రంగంలో ఐటీసీ షేరు రాబోయే రోజుల్లో అదరగొడుతుందని సంజీవ్‌ చెప్పారు. సిగిరెట్లు మినహా కంపెనీ కాలుమోపిన వ్యాపారాలన్నీ దూసుకుపోతున్నాయని, కంపెనీ దీర్ఘకాలిక విజన్‌ బుల్లిష్‌గా ఉందని చెప్పారు. ఐటీసీతో పాటు మారికో, నెస్లె, డాబర్‌ను సైతం పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు. డాబర్‌ షేరులో ప్రతి కరెక‌్షన్‌ను కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని సూచించారు. డాబర్‌కు సంబంధించిన నెగిటివ్‌నెస్‌ మొత్తం పూర్తయిందన్నారు. ఆటో రంగంలో కాంట్రాబెట్స్‌ను ఎంచుకోవాలన్నారు. ఈ రంగంలో అశోక్‌లేలాండ్‌, ఐషర్‌, హీరోమోటోకార్‌‍్పను ఆయన సిఫార్సు చేశారు. ఫార్మా రంగంలో కూడా 20 శాతం వరకు ర్యాలీ ఉండొచ్చని చెప్పారు. 



You may be interested

రిటైలర్ల ‘స్టార్‌’ బ్యాంకు... ఈ కంపెనీ!

Saturday 16th February 2019

ఒకప్పుడు చిన్న బ్యాంకు... ఇప్పుడు మంచి పనితీరుతో అగ్ర స్థాయి బ్యాంకుగా మారే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అదే సిటీ యూనియన్‌ బ్యాంకు. తమిళనాడులోని కుంభకోణం కేంద్రంగా నడిచే ఈ బ్యాంకు గడిచిన 12 నెలల కాలంలో స్టాక్‌ మార్కెట్లో 27 శాతం రాబడులను ఇచ్చింది. బ్యాంకెక్స్‌ సూచీలో యాక్సిస్‌ బ్యాంకు తర్వాత అత్యధిక రాబడులను ఇచ్చిన బ్యాంకు ఇదే.  ప్రధానంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు

ఎయిర్‌బస్‌ ఏ380... గుడ్‌బై!!

Friday 15th February 2019

2021 నుంచి తయారీ నిలిపివేత కొనేవారు లేకపోవడంతో సంస్థ నిర్ణయం టౌలౌజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్‌బస్‌ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌బస్‌ తాజాగా ప్రకటించింది. ప్రధాన కస్టమర్‌ అయిన ఎమిరేట్స్‌ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని

Most from this category