STOCKS

News


త్వరలో భారత్‌22 ఈటీఎఫ్‌ మూడో విడత ఇష్యూ

Monday 17th December 2018
Markets_main1545035096.png-22997

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా మూడో విడత భారత్‌-22 ఈటీఎఫ్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఇష్యూ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనుకుంటోంది. భారత్‌-22 ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ గత రెండు ఇష్యూల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.22,900 కోట్లను సమీకరించింది. 2017 నవంబర్‌లో తొలి విడత రూ.14,500 కోట్లు, 2018 జూన్‌లో మలివిడత రూ.8,400 కోట్లు రాబట్టుకుంది. ‘‘మూడో విడత ఇష్యూ ఫిబ్రవరిలో ప్రారంభించే ప్రణాళిక ఉంది. ఈ ఆఫర్‌ రూ.5,000 కోట్ల కనీస సేకరణతో ఉంటుంది. అధిక బిడ్లు వస్తే గ్రీన్‌షూ ఆప్షన్‌తో అవసరమైతే రూ.10,000 కోట్ల వరకు సమీకరించే అప్షన్‌ కలిగి ఉంటుంది’’ అని ఓ అధికారి తెలిపారు. మూడో విడత ఇష్యూ అనంతరం ఈటీఎఫ్‌ హోల్డింగ్స్‌ను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా 53 శాతాని కంటే తగ్గిపోవడమే కారణమని చెప్పారు. ఓఎన్‌జీసీ, ఐవోసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, నాల్కో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్‌, గెయిల్‌, పీజీసీఐఎల్‌, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా ఉన్నాయి. ఇక యాక్సిస్‌ బ్యాంకు, ఐటీసీ, ఎల్‌అండ్‌టీలో ప్రభుత్వం తనకున్న వాటాలను కూడా ఇందులో చేర్చింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఇష్యూ ద్వారా రూ.17,300 కోట్లను సమీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. 



You may be interested

పాత వాహనాల రిప్లేస్‌మెంట్‌కు ప్రోత్సాహకాలివ్వాలి..

Monday 17th December 2018

న్యూఢిల్లీ: వాహనదారులు కాలుష్యకారక పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ కోరింది. ఇందులో భాగంగా 2000కు పూర్వం రిజిస్టరయిన వాహనాలను రీప్లేస్‌ చేసేందుకు పన్నులపరంగా రిబేట్ ఇవ్వడం వంటి వన్‌ టైమ్ ప్రోత్సాహకాలను పరిశీలించవచ్చని పేర్కొంది. భారీ పరిశ్రమల శాఖ నిర్వహించిన ప్రీ-బడ్జెట్‌ సమావేశంలో ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు ఈ మేరకు అభిప్రాయం తెలిపారు.  దాదాపు 15

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి కదలికలే కీలకం..!

Monday 17th December 2018

న్యూఢిల్లీ: అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్‌ ముందుగానే డిస్కౌంట్‌ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్

Most from this category