STOCKS

News


నష్టాలను అధిగమించాలంటే వీటిని మర్చిపోవద్దు..!

Monday 8th April 2019
Markets_main1554662595.png-25000

స్టాక్‌ మార్కెట్‌ అంటే అనిశ్చితి. ఎప్పుడు మార్కెట్లు ఏ టర్న్‌ తీసుకుంటాయో ఎవరూ చెప్పజాలరు. మరి ఈ అస్థిరతలను ఎలా అధిగమించాలన్నది తెలిసిన ఇన్వెస్టర్లు తక్కువ మందే ఉంటారు. స్టాక్స్‌ ఇన్వెస్టింగ్‌ను జూదంలా భావించి, నష్టపోయి మార్కెట్‌ను వీడేవారూ ఉన్నారు. కానీ, స్టాక్‌ మార్కెట్‌ అన్ని సాధనాల్లోకి మెరుగైన రాబడులను ఇస్తుందని ప్రపంచవ్యాప్తంగా చరిత్ర చెబుతోంది. కనుక ఈక్విటీలను రాబడుల వనరుగా మార్చుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ సూచించారు. 

 

టిప్స్‌తో కొనుగోళ్లు
తగిన బేస్‌ లేకుండా, విశ్వసనీయమైన వేదిక ద్వారా కాకుండా వచ్చే టిప్స్‌ను నమ్మడం మంచిది కాదు. మీ సామర్థ్యాలను ప్రధానంగా నమ్ముకోవాలి. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆ కంపెనీకి సంబంధించి ఆర్థిక విషయాలన్నింటి గురించి తగిన పరిశోధన చేయాలి. ఆర్థిక అంశాల గురించి అవగాహన చేసుకునేంత పరిజ్ఞానం లేకుంటే, కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవాలి. ముఖ్యంగా కంపెనీ ఇన్‌కమ్‌ స్టేట్‌మెంట్‌, బ్యాలన్స్‌ షీటు, క్యాష్‌ ఫ్లో నివేదికలను కచ్చితంగా అర్థం చేసుకోవడం అవసరం. ఓ కంపెనీ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో ఇవి చెప్పేస్తాయి. 

 

వడపోతలు
ఓ స్టాక్‌ను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు తగిన వడపోతలు పోయడం తప్పనిసరి. మార్కెట్‌ క్యాప్‌, డివిడెండ్‌ రాబడి, ఇతర అంశాల విషయంలో ఏ కంపెనీలు మెరుగ్గా ఉన్నదీ తెలుసుకునేందుకు ఇవి అవసరం. కంఎనీకి ఎంత డెట్‌ (రుణం) ఉన్నదీ ముఖ్యంగా చూడాల్సిన అంశం. నిర్ణీత కాలంలో ఈ డెట్‌ క్రమంగా పెరుగుతూ వస్తోందా, లేక తగ్గుతుందా అన్నది చూడాలి. రుణ భారం ఎక్కువగా ఉంటే కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీల చెల్లింపులకే సరిపోతుంది. ఇక వైవిధ్యం కూడా ఎంపికలో పాటించి తీరాలి. 

 

అందరిలో ఒకరిలా
చాలా మంది ఇన్వెస్టర్లు ఓ స్టాక్‌ ఇటీవలి పనితీరునే పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇటీవలి ర్యాలీలో పాల్గొనలేకపోయానే అన్న ఆందోళన తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. కొన్ని అంశాల ఆధారంగా ఓ నిర్ణీత కాలంలో ఓ స్టాక్‌ మంచి ర్యాలీ చేసిందంటే అందులో నుంచి స్మార్ట్‌ పెట్టుబడులు బయటకు వెళ్లిపోతాయి. అప్పటి వరకు ర్యాలీ చూసి ఉద్రేకం చెందిన వారు అందులోకి అడుగు పెడితే ఓ నిర్ణీత కాలం వరకు రాబడుల్లేకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనవచ్చు. 

 

సైక్లికల్‌ కంపెనీలు
ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించగలరు? అన్న ప్రశ్నకు సమాధానం ఉండాలి. సైక్లికల్‌ స్టాక్స్‌లో ఎక్కువ ఆటుపోట్లు ఉంటాయి. సైకిల్‌ ముగిసే దశలో బాగా ర్యాలీ చేస్తాయి. అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించే వారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సైక్లికల్‌ స్టాక్స్‌ విషయంలో దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సైకిల్‌ రివర్స్‌ అయితే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. మళ్లీ బుల్‌ సైకిల్‌ వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి లేదంటే నష్టాలను బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటారు. You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 8th April 2019

ఈ వారం తొలి ట్రేడింగ్‌ రోజున భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పలాభంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 8.45  గంటలకు 7 పాయింట్ల లాభంతో11,767 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,760 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌ మినహా మిగిలిన సూచీలన్నీ

స్వల్ప కరెక్షన్‌ కొనుగోలుకు అవకాశం...

Monday 8th April 2019

నిఫ్టీ సానుకూల స్థాయిల్లో ఉందని, చిన్న కరెక్షన్‌లు వస్తే కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ షెట్టి పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిఫ్టీ మద్దుతు స్థాయిల గురించి మాట్లాడుతూ... నిఫ్టీ స్వల్ప కాల ట్రెండ్‌ సానుకూలంగా ఉందన్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 11,500-11,550 స్థాయిల్లో ఉందని ఈ  స్థాయిల వరకు మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే

Most from this category