STOCKS

News


మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేశారా?

Tuesday 26th March 2019
Markets_main1553538840.png-24791

హావెల్స్‌ కంపెనీలో 1997లో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే... ఆ షేర్ల విలువ ఇప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రూ.3.50 కోట్లు. మిడ్‌క్యాప్‌ సత్తా అంటే ఇదే మరి. అయితే, అలా అని కొన్న ప్రతీ కంపెనీ ఈ స్థాయిలో ర్యాలీ చేస్తుందనుకోవద్దు. కాకపోతే ఈ తరహా భారీ రాబడులను ఇచ్చిన షేర్ల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. అయితే, స్మాల్‌, మిడ్‌క్యాప్‌లో ఇ‍న్వెస్ట్‌ చేసిన వారికి  2018 సంవత్సరం కఠిన పరీక్షా కాలంగా నిలిచింది. కొన్ని స్టాక్స్‌ 50 శాతానికి పైగా నష్టపోయాయి. అందుకే రాబడులు, రిస్క్‌ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలను ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఏవీపీ అమర్‌జీత్‌ మౌర్య తెలియజేశారు. 

 

చెక్‌లిస్ట్‌

  • గత పనితీరు ఆధారంగా అనిశ్చితి సమయాల్లో ఇది మంచి షేరు అని చెప్పడానికి లేదు. గడిచిన నాలుగైదేళ్లలో స్థిరమైన పనితీరే ప్రామాణికం. 
  • స్థూల ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండే ఒత్తిడులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మిడ్‌క్యాప్‌ ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు వడ్డీ రేట్లు, ఎన్‌పీఏ అంశాల పట్ల సున్నితంగా ఉంటాయి. మిడ్‌క్యాప్‌ ఆటో విడిభాగాల కంపెనీలు అంతర్జాతీయ డిమాండ్‌, ఆటోమొబైల్‌ ధోరణలతో ప్రభావితం అవుతుంటాయి. మిడ్‌క్యాప్‌ మెటల్స్‌ సైతం అధిక తయారీ సామర్థ్యంతో సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. 
  • మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను నిఫ్టీ లేదా సెన్సెక్స్‌తో అదే పనిగా పోల్చి చూడొద్దు. మిడ్‌క్యాప్‌లో ఆల్ఫా కోసమే కానీ బీటా కోసం కాదు మీరున్నది. బెంచ్‌ మార్క్‌ రాబడులతో కాకుండా అబ్జల్యూట్‌ రాబడులను (నిర్ణీత కాలంలో ఎంత మేర ఇచ్చింది) పరిగణనలోకి తీసుకుని చూడాలి. 
  • మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు లిక్విడిటీ చాలా కీలకమైనది. ఎందుకంటే ధరల పరంగా నష్టపోకుండా బయట పడాలంటే ఆ కౌంటర్లో తగినంత లిక్విడిటీ ఉండాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ భారీగా కొనుగోలు చేసిన వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి కౌంటర్లు ఒకేసారి అమ్మకాలతో  ప్రభావితం కూడా అవుతుంటాయి.
  • ప్రమోటర్లు 50 శాతం కంటే ఎక్కువ వాటాలు తనఖాలో పెడితే, అటువంటి మిడ్‌క్యాప్‌ కంపెనీలకు దూరంగా ఉండాలి. ధరలు పడిపోతే ఈ తరహా షేర్లు ఒత్తిడికి లోనవుతాయి. ప్రమోటర్లు అదనపు మార్జిన్లను సమకూర్చకపోతే రుణాలిచ్చిన సంస్థలు షేర్లను ఒకేసారి అమ్మేస్తాయి. 
  • మిడ్‌క్యాప్‌కు ఎంత పెట్టుబడులు కేటాయింపున్నది ముందే నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండాలి. టార్గెట్‌ రీచ్‌ అయిన వెంటనే లాభాలను బుక్‌ చేసుకుని లార్జ్‌క్యాప్‌కు షిప్ట్‌ అయిపోవాలి. 
  • యాజమాన్యం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలపై కన్నేయాలి. యాజమాన్యం నాణ్యతే కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఆడిటర్‌ నివేదికలు, అనలిస్ట్‌ల నివేదికలను పరిశీలిస్తూ ఉండాలి. 
  • నిఫ్టీ అప్‌వర్డ్‌లో కంటే డౌన్‌వర్డ్‌లో మిడ్‌క్యాప్‌ పనితీరును పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఎందుకంటే బుల్‌ మార్కెట్లలో మిడ్‌క్యాప్‌ మంచి పనితీరే చూపిస్తాయి. కానీ, డౌన్‌ మార్కెట్‌లో స్టాక్స్‌ నిలకడ సులభంగా తెలిసిపోతుంది. 
     You may be interested

ఎన్నికల ఫలితాల వరకు బుల్లిష్‌ మూమెంటమ్‌...

Tuesday 26th March 2019

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈక్విటీ మార్కెట్లలో బుల్లిష్‌నెస్‌ ఉంటుందని ఈక్విటీ 99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణతో సూచీలు నష్టపోయినట్టు చెప్పారు. బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ఫిబ్రవరి 19 నుంచి నిఫ్టీ 987 పాయింట్లు పెరిగిందని, ఫిబ్రవరి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. మార్చి నెలలో విదేశీ నిధుల పెట్టుబడులు ఈ

38000 దిగువన సెన్సెక్స్‌ ముగింపు

Monday 25th March 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు మార్కెట్‌ రెండోరోజూ ముంచేశాయి. వరుస ర్యాలీ అనంతరం గత శుక్రవారం క్షీణించిన భారత్‌ సూచీలు సోమవారం సైతం పతనమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సెన్సెక్స్‌ 38000 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయింది. అన్ని రంగ షేర్లలో తీవ్రతరమైన అమ్మకాలతో సెన్సెక్స్‌ 355 పాయింట్లు పతనమై 37,809 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లను నష్టపోయి 11,354 వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర

Most from this category