STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 9th November 2018
Markets_main1541734783.png-21799

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.04 శాతం లేదా 10 పాయిం‍ట్ల లాభంతో 26,191 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.25 శాతం లేదా 7 పాయింట్ల నష్టంతో 2,806 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.53 శాతం లేదా 39 పాయింట్ల నష్టంతో 7,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ స్టాక్స్‌ బాగా పడిపోయాయి.

♦ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 26 పాయింట్ల నష్టంతో 3,066 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 115 పాయిం‍ట్ల నష్టంతో 9,830 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 2,617 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,086 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 544 పాయింట్ల నష్టంతో 25,682 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 148 పాయింట్ల నష్టంతో 22,338 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 34 పాయింట్ల నష్టంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది.

♦ నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐఎల్‌)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ♦ డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి 73.44 శాతం వాటా ఉంది.

♦ వచ్చే ఏడాదిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో సమావేశమయ్యే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

♦ ఇండియన్‌ జీడీపీ రేటు 2019లో 7.3 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ అంచనా వేసింది.

♦ రిజర్వు బ్యాంక్‌ వచ్చే ఏడాది మార్చి కల్లా డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసే అవకాశముంది.

♦ దాదాపు 74 కంపెనీలు శుక్రవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో ఇండియా సిమెంట్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌, అమరరాజా బ్యాటరీస్‌, టైటాన్‌, ఈఐడీ ప్యారీ, బీజీఆర్‌ ఎనర్జీ వంటి కంపెనీలున్నాయి.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 9th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గెయిల్‌ ఇండియా:- బురానీ - గౌహతీ పట్టణాల మధ్య 616 కిలోమీటర్ల గ్యాస్‌ లైన్‌ నిర్మాణానికి సంబంధించి రూ.1100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.   అలహబాద్‌ బ్యాంక్‌:- రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.3054 కోట్లను సమీకరించనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- అక్టోబర్‌లో 14.47 టన్నుల ముడిస్టీల్‌ ఉత్పత్తిని చేసింది. గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి అయిన

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Friday 9th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 34 పాయింట్ల నష్టంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 33 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category